సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర Subhash chandra bose biography in Telugu.

చరిత్రలో దేశం కోసం తన ప్రాణాలకు సైతం లెక్కచేయ కుండా పోరాడిన వాళ్లలో సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు అని గర్వంగా చెప్పుకోవచ్చు.  

“మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను” అని చెప్పిన  గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్. 

బోస్ దేశం కోసం పోరాటం చేస్తూ ఒక విమాన ప్రమాదంలో చనిపొయారు, కానీ చాలా మంది విమాన ప్రమాదంలో చనిపోలేదని నమ్ముతారు. 

సుభాష్ చంద్రబోస్ బాల్యం మరియు చదువు : 

సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897 లో ఒరిస్సా పూర్వ రాజధాని కట్టక్ (Cuttack) లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్, జానకీ నాథ్ బోస్ (Janakinath Bose) మరియు ప్రభావతి దత్ (Prabhavati Dutt) కు కలిగిన 14 మంది సంతానంలో  9 వ సంతానంగా పుట్టారు.

సుభాష్ చంద్రబోస్ Ravenshaw Collegiate School నుంచి 10 వ తరగతిలో  2 ర్యాంక్ తో పాస్ అయ్యారు. కాలేజీ చదువు Presidency College నుంచి చదివారు.1918 లో University of Calcutta నుంచి B.A పాస్ చేసారు. సుభాష్ చంద్రబోస్ చిన్నప్పటి నుండి దేశంలో ఉన్న బ్రిటిష్ పాలన మరియు వాళ్ళు చేసే అక్రమాలు నచ్చేవి కావు. 

1919 లో బోస్ పై చదువుల కోసం మరియు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం సంపాదించడం కోసం లండన్ వెళ్లారు.  

సుభాష్ చంద్రబోస్ వారి నాన్నకు బోస్ ని సివిల్స్ సర్వీసెస్ లో ఒక ఉద్యోగి గా చూడాలన్నది ఒక కోరిక,  తన తండ్రి కోరికని నెరవేరిస్తూ బోస్ సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం సంపాదించాడు.  

బోస్ కి ఈ ఉద్యోగం పెద్దగా నచ్చలేదు ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ లాంటి క్రూర మైన ప్రభుత్వం కోసం పనిచేయడం సరికాదు అనిపించింది. 1921 లో ఉద్యోగం మానేస్తున్నాని తన సోదరుడికి ఉత్తరం రాసి తిరిగి భారత దేశానికి వచ్చేసారు. 

సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ లో : 

సుభాష్ చంద్రబోస్ గారు స్వరాజ్ అనే పత్రిక లో ఎడిటర్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ స్వరాజ్ పత్రికను చిత్తరంజన్ దాస్ ప్రారంభించారు. 

ఈ పత్రికలు కూడా భారత దేశ స్వాతంత్ర పోరాటానికి చాలా ఉపయోగ పడ్డాయి. 1923 లో బోస్ అల్ ఇండియా కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డారు. ఇలా క్రమంగా రాజకీయాలలో చేరి దేశ స్వాతంత్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం ప్రారంభించాడు.

1925 లో బోస్ మొట్ట మొదటి సారిగా మయన్మార్ లో ని మండలే (Mandalay) అనే పట్టణం లో జైలు కి వెళ్ళవలసి వచ్చింది. 1927 లో జైలు నుండి విడుదల అయ్యాక  కాంగ్రెస్ పార్టీ లో జనరల్ సెక్రటరీ గా నియమించ బడ్డారు. సుభాష్ చంద్రబోస్ జైలు పాలైనా తన ఉద్యమం మాత్రం ఆపలేదు. జవహర్ లాల్ నెహ్రు తో కలిసి స్వాతంత్ర పోరాటం ప్రారంభించారు. 

