శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర – Srinivasa Ramanujan biography in Telugu

భారతదేశం లో పుట్టిన అత్యంత మేధస్సు కలిగిన వాళ్లలో రామానుజన్ ఒకరు. చిన్న వయసు నుంచే క్లిష్టమైన గణితానికి సంబంధించిన సిద్ధాంతాలను సొంతంగా నేర్చుకునేవారు.

వీరు చేసిన పరిశోధనలను చూసి ఇంగ్లాండ్ కు చెందిన గణిత శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోవటం మరియు రామానుజన్ వద్ద డబ్బులు లేకపోవటం వల్ల వీరి ప్రతిభను అంతగా గుర్తించ లేకపోయారు.   

అపార మైన మేధస్సును కలిగి ఉన్నా కూడా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపేవారు, జీవితాంతం ఎదో ఒక ఆరోగ్య సమస్య తో బాధ పడ్డ గణితంలో తన పరిశోధనను ఆపలేదు.

ఈ రోజు కూడా రామానుజన్ యొక్క పుస్తకాలను మరియు వీరు రాసిన గణిత ఈక్వేషన్స్ ను సైన్స్ లో ఉపయోగించటం జరుగుతుంది.   

బాల్యం :

రామానుజన్ 22 డిసెంబర్,1887 వ సంవత్సరంలో తమిళనాడు లోని కుప్పుస్వామి మరియు కోమలతమ్మల్ అనే దంపతులకు తంజావూరు జిల్లాలోని కుంబకోణం లో జన్మించారు.  

రామానుజన్ గారి తండ్రి ఒక చీరల దుకాణంలో పనిచేసేవారు, తల్లి హౌస్ వైఫ్ అదే విధంగా ఇంటి దగ్గర ఉన్న గుడి లో పాటలు కూడా పాడేవారు. 

రామానుజన్ తర్వాత పుట్టిన సంతానం కొద్దీ రోజులకే చనిపోవటం జరిగింది. రామానుజన్ కి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ (Small pox) అనే భయంకర వ్యాధి బారిన పడ్డారు.

 ఆ సమయంలో ఈ వ్యాధి బారిన పడ్డ 4000 మంది చనిపోగా రామానుజన్ గారు మాత్రం ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ వ్యాధినుంచి కోలుకున్నాక రామానుజన్ తమ కుటుంబం తో పాటు అమ్మమ్మ ఊరు అయిన కంచీపురం కు మారారు. 1892 వ సంవత్సరంలో రామానుజన్ గారు స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్నారు. 

చదువు : 

రామానుజన్ గారి తాతయ్య కాంచీపురం లోని న్యాయస్థానం లో పనిచేసేవారు, తాతయ్య గారి ఉద్యోగం పోయిన తరవాత   

తిరిగి తమ ఊరు అయిన కుంభకోణానికి వచ్చేసారు. రామానుజన్ గారి తాతయ్య (కుప్పుస్వామి గారి నాన్న) చనిపోవటం వల్ల రామానుజన్ ను అమ్మమ్మ వద్దకు పంపించారు. 

ఆ సమయంలో వీరి అమ్మమ్మ చెన్నై లో నివసించేవారు, అక్కడే ఒక స్కూల్ లో చేర్పించారు. రామానుజన్ కి స్కూల్ నచ్చకపోయేది, స్కూల్ కి సరిగా వెళ్లకపోయేవారు. 

రామానుజన్ స్కూల్ కి వెళుతున్నారా లేదా అని తనిఖీ చేయటానికి ఒక కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకునేవారు. ఇంత చేసిన 6 నెలలలో రామానుజన్ తిరిగి తల్లి తండ్రుల వద్ద కుంబకోణం కి చేరుకున్నారు.      

ఇంటికి తిరిగి వచ్చిన తరవాత అక్కడే కంగయాన్ ప్రైమరీ స్కూల్ లో చేరారు. రామానుజన్ గారి తండ్రి ఎక్కువ శాతం పనిలో నిమగ్నమై ఉండటం వల్ల వీరి తల్లి రామానుజన్ గారిని చూసుకునేవారు. వీరి తల్లి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం వల్ల వీరి దగ్గరి నుంచి హిందూ సంప్రదాయాలు, పురాణాలు, గుడికి వెళ్ళటం మరియు దైవ సంభందిత పాటలు నేర్చుకొనేవారు. 

