కపిల్ దేవ్ జీవిత చరిత్ర – Kapil dev biography in Telugu

క్రికెట్ లో వరల్డ్ కప్ అంటే గుర్తు వచ్చే వ్యక్తి కపిల్ దేవ్. తన నేతృత్వంలో భారత దేశానికి మొట్ట మొదటి సారిగా వరల్డ్ కప్ వచ్చింది. క్రికెట్ అభిమానులకు అది చెప్పలేనంత ఆనందం.

కపిల్ దేవ్ ఆల్ రౌండర్ కావటం భారత్ జట్టును చాలా బలోపేతం చేసింది . క్రికెట్ చరిత్రలో ఒక్క గొప్ప కెప్టెన్ గా కూడా తన పేరును నమోదు చేసుకున్నారు.

కపిల్ దేవ్ రామ్ లాల్ నిఖన్జ్ (Ram Lal Nikhanj) కి మరియు రాజ్  కుమారి రామ్ లాల్ నిఖన్జ్ (Raj Kumari Ram Lal Nikhanj) అనే దంపతులకు 6 జనవరి 1959 హర్యానా లో జన్మించారు.

 కపిల్ దేవ్ కుటుంబం పార్టిషన్ కి ముందు పాకిస్తాన్ లోని ఓక్రా జిల్లా లో నివసించేవారు. పార్టిషన్ తరవాత కపిల్ దేవ్ కుటుంబం చండీగఢ్ నగరానికి మారారు. 1971 లో కపిల్ దేవ్, దేశ్ ఆజాద్ అనే క్రికెటర్ వద్ద కోచింగ్ కోసం చేరాడు. దేశ్ ఆజాద్ వద్ద కోచింగ్ కోసం చేరిన వాళ్లలో కపిల్ దేవ్ మంచి స్టూడెంట్ గా పేరుతెచ్చుకున్నారు.

కపిల్ దేవ్ వ్యక్తిగత జీవితం :

కపిల్ దేవ్ 1980 లో రోమి భాటియా తో పెళ్లి చేసుకున్నారు. 1986 లో ఈ దంపతులకి కూతురు ఆమియా దేవ్ పుట్టింది. కపిల్ దేవ్ ఇక్బాల్, ముజేసె షాదీ కరోగి, దిల్లగి యే దిల్లగి  సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం జరిగింది.

కపిల్ దేవ్ కి పుస్తకాలు రాయటం చాలా ఇష్టం. దేవ్ మొత్తం నాలుగు పుస్తకాలను రాసారు వీటిలో  By God’s Decree, Cricket My Style, Straight from the Heart అనే 3 ఆటో బయోగ్రఫీ పుస్తకాలు, నాలుగవ పుస్తకం The Sikhs అనేది సిక్కుమతం గురించి రాసారు.  

జాతీయ క్రికెట్ :

కపిల్ దేవ్ తన కెరీర్ 1975 లో హర్యానాలో ప్రారంభించారు. ఆ సమయంలో సీజన్ ల వారీగా మ్యాచ్ లు జరిగేవి. దేవ్ తన జాతీయ క్రికెట్ మొదటి మ్యాచ్ పంజాబ్ తో ఆడారు. తన మొదటి మ్యాచ్ లో 6 వికెట్లు తీసుకొని హర్యానాను గెలిపించారు. ఈ మొత్తం సీజన్ లో మొత్తం 30 మ్యాచ్ లలో 121 వికెట్లు తీసుకున్నారు.   

1976 లో జరిగిన సీజన్  లో కపిల్ పెద్దగా ప్రదర్శించక పోయిన, ఈ సీజన్  లో 9/20 9 ఓవర్లలో తీసుకొని తన బెస్ట్ ఇన్నింగ్స్ ను నమోదు చేసుకున్నారు.

1978 – 79 సీజన్  లో కూడా దేవ్ 4 మ్యాచ్ లలో 12 వికెట్లు తీసుకోని తన సత్తా చాటుకున్నారు. దులీప్ ట్రోఫీ సమయంలో 24 ఓవర్లలో 7/65 వికెట్స్ తీసుకోని దేవ్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.        

1979-80 సీజన్ సమయంలో దేవ్ మొదటి సారిగా సెంచరీ చేసారు, ఢిల్లీ తో జరిగిన ఈ మ్యాచ్ లో దేవ్ 193 పరుగులు చేసారు.

అంతర్జాతీయ క్రికెట్ మరియు వరల్డ్ కప్ 1983 :   

కపిల్ దేవ్ తన అంతర్జాతీయ కెరీర్ ను టెస్ట్ క్రికెట్ తో ప్రారంభించారు. ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ భారత్ మరియు పాకిస్తాన్ ల మధ్య జరిగింది. ఈ సిరీస్ లో 33 బాల్స్ లో 50  పరుగులు తీసి భారత్ తరపున అతితక్కువ బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు తన పేరున చేసుకున్నారు.  

కపిల్ దేవ్ వరల్డ్ కప్ లో ఆడేటప్పుడు చాలా సాధారణమైన రికార్డు ఉంది కానీ తన ఆట తీరు వల్ల వరల్డ్ కప్ లో తన సత్తా చాటుకున్నారు. 

జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ఆడి సెంచరీ చేసారు. ఈ మ్యాచ్ లో దేవ్ 9 వ వికెట్ 126 పరుగులు తీసిన రికార్డు తన సొంతం చేసుకున్నారు, ఈ రికార్డు 27 సంవత్సరాల వరకు ఎవరూ కూడా ఛేదించలేక పోయారు.  

ఈ మ్యాచ్ లో దేవ్ 138 బాల్స్ లో 175 పరుగులు తీసి టీం ని గెలిపించారు. ఈ మ్యాచ్ చాలా బాగా ఆడినందుకు కపిల్ దేవ్ తనకు తానే మెర్సిడెస్ కారు బహుమతిగా ఇచ్చుకున్నారు.

ఇక సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరిగినప్పుడు కపిల్ దేవ్ మూడు వికెట్లు తీసుకోని తన వంతు సహకారం అందించారు.  భారత జట్టు ఫైనల్స్ లో వెస్ట్ ఇండీస్ టీం ని ఎదుర్కోవాల్సి ఉంది. వెస్ట్ ఇండీస్ ఇంతకు ముందే రెండు సార్లు వరల్డ్ కప్ గెలుచుకొని 3వ సారి కూడా గెలవాలనే తాపత్రయం తో ఉన్నారు. 

ఫైనల్స్ లో భారత్ కేవలం 183 పరుగులు చేయగలిగింది, సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్ చాలా ప్రమాదకరంగా ఆడటం మొదలు పెట్టింది. రిచర్డ్స్ క్యాచ్ తీసుకున్న దేవ్ మ్యాచ్ కి ఒక కొత్త మలుపుని ఇచ్చారు. 140 పరుగులకే అల్ అవుట్ అయిన వెస్ట్ ఇండీస్ పరాజయం పాలు అయ్యింది. ఇండియా చరిత్రలో మొదటి సారిగా వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.

 స్పోర్ట్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ :   

2019 లో కపిల్ దేవ్ హర్యానా లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి ఛాన్సలర్ గా నియమించబడ్డారు. తన క్రికెట్ కెరీర్ ఎక్కడినుంచి అయితే ప్రారంభించారో ఇప్పుడు అక్కడే ఛాన్సలర్ గా నియమించ బడ్డారు.          


Leave a Comment