ఈషా రెబ్బా జీవిత చరిత్ర – Isha Rebba biography in Telugu

ఈషా రెబ్బా భారతదేశానికి నటి, ఈమె ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. తెలుగు సినిమాలతో పాటు ఈషా రెబ్బ కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించారు.

బాల్యం:

ఈషా రెబ్బా 19 ఏప్రిల్ 1990 వ సంవత్సరంలో వరంగల్ లో జన్మించారు మరియు హైదరాబద్ లో పెరిగారు.

ఈషా MBA డిగ్రీ కలిగి ఉన్నారు, కాలేజీ లో చదువుతున్న సమయంలో ఈషా మోడల్ గా పనిచేసేవారు.

అదే సమయంలో డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి ఆడిషన్ కోసం కాల్ చేసి పిలిచారు.

కెరీర్:

2012 వ సంవత్సరంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” (Life is Beautiful) అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం (debut) చేసారు.

ఆ తరవాతి సంవత్సరం 2013లో “అంతక ముందు ఆ తర్వత” (Anthaka Mundu Aa Tarvatha) సినిమాలో లీడ్ రోల్ చేసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో హిట్ గా నిలిచింది మరియు సౌత్ ఆఫ్రికా లో జరిగిన International Indian Film festival లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయ్యింది.

2015 వ సంవత్సరంలో బందిపోటు (Bandipotu) అనే దోపిడీ మరియు కామెడీ సినిమాలో నటించారు.

2016 వ సంవత్సరంలో ఓయీ (Oyee) అనే తమిళ సినిమాలో నటించారు. 2017 వ సంవత్సరంలో Ami Thumi అనే తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించారు. ఈ సినిమాకు 2 అవార్డులు కూడా లభించాయి. ఇదే సంవత్సరం Darsakudu(దర్శకుడు) అనే తెలుగు సినిమాలో నటించారు.

2018 వ సంవత్సరంలో Awe, Brand Babu (బ్రాండ్ బాబు), Aravinda Sametha Veera Raghava (అరవింద సమేత వీర రాఘవ), Subrahmanyapuram (సుబ్రహ్మణ్యపురం), Savyasachi(సవ్యసాచి) అనే తెలుగు సినిమాలలో నటించారు.

2019 వ సంవత్సరంలో Raagala 24 Gantallo (రాగల 24 గంటల్లో) అనే తెలుగు సినిమాలో నటించారు.

2021 వ సంవత్సరంలో Most Eligible Bachelor (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్) అనే తెలుగు సినిమాలో నటించారు.

2022 వ సంవత్సరంలో Ottu అనే మలయాళం సినిమాలో నటించారు, ఇదే సంవత్సరం Nitham Oru Vaanam అనే తమిళ సినిమాలో నటించారు.

2023 వ సంవత్సరంలో Mama Maschindra (మామా మశ్చింద్ర) అనే తెలుగు సినిమాలో నటించారు.

సినిమాలే కాకుండా ఈషా పలు వెబ్ సిరీస్ లలో నటించారు.

2021 వ సంవత్సరంలో 3 Roses (Aha) మరియు Pitta Kathalu (Netflix) అనే వెబ్ సిరీస్ లో నటించారు.

2023 వ సంవత్సరంలో Maya Bazaar For Sale (ZEE5) మరియు Dayaa (Disney+Hotstar) అనే వెబ్ సిరీస్ లో నటించారు.

Source: Eesha Rebba – Wikipedia

Leave a Comment