బోస్ లో ఉన్న పట్టుదల ధైర్యం క్రమేణా పై పైకి ఎదగటం లో దోహదపడ్డాయి. కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ గా కూడా ఎన్నుకోబడ్డారు. మహాత్మా గాంధీ కి బోస్  దూకుడుతనం నచ్చేది కాదు ఎందుకంటే గాంధీజీ ఎల్లప్పుడూ అహింస మార్గాన నడిచాడు. బోస్ మరియు గాంధీజీ ఆలోచనలు వేరుగా ఉన్నందున ఇండియన్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు గా విడిపోవాల్సి వచ్చింది. 

ప్రెసిడెంట్  ఎన్నికల కోసం బోస్ మరియు గాంధీ నియమించిన పట్టాభి సీతారామయ్య మధ్య పోటీ లో సుభాష్ చంద్రబోస్ గెలిచారు. బోస్ మరియు గాంధీ ఆలోచనలు పరస్పరం వేరు అవ్వటం వల్ల కొన్నిరోజుల తర్వాత  బోస్ తన పదవి నుంచి రాజీనామా చేసారు. 

బోస్  వైస్రాయ్ లార్డ్ లింలిత్గౌ (Lord Linlithgow’s) కి వ్యతిరేకంగా నిరసనలు చేయటం వల్ల బోస్ ని అరెస్ట్ చేయటం జరిగింది. 7 రోజుల సుభాష్ చంద్రబోస్ నిరాహార దీక్ష తర్వాత విడుదల చేయబడ్డారు. 

బోస్ పని తీరు చూసి బ్రిటిష్ ప్రభుత్వం CID ద్వారా బోస్ ని హౌస్ అరెస్ట్ చేసి ఇంటి పైన నిఘా ఉంచడం మొదలుపెట్టారు. 

సుభాష్ చంద్రబోస్ జర్మనీ ప్రయాణం:  

బ్రిటిష్ ప్రభుత్వం దౌర్జన్యం చూసి ఇతర దేశాల మద్దతు తీసుకోవాలని బోస్ నిర్ణయించుకున్నారు. CID ద్వారా నిఘా ఉంచిన ప్రభుత్వం కంట్లో పడకుండా దేశం వదిలి వెళ్ళాలి అని బోస్ నిర్ణయించుకున్నారు. దేశం వదిలి జర్మనీ వెళ్ళడానికి చాలా మంది బోస్ కి సహాయపడ్డారు. 

సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి ఆఫ్గనిస్తాన్ అక్కడి నుంచి సోవియట్ యూనియన్ మళ్లి అక్కడి నుండి జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బోస్ హౌస్ అరెస్ట్ గా ఉన్నప్పుడే తన వేషధారణ మార్చడం మొదలుపెట్టారు. బ్రిటిష్ సైనికులు తనని గుర్తు పెట్టొద్దు అని గడ్డం పెంచడం, ఆఫ్ఘన్ పఠాన్ లాగా బట్టలు వేయడం ప్రారంభించారు. 

17 జనవరి 1941 వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ తన ప్రయాణం జర్మనీ కోసం మొదలుపెట్టారు. బోస్ గారు కలకత్తా  చేరుకున్న తర్వాత బీహార్ నుండి ఈ ప్రయాణం లో తన మేనల్లుడు సిసిర్ కుమార్ బోస్ చేరారు.

సుభాష్ చంద్రబోస్ పెషావర్ చేరుకున్న తర్వాత అక్కడున్న వారి పరిచయం తో ఆఫ్గనిస్తాన్ చేరుకున్నారు.ఈ ప్రమాదకరమైన ప్రయాణం లో బోస్ తనను ఎవ్వరు గుర్తు పట్టకుండా  జాగ్రత్త పడ్డారు.  

ఆఫ్గనిస్తాన్ లో మియాన్ అక్బర్ షా సుభాష్ చంద్రబోస్ ను రష్యా వెళ్ళడానికి సహాయపడ్డారు. బోస్ కి  పష్తో భాష రానందున ఆఫ్గనిస్తాన్ లో బ్రిటిష్ వారు గుర్తుపట్టకుండా ఉండాలంటే తాను చెవిటి, మూగ వాడిలా నటించమని మియాన్ అక్బర్ షా సలహా ఇచ్చాడు. 

