అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం న్యూస్ పేపర్ బాయ్ లా పనిచేసి కష్టపడి చదివి ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారి మన దేశ స్పేస్ ప్రోగ్రాం అభివృధ్ధికి చాలా కృషి చేసారు. 2002 వ సంవత్సరంలో అధికార పార్టీ బీజేపీ మరియు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసు మద్దతుతో భారత 11 వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
Table of Contents
కలాం గారి బాల్యం :
అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం 1931 వ సంవత్సరం అక్టోబర్ 15 న రామేశ్వరం లోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. కలాం తండ్రి జైనులబ్ధీన్ ఒక ఫెర్రీ యజమాని కావటం వల్ల రామేశ్వరం మరియు ధనుష్కోడి మధ్య హిందూ యాత్రికులను తీసుకువెళ్లి తీసుకురావటం చేసేవారు.
1914 లో పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత కలాం తండ్రి వ్యాపారం బాగా నష్టాలలోకి వెళ్ళింది. కలాం చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం చాలా పేదరికానికి గురి అయ్యింది. తన కుటుంబ పరిస్థితి చూసి తన వంతు సహాయం చేయటానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారు.
కలాం గారు స్కూల్ లో చదివేటప్పుడు మార్కులు అంత ఎక్కువగా వచ్చేవి కావు కానీ కలాం గారికి కష్టపడి చదవటం మరియు నేర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది. ఈ పట్టుదల కలాం ని గంటల తరబడి చదివేలా చేసేది. కలాం ఎక్కువగా తన సమయం మాథెమెటిక్స్ నేర్చుకోవటం పై ఖర్చు చేసేవారు.
కలాం తన స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత Saint Joseph’s College, తిరుచిరప్పల్లి నుంచి కాలేజీ చదువులు పూర్తిచేసారు, యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు.
1955 లో మద్రాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో చేరారు. ఆ కాలేజీ లో చదివేటప్పుడు ఒక ప్రాజెక్ట్ విషయంలో కలాం గారు సరిగా ప్రాజెక్ట్ పై పనిచేయటం లేదని, 3 రోజుల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే కాలేజీ డీన్ స్కాలర్ షిప్ రద్దు చేస్తానని బెదిరించాడు. కలాం గారు కష్టపడి ఇచ్చిన గడువులో ప్రాజెక్ట్ ను పూర్తి చేసి డీన్ యొక్క మెప్పు పొందారు.
ఇస్రో (ISRO) శాస్త్రవేత్తగా కలాం :
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కలాం గారు Defence Research and Development Organisation ( DRDO ) సంస్థ లో చేరారు. DRDO లో కలాం చిన్న చిన్న హోవర్ క్రాఫ్ట్ ని నిర్మించడం మొదలు పెట్టారు. కానీ తనకు DRDO లో పని చేయటం అంతగా నచ్చేది కాదు.
1969 లో కలాం Indian Space Research Organisation (ISRO) కు బదిలీ చేయబడ్డారు. కలాం మొట్ట మొదటి సాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా పనిచేసారు. తన నేతృత్వంలో రోహిణి సాటిలైట్ ను 1980 లో భూమి యొక్క కక్ష్యలో కి పంపడం జరిగింది.
కలాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు ఎస్‌ఎల్‌వి -3 (SLV-3) ప్రోజెక్టుల అభివృద్ధికి కూడా చాలా సహాయపడ్డారు. కలాం చేసిన ఈ కృషి వల్ల రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి.
కలాం ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ లకు కూడా డైరెక్టర్ గా ఉన్నారు. ఈ రెండు ప్రోజెక్టుల ముఖ్య లక్ష్యం బాలిస్టిక్ మిస్సైల్ అభివృద్ధి చేయటం. యూనియన్ కాబినెట్ ఈ రెండు ప్రాజెక్ట్ లకు నో చెప్పింది కానీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రహస్యంగా ఈ ప్రాజెక్ట్ కు నిధులు జారీ చేసింది.