రామానుజన్ ఆహారం తీసుకోవటంలో శ్రద్ధ తీసుకునేవారు, కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారు. 1897 సంవత్సరంలో ప్రైమరీ స్కూల్ ను ఆ జిల్లా మొత్తంలోనే ఎక్కువ మార్కులతో పూర్తి చేసారు. 

ప్రైమరీ స్కూల్ ను పూర్తి చేసుకున్న తర్వాత కుంబకోణం లోనే టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చేరారు. జీవితంలో  మొదటిసారి ఫార్మల్ మ్యాథమెటిక్స్  ను చదివారు. కేవలం 11 సంవత్సరాలప్పుడు తన ఇంటి వద్ద కిరాయి తో ఉంటున్న ఇద్దరు కాలేజీ విద్యార్థుల గణిత పరిజ్ఞానానికి సవాలు విసిరారు.

కేవలం 13 సంవత్సరాల వయస్సులో త్రికోణమితి (trigonometry), కష్టమైనా సిద్ధాంతాలు (theorems), జామెట్రీ, ఇన్ఫ నైట్ సిరీస్ లను సొంతంగా నేర్చుకున్నారు.  స్కూల్ లో పెట్టే పరీక్షలలో కూడా ఇచ్చిన సమయంలో కేవలం సగం సమయంలో పరీక్షను పూర్తి చేసేవారు.   

రామానుజన్ గారు తనదైన శైలిలో  గణితంలోని ప్రశ్నలను పరిష్కరించేవారు. 1904 స్కూల్ లో చదువును పూర్తి చేసుకున్న తరవాత అక్కడి మాస్టర్ అయిన రంగనాత రావు గారు రామానుజన్ ను పొగిడి  బహుమతిని కూడా ఇచ్చారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకోవటం వల్ల కుంబకోణం లోని ఆర్ట్స్ కాలేజీ లో స్కాలర్ షిప్ కూడా దొరికింది. 

రామానుజన్ కి గణితం పై ఉన్న అవగాహన మరియు ప్రేమ ఇతర సబ్జెక్టులలో ఫెయిల్ చేసింది. ఫలితంగా వచ్చిన స్కాలర్ షిప్ కూడా పోయింది. ఇక లాభం లేదు అనుకోని ఇంటినుంచి పారిపోయి ఒక నెల రాజామండ్రి లో బస చేసారు. అక్కడి  నుంచి తిరిగి వచ్చిన తర్వాత మద్రాస్ (Chennai) లోని కాలేజీ లో అడ్మిషన్ తీసుకున్నారు.       

ఈ కాలేజీ లో ఇతర సబ్జెక్టులులలో చాలా తక్కువ మార్కులు తెచ్చుకునేవారు, గణితంలో కూడా తనకు నచ్చిన ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇచ్చేవారు. రెండు సార్లు పరీక్షలు రాసిన కూడా కాలేజీ లో పాస్ అవ్వ లేకపోయారు. చివరికి డిగ్రీ లేకుండానే కాలేజీ వదిలేసారు. కాలేజీ నుంచి బయటికివచ్చిన తరవాత సొంతంగా గణితంలో రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో డబ్బులు లేక తినటానికి తిండి లేకా చాలా భాద పడ్డారు.       

1910 వ సంవత్సరంలో 23 సంవత్సరాల రామానుజన్ ఇండియన్ మాథమెటికల్ సొసైటీ ను స్థాపించిన రామస్వామి అయ్యర్  గారిని కలిసారు. ఇన్ని రోజులు కేవలం కొంత మందికి మాత్రమే రామానుజన్ గారి మేధాశక్తి తెలుసు, అయ్యర్ గారిని కలుసుకున్న తరవాత మద్రాస్ లో రామానుజన్ గారి గురించి క్రమంగా  తెలియటం ప్రారంభమయ్యింది. మద్రాస్ యూనివర్సిటీ లో కూడా రామానుజన్ ఒక గణిత శాస్త్రవేత్త అనే విషయం తెలిసిపోయింది. 

