కైకల సత్యనారాయణ జీవిత చరిత్ర – Kaikala Satyanarayana biography in Telugu

కైకేల సత్యనారాయణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 750 కి పైగా చేసిన ఒక గొప్ప నటుడు. ఒక రోల్ అని కాకుండా వివిధ రకాల పాత్రలలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా జీవితం తరవాత రాజకీయల లోకి కూడా రావటం జరిగింది.

బాల్యం :

 కైకల సత్యనారాయణ గారు 1935 సంవత్సరం 25 జులై లో కృష్ణా జిల్లా లోని కవుతారం అనే గ్రామంలో జన్మించారు. స్కూల్ చదువును గుడ్లవల్లేరు అనే గ్రామంలో పూర్తి చేసుకున్నారు.

 ఇంటర్మీడియట్ చదువును విజయవాడలో మరియు గ్రాడ్యుయేషన్ ను గుడివాడ కాలేజీ నుంచి పూర్తి చేసుకున్నారు. వీరి వంశంలో మొట్టమొదటి సారి డిగ్రీ సంపాదించిన వ్యక్తి  సత్యనారాయణ గారు. 

కెరీర్ :  

 నాటకాలు వేసే సమయంలోనే సినిమాలలో పనిచేస్తారా అని ఒక డైరెక్టర్ అడగగా నేను ముందు డిగ్రీ పూర్తి చేసుకోవాలి. డిగ్రీ చదివిన తరవాతే సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పారు.  

చదువు పూర్తి చేసుకున్న తరవాత అవకాశాల కోసం సత్యనారాయణ గారు మద్రాస్ వెళ్లారు, సినిమాలో రోల్ వచ్చే అవకాశం ఉంది 4 రోజులు ఆగి రమ్మని డైరెక్టర్ చెప్పటంతో మద్రాస్ లోనే కొన్ని రోజులు ఉండిపోదామని నిర్ణయించుకున్నారు.   

మద్రాస్ లో ఉన్న రోజులలో చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాకి కూడా సెలెక్ట్ కాలేదు.  అవకాశాలు వెతుకుతున్న ఈ సమయంలో రూమ్ లేక 15 రోజులు ఒక పార్క్ లో పడుకునే వారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాస్ వదిలి వెళ్లిపోకూడదు అని నిశ్చయించుకొని  అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు. 

రూమ్ దొరికిన తరవాత రోజంతా అలిసి పోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ అంత తాగిన తరవాత ఒక సాలే పురుగు కప్పు అడుగు భాగం లో ఉండటం గమనించారు. తన తోటి రూమ్ మేట్స్ సాలే పురుగు వల్ల శరీరంలో విషం ఎక్కుతుందని చెప్పగా హాస్పిటల్ కి వెళ్లకుండా రూమ్ లోనే ఉండి పోయారు. 

నాకు ఫ్యూచర్ ఉంటె నేను ఉదయం లేస్తాను లేక పొతే ఈ సాలే పురుగు విషం వల్ల చనిపోతాను అని చెప్పి పడుకున్నారు. ఆ ఉదయం ఆరోగ్యంగా లేవటం సినీ పరిశ్రమలో రావటం సత్యనారాయణ గారి జీవితాన్ని మార్చేసింది. (1)       

సత్యనారాయణ గారికి 1959 వ సంవత్సరంలో సిపాయి కూతురు లో DL నారాయణ ద్వారా అవకాశం దక్కింది. సత్యనారాయణ గారు సీనియర్ ఎన్ టి ఆర్ గారి లాగా పోలిక కలిగి ఉండటం వల్ల  NTR గారి డూప్ లాగా కూడా నటించటం జరిగింది. 

750 సినిమాలలో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగు వారి హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారు. దేవుళ్ళకి సంబంధించిన పాత్రలలో సత్యనారాయణ గారికి సాటి ఎవ్వరు లేరు అని చెప్పవచ్చు. యముడిగా,రావణుడిగా మరియు దుర్యోధడునిగా నటించి ఆ పాత్రలకు జీవం పోసారు.      

1996  వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ నుంచి తరపున మచిలీపట్టణం నియోజక వర్గం నుంచి లోక్ సబా ఎలక్షన్ లను గెలిచారు.    

వ్యక్తిగత జీవితం : 

10 ఏప్రిల్ 1960 వ సంవత్సరంలో నాగేశ్వరమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు, వీరికి ఇద్దరు కూతుళ్లు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.  

సత్యనారాయణ గారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను మరియు మంచి ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తారు. జీవితం లో ఎక్కువగా బాధపడకుండా ఉండటమే మనిషి ఆరోగ్యానికి సహాయం చేస్తుందని కూడా చెబుతారు.

సత్యనారాయణ గారికి 2011 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు మరియు 2017 వ సంవత్సరంలో లైఫ్ టైం అచీవ్  మెంట్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది.  

మరణం:

2022 లో కొద్దీ రోజులుగా అనారోగ్యం కారణంగా భాదపడుతున్న సత్యనారాయణ గారు ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఆరోగ్యం విషమించటంతో 87 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 23, 2022 వ రోజన తన తుది శ్వాస విడిచారు.

Source: Kaikala Satyanarayana – Wikipedia

Leave a Comment