బోస్ ఇటాలియన్ పాస్ పోర్ట్ సహాయంతో రష్యా రాజధాని మాస్కో కి చేరుకున్నారు. మాస్కో లో బోస్ తనను Count Orlando Mazzotta అనే పేరు తో పరిచయం చేరుకున్నారు. మాస్కో నుంచి రోమ్ అక్కడినుంచి జర్మనీ కి ప్రయాణించారు. 

జర్మనీ చేరుకున్న తర్వాత బోస్ అక్కడి ప్రభుత్వ సహాయంతో ఆజాద్ హింద్ రేడియో ని స్థాపించారు. బ్రిటిష్ తరపున ఉత్తర ఆఫ్రికా లో పోరాడి ఓడిపోయిన దాదాపు 4500 మంది భారతికియులు జర్మనీ లో బందీలుగా ఉన్నారు. జర్మనీ నేత్రుత్వంలో బోస్ నాయకత్వంతో బ్రిటిష్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.  

ఇటు జర్మనీ మాత్రం ఇండియా సైనికులను, బోస్ ని తమ పతకాలను గెలవటానికి ఉపయోగించుకుంటున్నారు అన్న విషయం గ్రహించిన బోస్ 1942 లో జర్మనీ పై ఆశలు వదులుకున్నారు. 

సుభాష్ చంద్ర బోస్ జపాన్ ప్రయాణం :

ఇక జర్మనీ భారత స్వతంత్ర పోరాటంలో ఎలాంటి సహాయం చేయదన్న విషయం గ్రహించిన బోస్ అక్కడి నుంచి జపాన్ బయలుదేరారు. బోస్ జర్మనీ జలాంతర్గామి సహాయంతో జపాన్ జలాంతర్గామి కి చేరారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సామాన్య పౌరుడు రెండు జలాంతర్గాముల మధ్య మొదటిసారి బదిలీ చేయ బడ్డారు.

1942 లో జపాన్ లో భారత జాతీయ సైన్యం (NIA) ను ముందు నుంచి మోహన్ సింగ్ దేవ్ స్థాపించారు, జపాన్ హైకమాండ్ కు చెందిన హికారీ కికాన్ తో విబేధాలు రావటం వల్ల మోహన్ సింగ్ ను మరియు సైన్యాన్ని జపాన్ బంధించడం జరిగింది.

1943 లో బోస్ జపాన్ రావటం తో సైన్యం ఒక కొత్త రూపు దాల్చుకుంది. తనతో పాటు సైన్యం లో చేరాలని పిలుపునిచ్చాడు.బోస్ పిలుపుతో చాలా మంది సైన్యంలో చేరారు మరియు ఆర్థికంగా సహాయం చేసారు. 

జులై 4, 1944లో బర్మాలో బోస్ ఇచ్చిన ఉత్తేజమైన ప్రసంగం ఎప్పటికి మరిచిపోలేనిది. 

“మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను.”  అన్న వ్యాఖ్యలు చాలా మందిని ఉత్తేజ పరిచాయి.

మరణం: 

 ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తున్న సమయంలో విమాన ప్రమాదంలో బోస్ మరణించడం జరిగింది. 

ఇప్పటికి చాలా మంది ఈ విషయాన్నీ నమ్మరు, ఆ ప్రమాదంలో బోస్ బ్రతికాడని, ఎవరికీ కనిపించకుండా తన మిగతా జీవితం కోన సాగించారని కథనాలు వినిపిస్తూ ఉంటాయి.  

Source:Subhas Chandra Bose – Wikipedia

4 thoughts on “సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర Subhash chandra bose biography in Telugu.”

  1. jai subhash chandra bose jayahoo….“మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను.” అన్న వ్యాఖ్యలు చాలా మందిని ఉత్తేజ పరిచాయి.sir

    Reply

Leave a Comment