రామానుజన్ పెళ్లి మరియు ఆరోగ్యం : 

1909 సంవత్సరంలో రామానుజన్ గారు అమ్మ చూసిన జానకి అనే అమ్మాయి ని పెళ్లి చేసున్నారు. ఆ సమయంలో జానకి వయస్సు కేవలం 10  సంవత్సరాలు. పెళ్లి తర్వాత యుక్త వయస్సు వచ్చే వరకు వారి తల్లి దగ్గరే ఉన్నారు. 

యుక్తవయసు వచ్చిన తరవాత 1912 వ సంవత్సరంలో తన అత్త తో కలిసి రామానుజన్ తో పాటు మద్రాస్ లో నివసించటం మొదలుపెట్టారు. 

రామానుజన్ గారు జీవింతాంతం చాలా సార్లు అనారోగ్యం బారిన పడ్డారు. పెళ్లి తరవాత హైడ్రోసెల్ టెస్టిస్ (hydrocele testis) అనే  వృషణాలకు (Testicle) చెందిన వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ని నయం చేయాలంటే ఆపరేషన్ చేయాలి కానీ ఆపరేషన్స్ కి డబ్బులు లేకపోవటం తో చేయించుకోలేదు. 

ఒక డాక్టర్ మాత్రం డబ్బులు లేకుండానే రామానుజన్ కి ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ తరవాత కూడా రామానుజన్ గారి అంత మంచిగా ఉండేది కాదు. మరోపక్క ఉద్యోగ ప్రయ్నతాలు కూడా చేసేవారు, 1913 మద్రాస్ యూనివర్సిటీ లో ఉద్యోగం దొరికిన తర్వాత రామానుజన్ కుటుంబం తో పాటు చెన్నై కి దగ్గరలో ఉన్న ట్రిప్లికేన్ కి మారారు.       

ఉద్యోగం :

రామానుజన్ కి గణితంలో ఉన్న మేధా శక్తి అద్భుతమైనది కానీ వీరికి ఎక్కడ కూడా స్థిర మైన ఒక ఉద్యోగం కూడా దొరకలేదు. ఇదే విషయాన్ని Indian Mathematical Society యొక్క స్థాపకుడైన రామస్వామి అయ్యర్ కు తాను పనిచేసే రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పించమని కోరుతారు.

 రామానుజన్ కి రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పించటం తన మేధస్సు  కు న్యాయం జరగదు అని భావించి నెల్లూరు కలెక్టర్ మరియు Indian Mathematical Society యొక్క సెక్రటరీ అయిన రామచంద్ర రావు వద్దకి సిఫారసు చేసి పంపిస్తారు.

మొదట కలెక్టర్ రామానుజన్ ని అనుమానిస్తారు. తనకి గణితంలో ఇంత మేధస్సు లేదు అని బహుశా మోసం చేస్తున్నాడని అనుమానిస్తారు. 

రామానుజన్ తో పాటు ఇంతకూ ముందు పని చేసిన వారు రామానుజన్ మేధస్సు గురుంచి చెప్పగా గణితానికి సంబంచిన కొన్ని విషయాలపై చర్చించగా రామానుజన్ తెలివి తేటలను మరియు గణితం లో ఉన్న పట్టు ను గ్రహించి మీకు నేను ఏమి సహాయం చేయగలను అని అడిగారు.  నాకు డబ్బు అవసరం ఉందని ఏదైనా ఉద్యోగం ఇప్పించమని రామానుజన్ గారు అడుగుతారు   

రామానుజన్ ను తన రీసెర్చ్ ను మద్రాస్ వెళ్లి కొనసాగించాలని దానికి తగిన సహాయం చేస్తానని కలెక్టర్ చెప్పారు. రామానుజన్ జర్నల్స్ ద్వారా గణితానికి సంబంచిన ప్రశ్నలు అడిగే వారు, వీరి కఠిన ప్రశ్నలకు ఎవ్వరు కూడా జవాబు ఇచ్చేవారు కాదు.  ఫలితంగా రామానుజన్ ప్రశ్నలకు తానే స్వయంగా  జవాబులను ఇచ్చేవారు.   

