మేఘన లోకేష్ జీవిత చరిత్ర – Meghana lokesh biography in Telugu

పేరుమేఘన లోకేష్
జన్మస్థలంమైసూర్, కర్ణాటక.
వృత్తినటి (సీరియల్స్)

వ్యక్తిగత జీవితం:

మేఘన లోకేష్ కర్ణాటక రాష్ట్రం లోని మైసూర్ లో జన్మించారు. మేఘన తండ్రి మరియు తమ్ముడు ఇద్దరు కూడా ఇంజినీర్లు. మేఘన తల్లి కన్నడ లెక్చరర్.

కెరీర్ :

మేఘన కు చిన్నతనం నుంచే  నటన అంటే ఇష్టం, 8 సంవత్సరాల నుంచి డిగ్రీ వరకు థియేటర్ లో 270 షో లు చేసారు.

మేఘన తన కెరీర్ ను జీ కన్నడా ఛానల్ నుంచి ప్రారంభించారు, ఈ ఛానల్ లో “దేవి” అనే సీరియల్ లో సపోర్టింగ్ రోల్ లో నటించారు.    

సపోర్టింగ్ రోల్ చేసిన తరవాత లీడ్ రోల్ లో కూడా నటించటం ప్రారంభించారు. పవిత్ర బంధన, పురుషోత్తమ అనే రెండు కన్నడ సీరియల్ లలో లీడ్ రోల్ లో నటించటం ప్రారంభించారు.

కన్నడ సీరియల్ లలో నటించిన తరవాత తెలుగు లో కూడా సీరియల్ కెరీర్ ను ప్రారంభించారు.

2013 నుంచి 2016 వరకు నడిచిన సీరియల్ శశిరేఖా పరిణయం వల్ల మేఘన కు మంచి పేరు మరియు గుర్తింపు లభించింది.  

సీరియల్ లో నటించడమే కాకుండా సినిమా మరియు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మేఘన లోకేష్ నటించడం జరిగింది.

యాంకర్ రవి కో – ఆక్టర్ గా ఇది మా ప్రేమ కథ అనే సినిమా లో కూడా నటించారు.

ప్రస్తుతం మేఘన 2017 లో మొదలైన సీరియల్ కల్యాణ వైభోగం లో డ్యూయల్ రోల్ చేస్తున్నారు.  

మేఘన లోకేష్ తన ఖాళీ సమయంలో యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఛానల్ కి రెండు లక్షల కి పైగా సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.

యూట్యూబ్ ఛానల్ లో ఎక్కువగా వ్లాగింగ్ (vlogging) కు సంబంచిన వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు.    

Leave a Comment