ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత చరిత్ర – Albert Einstein biography in Telugu.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవరు ?    

 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (Theoretical physicist). ఐన్‌స్టీన్ థియరీ అఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ను అభివృద్ధి చేసారు,  E=mc2 అనే మాస్ –ఎనర్జీ ఫార్ములా వల్ల ఐన్‌స్టీన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందారు. 

 1921 లో ఐన్‌స్టీన్ కు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, క్వాంటమ్ థియరీ లో తాను చేసిన అభివృద్ధికి నోబెల్ బహుమతి కూడా పొందటం జరిగింది.

ఐన్‌స్టీన్ 300 కు పైగా శాస్త్రీయ రచనలను ప్రచురించారు మరియు 150 కి పైగా శాస్త్రీయేతర రచనలను ప్రచురించారు. ఐన్‌స్టీన్ ను మేధావి అనే పదానికి పర్యాయ పదంగా కూడా వాడతారు.      

బాల్యం :   

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్  జర్మనీ దేశంలో కింగ్డమ్ అఫ్ వార్టమ్ బెర్గ్ ( Kingdom of Württemberg ) అనే రాష్ట్రం లోని ఉల్మ్ (ULM) నగరం లో 14 మార్చ్ 1879 జన్మించారు. ఐన్‌స్టీన్ తండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్ ఒక సేల్స్ మ్యాన్ మరియు ఇంజనీర్ గా పనిచేసేవాడు, తల్లి పాలిన్ కోచ్ ఒక హౌస్ వైఫ్.

ఐన్‌స్టీన్ కి చిన్నప్పటి నుండి మాథ్స్ మరియు సైన్స్ అంటే చాలా ఇష్టం.   12 సంవత్సరాలప్పుడు తన ట్యూషన్ మాస్టర్ ఇచ్చిన మాథ్స్ పుస్తకం ను కొద్దీ రోజుల లోనే నేర్చుకొని అడ్వాన్స్  మాథ్స్ ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొద్దీ రోజుల లోనే ఐన్‌స్టీన్ చదివే మాథ్స్ తన ట్యూషన్ మాస్టర్ కే అర్థం అయ్యేది కాదు.గ్రాడ్యుయేషన్ తర్వాత 1901 లో స్విట్జర్లాండ్ లోని బెర్న్ ఒక పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినెర్ గా పనిచేసారు.   

1900 వ సంవత్సరంలో ఐన్‌స్టీన్  తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత టీచర్ గా పనిచేయాలని 2 సంవత్సరాలు చాలా వెతికారు. 1901 వ సంవత్సరంలో స్విట్జర్లాండ్ పౌరసత్వం లభించిన తర్వాత తనకున్న పరిచయాలతో ఆ దేశంలో Federal Office for Intellectual Property అనే పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినేర్ లెవెల్ 3 గా పనిచేయడటం మొదలుపెట్టారు.

పేటెంట్ ఆఫీస్ :

ఏదైనా కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు పేటెంట్ ఆఫీస్ కి వెళ్లి తమ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటారు, ఎందుకంటే తమ ఐడియా వేరేవాళ్లు కాపీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.  

ఈ పేటెంట్ ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఐన్‌స్టీన్ చాలా వరకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారం, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ యొక్క టైం synchronization గురించి సంబంచిన పేటెంట్లు వచ్చేవి. ఇలా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఐన్‌స్టీన్ కాంతి యొక్క స్వభావం,స్పేస్ మరియు కాంతి (space and time) కి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

సైన్స్ లో ఐన్‌స్టీన్ కృషి : 

 ఐన్‌స్టీన్ తాను చేసిన కృషికి మరియు తన తెలివి తేటలకు గాను ఐన్‌స్టీన్ ను జీనియస్ కు మారు పేరుగా పిలిచేవారు. 

