Table of Contents
C V రామన్ ఎవరు ?
సర్ చంద్రశేఖర వెంకట రమణ 1888 వ సంవత్సరంలో ఒక తమిల హిందూ ఫామిలీ లో జన్మించారు. CV రామన్ భారత దేశం యొక్క భౌతిక శాస్త్రవేత్తలతో ప్రసిది చెందిన శాస్త్రవేత్త, రామన్ గారు లైట్ స్కేటరింగ్ (కాంతి వికిరణం) గురించి చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి ఇండియా గురించి తెలిసేలా చేసింది.
రామన్ గారు చేసిన పరిశోధన నే ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి ఒక పారదర్శక వస్తువు గుండా ప్రవహించినపుడు కాంతి యొక్క Wavelength మరియు Amplitude మారుతుంది అని రామన్ కనుగొనడం జరిగింది. రామన్ గారు చేసిన కృషి కి గాను 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది.నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్లలో భారత దేశం నుంచి మొట్ట మొదటి వ్యక్తి గా పేర్కొనబడతారు.
బాల్యం :
రామన్ గారు చంద్రశేఖర్ రామనాథన్ ఇయర్, పార్వతి అమ్మాల్ అనే దంపతులకు 1888 వ సంవత్సరంలో 2 వ సంతానంగా జన్మించడం జరిగింది. రామన్ గారు మంచి డబ్బులు సంపాదించే కుటుంబం లో పుట్టారు, రామన్ గారి నాన్న వైజాగ్ కి తరలి వెళ్ళినప్పుడు భౌతిక శాస్త్రాన్నే బోధించేవారు. రామన్ గారు 11 సంవత్సరాలప్పుడు 10 వ తరగతిలో పాసయ్యారు, చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు.
1904 వ సంవత్సరంలో యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి తన B.A డిగ్రీ ని పూర్తి చేసుకున్నారు, ఈ కాలేజీ లో మొదటి స్థానంలో మార్కులు వచ్చినందుకు గాను గోల్డ్ మెడల్ కూడా రావటం జరిగింది. 18 సంవత్సరాలప్పుడు డిఫ్ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ (కాంతి యొక్క విక్షేపం) పై మొదటి సైన్స్ పేపర్ ను రాసారు, రెండవ పేపర్ సర్ పేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్స్ (ద్రవాల ఉపరితల ఉద్రిక్తత) పై రాయటం జరిగింది.
రామన్ తెలివి తేటలను చూసిన తన ప్రొఫెసర్ రిచర్డ్ ఇంగ్లాండ్ వెళ్లి తన పరిశోధన కొనసాగించమని అడిగారు, కానీ రామన్ ఆరోగ్య కారణాల వళ్ళ ఇంగ్లాండ్ ప్రయాణం రద్దు చేసుకున్నారు.
రామన్ తన చదువు ముగించుకున్న తరవాత ప్రొఫెసర్ గా వివిధ కాలేజీ లలో లెక్చర్స్ తీసుకునేవారు. 1943 వ సంవత్సరంలో TCM లిమిటెడ్ అనే కంపెనీ ను కూడా మొదలుపెట్టారు.
సైన్స్ లో రామన్ చేసిన కృషి :
సంగీతంలో ధ్వని కంపనాలు:
రామన్ గారు సంగీతానికి సంబంధించిన సాధనాలలో కలిగే కంపనలను చదవటం మొదలుపెట్టారు, భారతదేశంలో ఉపయోగించే డ్రమ్స్, తబలా, మ్రిదంగం లాంటి సాధనాల గురించి మరియు అవి పుట్టించే కంపనలను గురించి కూడా చదివారు.
సముద్రం యొక్క రంగు :
CV రామన్ గారు ఇంగ్లాండ్ నుండి ఇండియా తిరిగి వస్తున్నప్పుడు సముద్రం లోని నీటి రంగు నీలి రంగులో ఉండటానికి కారణం కాంతి వికిరణం అని తెలిపారు.
ఈ ప్రయాణం ఒక నౌక ద్వారా జరిగినందున తన వద్ద ఉన్న కొద్దీ పరికరాలతో ఈ ప్రయోగాలను చేశారు మరియు తన ప్రయాణం పూర్తి అయ్యే ముందు ఒక ఆర్టికల్ “The colour of the sea” కూడా రాసారు.
రామన్ ఎఫెక్ట్ :
కాంతి ఒక దుమ్ము లేని పారదర్శక రసాయన సమ్మేళనం గుండా ప్రవహించినప్పుడు ఆ కాంతి వికిరణం చెందుతుంది, ఇలా జరిగినప్పుడు కాంతి యొక్క కొంత భాగం వేరే దిశలో ప్రయాణిస్తుంది. ఇలా వేరే దిశలో ప్రయాణించిన కాంతి యొక్క తరంగ ధైర్యం మారుతుంది, ఇలా వికిరణానికి ముందు తరవాత తరంగ ధైర్యలలో వచ్చే మార్పును రామన్ ఎఫెక్ట్ అని అంటారు.
వ్యక్తిగత జీవితం :
రామన్ గారు తనకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు లోకసుందరి అమ్మాళ్ అనే 13 సంవత్సరాల అమ్మాయి తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఒకరు చంద్రశేఖర్ రామన్ మరియు రేడియో- ఆస్ట్రోనామెర్ (ఖగోళ శాస్త్రవేత్త) వెంకటరామన్ రాధాకృష్ణన్.
రామన్ తన జీవిత కాలంలో కాంతి వికిరణం లక్షణాలు కలిగి ఉన్న రాళ్లు, ఖనిజాలు, మరియు ఇతర పదార్థాలను సేకరించేవారు, వీటిలో ఎక్కువగా బహుమతిగా వచ్చేవి.
మరణం :
రామన్ తన జీవిత కాలంలో దేవుని పట్ల నమ్మకం పెంచుకోలేదు, నాస్తికుని గానే ఉన్నారు, తనకు దేవుని మీద స్వర్గం మరియు నరకం మీద నమ్మకం లేదని మనము పుట్టిన తరవాత మన జీవితాన్ని మంచిగా గడపాలని తెలిపేవారు. రాబోయే కాలంలో సైన్స్ దేవుని గురించి ఇంకా ఎక్కువగా పరిశోధనలను జరిపి చెప్పవచ్చు అని అనేవారు.
రామన్ గారు 21 నవంబర్ 1970 వ సంవత్సరంలో 82 వయస్సులో గుండె పోటు వళ్ళ మరణించారు. తాను మరణించిన తర్వాత సాధారణంగా దహన సంస్కారాలు చేయాలనీ ఎక్కువగా ఆచారాలు పాటించవద్దు అని తన భార్య కు ముందే చెప్పారు.
Hi