నరేంద్ర మోదీ జీవిత చరిత్ర – Narendra modi biography in Telugu

గుజరాత్ లోని ఒక చాయ్ కొట్టు నడిపే ఇంట్లో పుట్టి ప్రధాన మంత్రి గా ఎదిగిన వ్యక్తి  నరేంద్ర మోదీ. 8 సంవత్సరాలప్పుడు RSS లో చేరి అక్కడి నుంచి బీజేపీ పార్టీ లో క్రమ క్రమంగా ఎదిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విధించిన ఎమర్జెన్సీ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసారు. 2001 వ సంవత్సరంలో గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నాక గుజరాత్ కోసం పలు అభివృద్ధి పనులు చేసారు. 2014 సంవత్సరంలో దేశం యొక్క ప్రధాన మంత్రిగా ఎన్నుకోబడ్డారు.      

బాల్యం : 

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సెప్టెంబర్ 17 1950 వ సంవత్సరంలో గుజరాత్ లోని వడ్ నగర్ పట్టణంలో, దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీ మరియు హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించారు.  ఈ దంపతులకు మొత్తం 6 మంది సంతానం, మోదీగారు వీరికి 3 వ సంతానం.

మోదీ గారు 1967 సంవత్సరంలో వడ్ నగర్ లో ఇంటర్మీడియేట్ చదువుకున్నారు. వీరి టీచర్ల ప్రకారం మోదీ గారు చదువు లో అంతగా తెలివైన విద్యార్ధి కాక పోయిన డిబేట్ లలో ఎక్కువగా పాల్గొనేవారు. ఇదే కాకుండా థియేటర్ లో నాటకాలలో పాత్రలను కూడా వేసేవారు.   

చిన్న తనంలో మోదీ గారు వడ్ నగర్ రైల్వే స్టేషన్ లో తండ్రి యొక్క టీ కొట్టు లో సహాయం చేసేవారు. తర్వాత అక్కడి నుంచి బస్సు స్టేషన్ వద్ద తమ్ముడి తో పాటు కలిసి చాయ్ షాప్ ను పెట్టుకున్నారు.  

మోదీ తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో చేరి శిక్షణ తీసుకునేవారు. RSS లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో పెద్ద పెద్ద నేతలతో పరిచయం ఏర్పడింది. వీరిలో కొందరు గుజరాత్ లో బీజేపీ పార్టీ ని కూడా స్థాపించారు.

మోదీ గారికి చిన్న వయస్సులో పెళ్లి అయిన తరవాత కొన్ని రోజులు భార్య తో ఉన్నారు. ఆ తర్వాత  దాదాపు 2 సంవత్సరాల వరకు ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న వివిధ ఆశ్రమాల్లో బస చేసేవారు. మోదీ గారి చదువు ఎక్కువగా ఉండకపోవడంతో ఆశ్రమాలలో ఎక్కువ రోజులు ఉంచుకునేవారు కాదు.

ఇలా పలు రాష్ట్రాలు ప్రయాణించిన తరవాత అహ్మదాబాద్ లోని మామయ్య వద్ద క్యాంటీన్ లో పనిచేసేవారు. అహ్మదాబాద్ లో ఉన్నప్పుడు మళ్ళీ RSS లో చేరి ప్రచారకుడిగా మారారు. ఇదే సమయంలో భారతీయ జన సంఘ్ అనే రాజకీయ పార్టీ లో చేరారు. పలు నిరసనలలో పాల్గొని అరెస్ట్ కూడా అయ్యారు.          

రాజకీయ జీవితం :

1975 వ సంవత్సరంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ను ప్రకటించినప్పుడు ప్రతిపక్ష పార్టీ లకు చెందిన గ్రూపులను నిషేదించటం మరియు వాటి నాయకులను అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఆ సమయంలో మోదీ గారు RSS కు చెందిన గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి యొక్క జనరల్ సెక్రటరీ గా ఉన్నారు. 

ఇండియా గాంధీ RSS ను బ్యాన్ చేయటం జరిగింది. దేశమంతటా జరిగే అరెస్ట్ లను చుసిన మోదీ గారు తనను కూడా అరెస్ట్ చేయవచ్చు అని మరువేషాలలో ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకునే వారిని దాక్కోడానికి స్థలాన్ని ఏర్పాటు చేయటం లాంటివి చేసేవారు.    

ఎమర్జెన్సీ తరవాత RSS యొక్క ప్రాంతీయ నిర్వాహకుడిగా అయ్యారు. గుజరాత్ అనే కాకుండా ఢిల్లీ లో సైతం RSS కు సంబంధిన పనులను చూసేవారు. RSS సహాయం తో మోదీ గారు బీజేపీ పార్టీ లో 1955 లో చేరారు.  ఎన్నికల సమయంలో మోదీ చేసిన పలు వ్యూహాలకు మెచ్చి బీజేపీ జనరల్ సెక్రటరీ గా నియమించబడ్డారు. 

ముఖ్య మంత్రి గా నరేంద్ర మోదీ: 

1998 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ నాయకుడైన కేషుభాయ్ పటేల్ ను గెలిపించటం లో కూడా నరేంద్ర మోదీ  కీలక పాత్ర పోషించారు.

 2001 లో జరిగిన బై ఎలక్షన్ లలో బీజేపీ ఓడిపోవటం, కేషుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించటం వల్ల ఒక కొత్త నాయకుడిని బీజేపీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇంకో వైపు కేషుభాయ్ పటేల్ అధికారంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయలేదు అని అవినీతి కి పాలు పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. 

2001 లో గుజరాత్ లోని భుజ్ లో వచ్చిన పెద్ద భూకంపం లో కూడా ముఖ్య మంత్రి సరైన చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇవన్నీ కారణాలు మోదీ గారిని ఒక ముఖ్యమంత్రిగా అవ్వటంతో సహాయ పడ్డాయి.        

2002 వ సంవత్సరంలో గోద్రా కి సమీపంలో రైలు లో హిందూ యాత్రికులు చనిపోయిన తరవాత  హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 790 ముస్లింలు మరియు 254 హిందువులు చనిపోయారు.

ఈ సమయంలో నరేంద్ర మోదీ సరైన చర్యలు తీసుకోలేదు అని చాలా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీ ను రాజీనామా చేయాలనీ కోరారు. 2002 లోనే మోదీ తన పదవి నుంచి రాజీనామా కూడా చేసారు. రాజీనామా చేసిన తరవాత జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోదీ మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలుస్తారు.    

రెండవ సారి ముఖ్యమంత్రి గా నరేంద్ర మోదీ గారు ఎన్నికయ్యినప్పుడు గుజరాత్ లో చాలా డెవలప్మెంట్ చేసారు.                                      

ప్రధాన మంత్రి గా నరేంద్ర మోదీ: 

2014 వ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్ లలో నరేంద్రమోదీ గారు ప్రధాన మంత్రి గా ఎన్నుకోబడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి ని వదిలి దేశం యొక్క ప్రధాన మంత్రి అయ్యారు.   

వ్యక్తిగత జీవితం : 

మోదీ గారు 13 సంవత్సరాలప్పుడు ఉన్నప్పుడే  జశోదా బెన్ తో నిశ్చితార్థం జరిగింది మరియు 18 సంవత్సరాలప్పుడు పెళ్లి జరిగింది. కొద్ది రోజులు కలిసి ఉన్న తరవాత ఇద్దరు విడిపోయారు. మోదీ గారు వేరు వేరు రాష్ట్రాలలోని ఆశ్రమాల దర్శించుకున్నారు.   

Leave a Comment