Facebook success story -ఫేస్ బుక్ యొక్క సక్సెస్ స్టోరీ

ఫేస్ బుక్ అంటే ఏమిటి ? 

సోషల్ మీడియా అన గానే  మన ఆలోచనలో వచ్చే పేర్లలో ఒక పేరు ఫేస్ బుక్, ఫేస్ బుక్ వచ్చిన తరవాత మనము దాదాపు ఇక కలవము అనే ఫ్రెండ్స్ కూడా ఫేస్ బుక్ ద్వారా మళ్లీ కలుసుకోవడం జరిగింది. 

ఫేస్ బుక్ లో ప్రొఫైల్ తయారు చేసుకున్న తరవాత మనకు నచ్చిన పోస్ట్ చేయవచ్చు. ఈ పోస్ట్ లలో ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ మెసేజెస్ లు పోస్ట్ చేయవచ్చు. మనకు తెలిసిన వారికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపవచ్చు.ఒకసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించిన తరవాత వారితో చాటింగ్ కూడా చేయవచ్చు. 

ఫేస్ బుక్ లో మనకు తెలియని ఇతర దేశాల వారితో కూడా మనము ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వారి తో స్నేహం చేయవచ్చు.       

ఫేస్ బుక్ కి ముందు :  

ఫేస్ బుక్ ఈ రోజు అందరికి పరిచయం మరియు అన్ని స్మార్ట్ ఫోన్స్ లలో ఫేస్ బుక్  ఆప్ ఉంటుంది, ఫేస్ బుక్ ని తయారు చేసిన మార్క్ జుకెర్ బర్గ్ డైరెక్ట్ గా ఫేస్ బుక్ ని తయారుచేయలేదు. ఫేస్ బుక్ కి ముందు చేసిన కొన్ని ప్రయత్నాల తర్వాత ఫేస్ బుక్  అనే వెబ్ సైట్ ఉనికి లోకి వచ్చింది. 

మార్క్ జుకెర్ బర్గ్ 2003 వ సంవత్సరంలో “ఫేస్ స్మాష్” అనే వెబ్ సైట్ ని తయారు చేసారు. ఈ వెబ్ సైట్ లో వందల సంఖ్యలో ఫోటో లు ఆన్ లైన్  నుంచి తీసుకోని వారు హాట్ గా ఉన్నారా లేదా అని ఆప్షన్ లు ఇచ్చేవారు. 

ఇలా ఇతరుల ఫోటో లు  పబ్లిక్ లో పెట్టి వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అని వారిని హేళన చేయడం చట్ట విరుద్ధం అందుకే హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఈ వెబ్ సైట్ ను రద్దు చేసింది.ఇదంతా చేసింది జుకర్ బర్గ్ అని తెలుసుకున్న అడ్మినిస్ట్రేషన్ కాలేజీ నుంచి బహిష్కరించారు.    

Thefacebook :

ఫేస్ స్మాష్ ప్లాప్ అయిన తరవాత జుకర్ బర్గ్ కి ఒక ఆలోచన వచ్చింది, యవ్వనంలో ఉన్న ప్రతి అమ్మాయి అబ్బాయి ఇతర స్నేహితుల గురించి, వారి అలవాట్లు, వారికి నచ్చిన విషయాల గురించి, వారు సింగల్ గా ఉన్నారా లేదా రేలషన్ షిప్ లో ఉన్నారా అనే విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తెలుసుకున్న మార్క్ జుకర్ బర్గ్ THEFACEBOOK.COM  అనే వెబ్ సైట్ ను 2004 వ సంవత్సరంలో తయారు చేసారు.

సైట్ లాంచ్ అయిన 6 రోజుల తరవాత తెలిసిన విషయం ఏమిటంటే, జుకర్ బర్గ్ కి వచ్చిన ఫేస్ బుక్ ఐడియా తనది కాదని ముగ్గురు హార్డ్వర్డ్ సీనియర్స్ దావా చేసారు. ఈ ఐడియా ముందు తమకు వచ్చిందని ఐతే జుకర్ బర్గ్ తమకు ఈ వెబ్ సైట్ తయారు చేయడానికి సహాయం చేస్తానని నమ్మించి తానూ ఒంటరిగా ఈ వెబ్ సైట్ ను తయారు చేసాడని కోర్ట్ లో కేసు కూడా వేసారు. 

 ముగ్గురు సీనియర్స్ చేసిన దావా ప్రకారం చేసిన విచారణ లో జుకెర్బర్గ్ నిజంగానే ఫేస్ బుక్ ఐడియా దొంగిలించాడని తేలింది. 2008 వ సంవత్సరంలో దాదాపు 300 మిలియన్ ల డాలర్ ల విలువ కల షేర్స్ ఇచ్చి సెటిల్మెంట్ చేసారు.     

ఫేస్ బుక్ వెబ్ సైట్ ప్రారంభంలో కేవలం హార్వర్డ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఉండేది అలాగే 2005 వ సంవత్సరంలో thefacebook.com  నుంచి the ను తొలిగించాలని నిర్ణయించుకొని Facebook.com అనే వెబ్ సైట్ ను 200,000 $ లతో కొన్నారు.  

Facebook :

సెప్టెంబర్ 26, 2006 నుంచి 13 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి తమ ఇమెయిల్ అడ్రస్ తో ఫేస్ బుక్ లో రిజిస్టర్ చేసుకునే వసతి కలిగించింది. క్రమ క్రమంగా ఫేస్ బుక్ వినియోగదారులు పెరగటం మొదలుపెట్టారు, 2010 వ సంవత్సరానికి పేస్ బుక్ విలువ $41 బిలియన్ డాలర్లకు పెరిగింది.    

క్రమ క్రమంగా ఫేస్ బుక్ వినియోగదారులు పెరగటం మొదలుపెట్టారు, 2010 వ సంవత్సరానికి ఫేస్ బుక్ విలువ $41 బిలియన్ డాలర్లకు పెరిగింది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన Ebay వెబ్ సైట్ ను కూడా ఫేస్ బుక్ అధిగమించి అమెరికా లోని గూగుల్ మరియు అమెజాన్ తరవాత మూడవ ప్రముఖ కంపెనీ గా పేరు పొందింది.     

ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ముందు స్థాయిలో ఉండటానికి చాలా ప్రయాణిస్తుంది అందుకే 2010 వ సంవత్సరంలో Fb.com అనే వెబ్ సైట్ ను 8  మిలియన్ ల డాలర్ లతో కొన్నది. ఫేస్ బుక్ ను ఎక్కువగా చాలా వరకు షార్ట్ కట్ fb తో సెర్చ్ చేస్తారని తెలుసుకున్న ఫేస్ బుక్ ఈ డొమైన్ ను కొని పెట్టుకుంది.  

వినియోగదారుల డేటా కుంభకోణం: 

ఫేస్ బుక్ లోని వినోయోగ దారుల ముఖ్యమైన సమాచారాన్ని ఫేస్ బుక్ పొలిటికల్ పార్టీ లకు అమ్ముతుందని, ఈ డేటా మొత్తం Cambridge Analytica అనే కంపెనీ నిర్వహిస్తుందని వార్తలలో కి వచ్చింది. 

ఈ ప్రకారమైనా వార్తలు విన్న తరవాత చాలా వరకు వినియోగదారులు పేస్ బుక్ ని వినియోగించడం తగ్గించారు.

Leave a Comment