ఐన్‌స్టీన్ తాను చేసిన కృషికి మరియు తన తెలివి తేటలకు గాను ఐన్‌స్టీన్ ను జీనియస్ కు మారు పేరుగా పిలిచేవారు. ఐన్‌స్టీన్ రీసెర్చ్ చేసిన అంశాలలో చాలా ప్రసిద్ధి పొందిన విషయాలు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, స్పెషల్ థియరీ అఫ్ రిలేటివిటీ, మాస్ –ఎనర్జీ ఈక్వివలెన్స్, మరియు బ్రౌనియన్ మోషన్. ఇప్పుడు ఒక్కొక్క విషయం పై వివరణలోకి వెళదాము. 

స్పెషల్ రిలేటివిటీ : 

ఈ థియరీ ప్రకారం ఐన్‌స్టీన్  E = MC^2 అనే ఫార్ములా ను కనుగొనడం జరిగింది. ఈ ఫార్ములాలో E అనగా ఎనర్జీ, M అనగా మాస్, మరియు C అనగా కాంతి వేగం. అంతరిక్షంలో ఒక వస్తువు కాంతివేగంతో ప్రయాణించినపుడు ఆ వస్తువు యొక్క సమయం లేదా వయస్సు నెమ్మదిగా కదులుతుంది.

జనరల్ రిలేటివిటీ : 

ఈ థియరీ ప్రకారం అంతరిక్షంలో ఉన్న ప్రతి వస్తువు తమ తమ బరువుల వళ్ళ స్పేస్ మరియు టైం లో మార్పులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు గ్రావిటీ (గురుత్వాకర్షణ బలం) తక్కువగా ఉన్నప్పుడు A నుంచి B కి ప్రయాణించడానికి తక్కువ సమయం పడుతుంది. 

ఒకవేళ గ్రావిటీ ఎక్కువగా ఉంటే స్పేస్ మరియు టైం లో చాలా మార్పులకు దారితీస్తుంది ఫలితంగా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. బ్లాక్ హోల్స్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండటం వళ్ళ సమయం కూడా నెమ్మదిగా కదులుతుంది. ఈ థియరీ చాలా వరకు శాస్త్రవేత్తలకు సహాయపడింది మరియు సమయానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానం లభించింది.  

క్వాంటమ్ మెకానిక్స్ :

క్వాంటమ్ థియరీ అభివృద్ధికి ఐన్‌స్టీన్ చాలా కృషి చేసారు. క్వాంటమ్ థియరీ ముఖ్యంగా మోడరన్ ఫిజిక్స్ గురించి వివరిస్తుంది. మ్యాటర్ మరియు ఎనర్జీ యొక్క ప్రవర్తన అణువు మరియు ఉప అణువు స్థాయిలో జరిగే మార్పుల గురించి ఈ క్వాంటమ్ థియరీ లో చదవటం  జరుగుతుంది.

అవార్డులు :   

1921 లో ఐన్‌స్టీన్ చేసిన కృషికి గాను ఫిజిక్స్ లో ముఖ్యంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం తానూ చేసిన కృషికి  నోబెల్ బహుమతి కూడా ఇవ్వటం జరిగింది.   

మరణం : 

ఐన్‌స్టీన్ కు కడుపులోని ఒక భాగం గాయపడటం వళ్ళ తీవ్ర రక్త స్రావం జరిగి సర్జరీ చేయవలిసిన పరిస్థితి వచ్చింది. ఐన్‌స్టీన్ సర్జరీ వద్దని కృత్రిమంగా జీవించే ఉద్దేశం లేదని చెప్పారు. తన వంతు సహాయం, కృషి తాను చేసానని ఇక ఈ లోకం విడిచి వెళ్లే సమయం వచ్చిందని చెప్పారు.  

ఐన్‌స్టీన్ 76 సంవత్సరాలప్పుడు  Princeton Hospital లో తుది శ్వాస విడిచారు,  Princeton Hospital లోని డాక్టర్ ఐన్‌స్టీన్ ఫ్యామిలీ కి తెలియకుండా మెదడుని దొంగిలించాడు.

Leave a Comment