ఉధమ్ సింగ్ జీవిత చరిత్ర – Udham singh biography in Telugu

ఉధమ్ సింగ్ పంజాబ్ కు చెందిన ఒక విప్లవ కారుడు, భారత దేశ స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేయబడ్డ గదర్ పార్టీ కి చెందిన వారు. 

 ఉధమ్ సింగ్  13 మార్చ్ 1940 సంవత్సరంలో మైఖేల్ ఓ డ్వయర్ (Michael O’Dwyer) అనే మాజీ పంజాబ్ గవర్నర్ ను హత్య చేశారు.

ఈ ఘటన ను ఆధారం చేసుకొని 2021, అక్టోబర్ 16 న సర్దార్ ఉధమ్ (Sardar udham) అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది.

బాల్యం :

ఉధమ్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ (Sangrur) జిల్లా లోని సునం (Sunam) అనే పట్టణం లో జన్మించారు. ఉధమ్ సింగ్ తన తల్లి తండ్రులను చిన్న తనం లోనే కోల్పోయారు. 

పుట్టినప్పుడు ఉధమ్ సింగ్ కి షేర్ సింగ్ అని పేరు పెట్టడం జరిగింది. తన తల్లి తండ్రులు చనిపోయాక షేర్ సింగ్ మరియు తన అన్న ముక్తా సింగ్ అమ్రిత్ సర్ లోని ఒక అనాధ శరణాలయంలో పెరిగారు.

ఈ శరణాలయం సిక్కు సముదాయానికి చెందినది కాబట్టి అక్కడి ఆచారాలను పాటిస్తూ ఉధమ్ సింగ్ అని పేరు పెట్టుకొవటం జరిగింది.

10 వ తరగతి చదివిన తరవాత ఉధమ్ సింగ్ అనాధ శరణాలయాన్ని1919 లో వదిలేశారు.

మైఖేల్ ఓ డ్వయర్ హత్య కు కారణం :

1919 సంవత్సరంలో అమ్రిత్ సర్ లోని జలియన్ వాలా భాగ్ లో 20,000 నిరాయుధులు బైసాఖి అనే పండగను జపరుపుకోవటానికి మరియు రౌలట్ చట్టం కింద బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అరెస్టులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. 

ఇక్కడ జమ అయిన వారికి ఉధమ్ సింగ్ అనాధశరణాలయం తరపున త్రాగు నీరు అందిస్తున్నారు. ఇంతలో మైఖేల్ ఓ డ్వయర్ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న దళాలు అక్కడ జమ అయిన వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరపటం మొదలుపెట్టారు.

ఈ కాల్పులలో వందల కొద్ది ప్రజలు మరణించారు, ఈ ఘటనను జలియన్ వాలా భాగ్  నరమేధం అని కూడా అంటారు.

 మైఖేల్ ఓ డ్వయర్ హత్య :

ఈ సంఘటన భారత దేశంలోని చాలా మందికి కోపానికి గురిచేసింది అందులో ఒకరు ఉధమ్ సింగ్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలాగైనా అంతం చేయాలని ఆలోచించిన ఉధమ్ సింగ్ భగత్ సింగ్ తో కలిసి గదర్ పార్టీ లో చేరారు.

లైసెన్స్ లేకుండా ఆయుధాలను ఉంచుకున్నారని తెలియడంతో ఉధమ్ సింగ్ కి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అక్కడి నుంచి బయటికి వచ్చిన తరవాత తన వేషాన్ని మార్చుకొని కాశ్మీర్ కి వెళ్లారు. 

కాశ్మీర్ నుంచి జర్మనీ ద్వారా 1934  సంవత్సరంలో లండన్ చేరుకున్నారు. ఉధమ్ సింగ్ లండన్ కి రావటానికి ముఖ్య కారణం మైఖేల్ ఓ డ్వయర్ ను చంపటం.

1940 వ సంవత్సరం క్యాక్సటన్ హాల్ లో ఓ డ్వయర్ సంభాషిస్తుండగా ఉధమ్ సింగ్ పుస్తకం లోపలి భాగాన్ని గన్ ఆకారంలో కత్తిరించి దానిలో గన్ పెట్టుకొని  క్యాక్సటన్ హాల్ కి వెళ్లారు.

అక్కడి సంభాషిస్తున్న ఓ డ్వయర్ పై కాల్పులు జరపగా తానూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో కొంతమంది గాయాల పాలు కూడా అయ్యారు.

 మైఖేల్ ఓ డ్వయర్ హత్య తరవాత :

హత్య తరవాత అక్కడ ఉన్న పోలీసులు ఉధమ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. హత్య ఎందుకు చేశారని అడగగా “తనంటే నాకు పగ, తనకు ఇది జరగాల్సిందే. నేను ఏ పార్టీ కి కూడా చెందను, నాకు చావు అంటే భయం లేదు. ముసలి తనం వచ్చేవరకు జీవించి ఎం ప్రయోజనం” అని చెప్పారు.  

అక్కడ జైలులో ఉన్నప్పుడు తన పేరు “Ram Mohammad Singh Azad ” అని చెప్పారు.  ఈ పేరు హిందూ, ముస్లిం, సిఖ్ ల కలయిక గా పెట్టుకున్నారు. 

మరణం:

ఉధమ్ సింగ్ చేసిన హత్యకు అక్కడి కోర్ట్ ఉరి శిక్ష విధించింది. 31 జులై 1940 వ సంవత్సరంలో ఉధమ్ సింగ్ ఉరి తీయబడ్డారు. 

మైఖేల్ ఓ డ్వయర్ హత్య ను కొంత మంది ఖండించారు మరికొంత మంది ప్రశంసించారు. 

1974 సంవత్సరంలో ఉధమ్ సింగ్ అవశేషాలు భారత దేశ కోరిక మేరకు పంపించడం జరిగింది. వీటిని ఇందిరా గాంధీ మరియు శంకర్ దయాల్ శర్మ అందుకున్నారు. 

ఉధమ్ సింగ్ జన్మ స్థలమైన సునం లోనే దహన సంస్కరాలు చేశారు. మిగిలిన చితి భస్మంలోని కొంత భాగం ను సుట్లేజ్ నది లో కలపగా మిగిలిన భాగాన్ని జలియన్ వాలా భాగ్ లో భద్ర పరిచారు.  

1 thought on “ఉధమ్ సింగ్ జీవిత చరిత్ర – Udham singh biography in Telugu”

Leave a Comment