రతన్ టాటా జీవిత చరిత్ర – Ratan Tata biography in Telugu

రతన్ టాటా ఇండియా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. చాలా చిన్న వయసులోనే వ్యాపారం లోకి అడుపెట్టిన టాటా తన మేధస్సు తో టాటా కంపెనీ ను లాభాల బాట పట్టించారు.

ఒక రంగం అని కాకుండా పలు రంగాలలో కంపెనీలను స్థాపించిన ఘనత రతన్ టాటా కు దక్కుతుంది.    

బాల్యం : 

రతన్ టాటా 28th డిసెంబర్ 1937 వ సంవత్సరంలో నావల్ టాటా మరియు సోని టాటా దంపతులకు జన్మించారు. రతన్ టాటా 10 సంవత్సరాల వయస్సు లో ఉన్నప్పుడు వీరి తల్లి తండ్రులు విడిపోయారు. తల్లి తండ్రులు విడిపోయాక అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్దయ్యారు.  

రతన్ టాటా తన చదువును ముంబై లో పూర్తి చేసుకున్నారు మరియు గ్రాడ్యుయేషన్ ను న్యూయార్క్ సిటీ నుంచి పూర్తి చేసుకున్నారు. 1959 వ సంవత్సరంలో కార్నెల్ యూనివర్సిటీ లో ఆర్కిటెక్చర్ లో కూడా డిగ్రీ ను పూర్తి చేసారు.

బిసినెస్ మ్యాన్ గా రతన్ టాటా :

రతన్ టాటా ఈ రోజు చాలా సక్సెస్ బిజినెస్ మ్యాన్ కానీ కెరీర్ ప్రారంభించి నప్పుడు కొన్ని వైఫల్యాలను కూడా చూసారు. 1970 వ సంవత్సరంలో నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ (NELCO) కంపెనీ లో మేనేజ్ మెంట్ గా ఉన్నారు. ఈ కంపెనీ కొంత సమయంలోనే మూతబడిపోయింది.    

1991 వ సంవత్సరంలో జెహాంగీర్ రతన్ జీ దాదా బాయ్ టాటా JRD టాటా, టాటా సన్స్ కంపెనీ కి రతన్ టాటా ను చైర్మన్ గా నియమించారు. రతన్ టాటా గారి వయస్సు తక్కువ కావటం తో కంపెనీ లో ఉన్న సీనియర్ ల నుంచి తీవ్ర వ్యతిరేకతను చూసారు. 

ఆ సమయంలో రతన్ టాటా వయసు పై బడిన వారందరికీ ఒక రిటైర్మెంట్ ఏజ్ ని సెట్ చేసి కంపెనీ నుంచి తొలగించటం మొదలుపెట్టారు. వీళ్లకి బదులు కొత్త వారికి అవకాశం ఇచ్చారు.     

రతన్ టాటా చైర్మన్ అయిన తర్వాత కంపెనీ యొక్క ఆదాయం 40 శాతం మరియు లాభం 50  శాతం పెరిగింది. పెరుగుతున్న లాభాలతో పాటు పలు కంపెనీ లను తమ లో విలీనం కూడా చేసుకుంది. 

టాటా టీ  ఇంగ్లాండ్ కు చెందిన అతిపెద్ద టీ కంపెనీ అయిన టెట్లీ (Tetley) టీ ను కొనుక్కొని సొంతం చేసుకుంది. టాటా స్టీల్ కంపెనీ కోరస్ అనే లండన్ కు చెందిన స్టీల్ కంపెనీ ను కూడా కొనుక్కొని తమ సొంతం చేసుకుంది. ఫలితంగా టాటా కంపెనీ అంతర్జాతీయంగా కూడా పేరు పొందింది.

రతన్ టాటా మోటివేషనల్ స్టోరీ : 

టాటా మొదటిసారి 1998 లో కార్ల బిసినెస్ లో అడుగుపెట్టి టాటా ప్యాసెంజర్ కార్ అయిన ఇండికా ను తయారు చేసింది. కార్లను రివ్యూ చేసే వారు ఇండికా కార్ల పట్ల చేసిన కామెంట్ల వల్ల సేల్స్ చాలా పడిపోయాయి. కంపెనీ నష్టాలలో వెళ్ళటం ప్రారంభించింది, కొందరు ఈ కంపెనీ ను అమ్మివేయాలి కూడా సలహా ఇచ్చారు.  