తర్వాత కలాం యూనియన్ కేబినెట్ కు ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్ ఎంత ముఖ్యమో ఎందుకు ఇండియా వీటిని అభివృద్ధి చేయాలన్న విషయం ఒప్పించడం లో కలాం కీలక పాత్ర పోషించారు.
ఇండియా ఒక్కొక్క మిస్సైల్ ను ప్రత్యేకంగా తయారుచేయకుండా ఒకేసారి పలు మిస్సైల్స్ తయారు చేయాలన్న ప్రతిపాదన అప్పటి డిఫెన్సు మినిస్టర్ ఆర్ .వెంకటరామన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కు ₹ 3.88 బిలియన్ కాబినెట్ ఇవ్వడం జరిగింది. కలాం మరియు ఇతర శాస్త్రవేత్తలు కలిసి ఈ ప్రాజెక్ట్ పై పనిచేసారు.
పోక్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ లో కలాం చాలా కీలక పాత్ర పోషించారు. ఇదే న్యూక్లియర్ టెస్ట్ పై బాలీవుడ్ లో పరమాణు అనే సినిమా కూడా తీసారు.
రాష్ట్రపతి గా కలాం:
2002 రాష్ట్రపతి ఎన్నికలలో కలాం భారత 11 వ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత ప్రధానిగా తన సేవలను అందించారు.
కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తి గా మెలిగారు ప్రజలు కూడా కలాం గారిని ఆధరించారు. కలాం భారత రత్న పురస్కారంతో కూడా సత్కరించబడ్డారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం 3 వ రాష్ట్రపతి.
20 జూన్ 2007 కి తన పదవి కాలం పూర్తి అయిన తర్వాత మళ్లీ రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు కానీ చివరి క్షణాలలో రద్దు చేసారు.
కలాం తన పదవి విరమణ తరువాత పలు కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు.
మరణం :
27 జులై 2015 లో కలాం శిల్లోంగ్ లోని Indian Institute of Management Shillong లో భూమిని ఎలా మనం కాపాడుకోవాలి అనే అంశం పై ఉపన్యాసం ఇస్తున్నప్పుడు గుండెపోటు వల్ల కుప్ప కూలిపోయారు.
30 జులై 2015 లో భారత పూర్వ రాష్ట్రపతి అంత్యక్రియలు తన స్వస్థలం అయిన రామేశ్వరంలో చేయటం జరిగింది. ఈ అంత్యక్రియలో ప్రధాన మంత్రి, తమిళనాడు గవర్నర్, కర్ణాటక,కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
కలాం వ్యక్తిగత జీవితం:
కలాం తన జీవితంలో బ్రహ్మచారిగానే ఉన్నారు, కలాం ఎల్లప్పుడూ తన బంధువులతో సన్నిహితంగా ఉండేవారు.
కలాం తన జీవిత కాలంలో చాలా సాధారణంగా జీవించేవారు, రాత్రి 2 గంటలకు పడుకొని ఉదయం 7 గంటల సమయంలో లేచేవారు. కలాం ఎంత సాధారణంగా ఉండేవారంటే తన వద్ద టీవీ కూడా ఉండేది కాదు. కలాం చనిపోయిన తరవాత తన వద్ద మిగిలిన ఆస్తులు కొన్ని పుస్తకాలు, వీణ, సీడీ ప్లేయర్, లాప్టాప్ మాత్రమే.
ఇస్లాం మతం :
కలాం ఒక ముస్లిం గా నమాజ్ చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండేవారు. కలాం ఇతర మతాలను గౌరవించడాన్నీ నమ్మేవారు. కలాం ఎప్పుడు ఒక మాట అనేవారు అది ఏంటంటే ” గొప్ప వ్యక్తులు మతం ను స్నేహితులను పెంచడానికి, చిన్న వ్యక్తులు మతం ను గొడవపడటానికి ఒక సాధనంగా ఉపయోగిస్తారు”.
Source: A. P. J. Abdul Kalam – Wikipedia
Super man and missile man of India
Apj abdul kalam
He is a very kindest person and a great scientist in the world