రామానుజన్ ఇచ్చే ప్రశ్నలు కానీ వాటికి ఇచ్చే వివరణలు సామాన్య ప్రజలకు అర్థం అవ్వటం చాలా కష్టంగా ఉండేది. వీటిని అర్థం చేసుకోవాలంటే వారు కూడా గణితంలో ఆరి తేరి ఉండాలి.   

1912 వ సంవత్సరంలో రామానుజన్ ఒక గణిత లెక్చరర్ సిఫారసు మేరకు అకౌంటింగ్ క్లర్క్ గా ఉద్యోగం సంపాదించారు. నెలకు 30 రూపాయలు సంపాదించేవారు. ఉద్యోగానికి సంబంధించిన పనిని కేవలం సగం రోజు లోనే పూర్తి చేసి మిగతా సమయంలో గణితం పై పరిశోధనలు చేసేవారు.    

 1913 సంవత్సరంలో మద్రాస్ లోని గణిత ప్రముఖులు రామానుజన్ యొక్క జర్నల్స్  ను గణితానికి సంబంచిన రీసెర్చ్ ను లండన్ కు పంపించటం జరిగింది. ముందు అక్కడి గణిత శాస్త్రజ్ఞులు రామానుజన్ యొక్క ప్రతిభను గుర్తించారు. ఇది తన పని కాదు అని అంటారు కానీ హార్డీ అనే అక్కడి గణిత శాస్త్రవేత్త రామానుజన్ కు గణితం పై ఉన్న మేధస్సును చూసి ఆశ్చర్య పోతారు. రామానుజన్ ని ఇంగ్లాండ్ కు రమ్మని కోరటం జరుగుతుంది. 

రామానుజన్ తల్లి తండ్రులు ఇంగ్లాండ్ కి వెళ్లవద్దని చెప్పగా రామానుజన్ తనకి ఇంగ్లాండ్ కి రావటం ఇష్టం లేదు అని చెప్పటం జరుగుతుంది. ఈ సమయం లోనే రామానుజన్ తల్లికి కలలో నామగిరి దేవత వచ్చి రామానుజన్ ప్రయాణానికి అడ్డు పడవద్దని చెప్పటం జరుగుతుంది.

1914 వ సంవత్సరంలో రామానుజన్ లండన్ కి బయలుదేరుతారు. ఇంగ్లాండ్ లో దాదాపు 5 సంవత్సరాలు కేంబ్రిడ్జి  యూనివర్సిటీ లో గడిపారు. అక్కడి గణిత శాస్త్రజ్ఞులతో పలు పరిశోధనలో పాల్గొన్నారు. 

వ్యక్తిగత జీవితం మరియు మరణం : 

రామానుజన్ గారు శాకాహారి కావటం వల్ల ఎప్పుడు ఆహార సమస్య లను ఏదోర్కవాల్సి వచ్చేది. సరైన ఆరోగ్యం దొరకక పోవటం వల్ల విటమిన్ లోపం ఏర్పడింది మరియు క్షయవ్యాధి (tuberculosis) వ్యాధి బారిన పడ్డారు. 1919 సంవత్సరంలో ఇంగ్లాడ్ నుంచి కుంబకోణానికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం బాగా క్షిణించటం వల్ల 1920 వ సంవత్సరంలో కేవలం 32 సంవత్సరాల వయస్సులో చనిపోవటం జరిగింది.

రామానుజన్ గారికి ఎలాంటి సంతానం కలగలేదు, వీరి భార్య జానకి గారికి మద్రాస్ యూనివర్సిటీ పెన్షన్ వసతి కలిపించిది. జానకి గారు డబ్బుల కోసం బట్టలు కూడా కుట్టేవారు. జానకి గారు నారాయణ్ అనే బాబు ను దత్తత కూడా తీసుకున్నారు. జానకి గారికి తరవాతి సంవత్సరాలలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ వసతి ని కూడా కనిపించింది. 

రామానుజన్ గారు తన మేధస్సు వెనక ఉన్న రహస్యం దేవత నామగిరి అని చెప్పేవారు. నామగిరి దేవతే తనకు గణితానికి సంబంధించ క్లిష్టమైన జ్ఞానాన్ని ఇచ్చారని చెప్పేవారు.              

Leave a Comment