పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర – Puneeth Rajkumar biography in Telugu

పునీత్ రాజ్ కుమార్ /లోహిత్ కుమార్ కన్నడ పరిశ్రమలోఒక మంచి నటుడు, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్. పునీత్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు.  

సినిమాలే కాకుండా TV లో కూడా  కన్నడదా కొట్యాధిపతి (మీలో ఎవరు కోటీశ్వరులు) అనే షో కూడా చేశారు. 

బాల్యం : 

పునీత్ కు పుట్టినప్పుడు పెట్టిన పేరు లోహిత్. 17 మార్చి 1975 వ సంవత్సరంలో రాజ్ కుమార్ మరియు పార్వతమ్మ  రాజ్ కుమార్ అనే దంపతులకు చెన్నై నగరంలో జన్మించారు.    

ఈ దంపతులకు పునీత్ 5 వ కుమారుడు.పునీత్ చిన్న వయసులోనే ఈ కుటుంబం మైసూర్ నగరానికి మారారు.  వీరి కుటుంబం ముందు నుంచే సినీ పరిశ్రమ లో ఉండటం కారణంగా పునీత్ కూడా తక్కువ వయసు లోనే సినిమా సెట్ లకు వెళ్లే వారు.

కెరీర్:

పునీత్ రాజ్ కుమార్ తన వయస్సు 6 నెలలు ఉన్నప్పుడే  1976 వ సంవత్సరంలో విడుదల అయిన ప్రేమదా కనికే (Premada Kanike) అనే సినిమా నుంచి తన కెరీర్ ను ప్రారంభించారు. 

ఇలా చిన్నప్పటి నుంచే ఒకటి తరవాత మరొకటి సినిమాలలో నటిస్తూ ఒక మంచి కెరీర్ ను ప్రారంభించారు. 1985 వ సంవత్సరంలో 33 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ను పొందారు. 

 పునీత్ 2002 వ సంవత్సరంలో మొదటి సారిగా లీడ్ రోల్ లో అప్పు (Appu) అనే బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించారు. ఈ సినిమా సక్సెస్ ను చుసిన తరవాత తెలుగు లో ఇడియట్(idiot), తమిళ్ లో Dum అనే సినిమా రీమేక్ లు చేయటం జరిగింది.     

2002 తరవాత పలు సినిమాలలో నటించిన తరవాత 2007 వ సంవత్సరంలో తన సొంత ప్రొడక్షన్ లో అరసు (Arasu) అనే సినిమాను చేశారు. ఈ సినిమా కి ఫిలింఫేర్ బెస్ట్ ఆక్టర్ అవార్డు లభించింది.    

2008 నుంచి 2015 పలు సినిమాలలో నటించారు. ఈ కాలంలో కొన్ని ఇతర భాషల సినిమాలను కూడా పునీత్ రాజ్ కుమార్ డబ్ చేయటం జరిగింది. 

2017 లో పునీత్ నటించిన రాజకుమార సినిమాలో నటించారు. ఈ సినిమా కన్నడ లో అప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.

కెజిఫ్ సినిమా రిలీజ్ అయిన తరవాత పునీత్ సినిమా రికార్డు ను బద్దలు కొట్టింది.      

పునీత్ సినిమాలలో నటించటమే కాకుండా ప్లేబాక్ సింగింగ్ కూడా చేశారు. అప్పు (Appu), జాకీ (Jackie), లవ కుశ, మైలరి అనే సినిమాలలో పాటలు పాడారు.     

వ్యక్తిగత జీవితం :

పునీత్ అశ్విని రేవంత్ తో 1 డిసెంబర్ 1999 సంవత్సరంలోపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కూతుళ్లు ఉన్నారు, దృతి మరియు వందిత.    

మరణం : 

అక్టోబర్ 29 2021 సంవత్సరంలో పునీత్ గుండె పోటు కారణంగా బెంగళూరు లోని ఒక ఆసుపత్రి లో కేవలం 46 సంవత్సరాల వయసు లో మరణించారు.   

పునీత్ తన మరణం తరవాత తన రెండు కళ్ళను డొనేట్ చేశారు.  

Leave a Comment