కంపెనీ ను ఫోర్డ్ మోటర్స్ కు అమ్మివేయాలని నిర్ణయించుకున్నాక డీల్ ఫైనల్ చేయటానికి అమెరికా వెళ్లారు. అక్కడ జరిగే మీటింగ్ లో రతన్ టాటా ను చిన్న చూపుతో చూస్తూ ” ప్యాసెంజర్ కార్లు ఎలా తయారు చేయాలో తెలియక పొతే ఈ ఫీల్డ్ లో ఎందుకు వచ్చారని ” హేళన చేస్తూ మాట్లాడారు.  

ఈ మాటలు విన్న తరవాత డీల్ ఫైనల్ చేయకుండా ఇండియా కి తిరిగి వచ్చి ఇండికా లో మార్పులు చేసి మళ్ళీ మార్కెట్ లో కొత్త మోడల్ లను తీసుకవచ్చారు. ఈ సారి ప్రజలకు కార్లు చాలా బాగా నచ్చాయి. ఎక్కడ చుసిన టాటా కార్లు కనిపించటం మొదలు అయ్యాయి.   

సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఫోర్డ్ కంపెనీ ల్యాండ్ రోవర్ మరియు జాగ్వర్ కార్లను లాంచ్ చేసిన తరవాత నష్టాల బాట పట్టింది. ఆ సమయలో రతన్ టాటా ఆ కార్ల బ్రాండ్లను తానూ కొంటానని చెప్పి తన సొంతం చేసుకున్నారు. తనకు అవమానం జరిగిన చోట ఒక్క మాట మాట్లాడకుండా పగ ను తీసుకున్నారు అని చాలా మంది పొగుడుతారు.   

టాటా నానో : 

రతన్ టాటా ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. ఒకసారి టూ వీలర్ పై వెళుతున్న ఒక చిన్న ఫ్యామిలీ ను చూసి ఒక చిన్న కారు పేదవారికి అందుబాటులో ఉండేవిధంగా తయారు చేయాలని అనుకున్నారు.

లక్ష రూపాయలలో ఒక తయారు చేయాలనుకుంటున్న అని ఇంజనీర్ ల తో చెప్పగా అది సాధ్యం కాదు అని చెప్పారు. అయితే ఏది ఏమైనా ఒక నానో కారు ను తయారు చేయాలి అనుకున్న లక్ష్యాన్ని చివరికి పూర్తి చేసుకున్నారు. 

చాలా మంది నానో కారు ను కొనటం మొదలుపెట్టారు కానీ ప్రజలలో ఇది ఒక చీప్ కారు అనే ఒక భావన రావటం తో వీటి సేల్స్ పడిపోయాయి.      

రతన్ టాటా పెట్టుబడులు : 

టాటా కంపెనీ కొత్తగా మార్కెట్ లోకి వచ్చే మంచి కంపెనీ లలో ఎల్లప్పుడూ పెట్టుపడి పెట్టేది. కింద టాటా కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ల పేర్లు ఇవ్వబడింది.  

క్యాష్ కరో – కూపన్ మరియు డిస్కౌంట్ కంపెనీ 

ఓలా క్యాబ్స్ – ప్రైవేట్ టాక్సీ సర్వీస్ 

 Xiaomi – మొబైల్ ఫోన్ కంపెనీ 

నెస్ట్ అవే – ఆన్ లైన్ హోమ్ రెంటల్ కంపెనీ 

డాగ్ స్పాట్ – ఆన్ లైన్ పెంపుడు జతువులకు సంబంధించిన వెబ్ సైట్ 

స్నాప్ డీల్ – ఈ కామర్స్ వెబ్ సైట్ 

టీ బాక్స్ – ఒక టీ సెల్లర్ కంపెనీ 

వ్యక్తిగత జీవితం :

రతన్ టాటా కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం లో పెద్ద మొత్తాన్ని ధాన ధర్మాలలో ఇస్తూ ఉంటారు. టాటా కు సంబంచిన కంపెనీ లో పలు చారిటీ కి సంబంధించిన పనులలో ఎల్లపుడు ముందు ఉంటాయి.

రతన్ టాటా ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతారు. తాను అమెరికా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ని ప్రేమించి ఇండియా కి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పారు. ఆ అమ్మాయి తానూ ఇండియా కి రాలేను  అని చెప్పిన తరవాత ఇప్పటికి పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచారిగా ఉన్నారు.  

Leave a Comment