మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu

మదర్ థెరీసా స్కోప్జే- Skopje (ప్రస్తుతం మేసిడోనియా) అనే దేశంలో జన్మించి 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఐర్లాండ్ కి వెళ్లారు అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చారు.

మదర్ థెరీసా ముఖ్యంగా తమ జీవిత కాలంలో చేసిన సేవలు మంచి పేరును తెచ్చాయి మరియు వివిధ అవార్డ్స్ కూడా అందుకున్నారు.

రోగాలతో భాదపడుతున్న వారికి సహాయం చేయటం, ఆకలి తో ఉన్నవారికి ఆకలి తీర్చటం, వైద్య సదుపాయాలు కలిగించటం మరియు అనాధ పిల్లలకు విద్యను అందించటం లాంటి పలు సేవ కార్యక్రమాలు చేశారు. 

థెరీసా తమ జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేశారు. నిస్సహాయులకు, నిరాశ్రయులకు, పేదవారికి అండగా నిలిచారు.     

బాల్యం :  

 మదర్ థెరీసా 26 ఆగస్ట్ 1910 వ సంవత్సరంలో అట్టోమన్ సామ్రాజ్యం లోని స్కోప్జే నగరం లో జన్మించారు. ప్రస్తుతం ఈ నగరం మాసిడోనియన్ అనే దేశంలో ఉంది.

మదర్ థెరీసా Nikola Bojaxhiu మరియు  Dranafile Bojaxhiu అనే దంపతులకు జన్మించారు. థెరీసా 8 సంత్సరాలప్పుడు తమ తండ్రిని కోల్పోయారు. థెరీసా యొక్క తండ్రి అల్బేనియా కి చెందినవారు. 

ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరురుగుతుంది, థెరీసా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత  మాత్రమే.

కానీ థెరీసా యొక్క తల్లి  బట్టలు కుట్టి  పిల్లల యొక్క బాధ్యతలను స్వీకరిస్తుంది మరియు వారిని పెంచి పెద్దగా చేస్తుంది.  

మదర్ థెరీసా పుట్టిన రెండవ రోజే బాప్టిజం తీసుకున్నారు.  చిన్నతనం నుంచే థెరీసా కు మిషనరీస్ చేస్తున్న మంచి పనులను చూసి చాలా ప్రభావితులయ్యారు. ఆ చిన్న తనంలోనే తన జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలనుకున్నారు.  

థెరీసా కు 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఇంగ్లీష్ భాషను నేర్చుకోవటానికి ఐర్లాండ్ వెళ్లారు, అక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు. 

1929 సంవత్సరంలో థెరీసా ఇండియా లోని వెస్ట్ బెంగాల్ లోని డార్జీలింగ్ కి చేరుకున్నారు. ఇక్కడ బెంగాల్ భాషను నేర్చుకొని ఇక్కడే స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఇక్కడే తమ పేరును థెరీసా  (Teresa) గా పెట్టుకున్నారు.  

1943 లో వచ్చిన బెంగాల్ కరువు వల్ల మరియు 1946 లో జరిగిన అల్లర్ల వల్ల చాలా మంది పేదరికం బారిన పడ్డారు.   అదే సమయంలో జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కూడా చాలా మంది పేదలుగా మారారు. 

ఇదంతా చూస్తున్న థెరీసా ఎంతో కదిలిపోయారు, తాను చదివిస్తున్న స్కూల్ ను వదిలి పేదవారికి మరియు అవసరంలో ఉన్న వారికి సహాయపడాలి అని నిర్ణయించుకున్నారు. 

ఈ మంచి ఉద్దేశంతో మిషనరీస్ అఫ్ చారిటీ అనే సంస్థ ను ప్రారంభించారు.    

మదర్ థెరీసా సేవలు : 

1950 వ సంవత్సరంలో థెరీసా మిషనరీస్ అఫ్ చారిటీ స్థాపించటానికి ముఖ్య కారణం తమ మాటలలో ఇలా వివరించారు ” ఆకలితో బాధపడేవారు, బట్టలు లేని వారు, ఇల్లు లేని వారు, వికలాంగులకు, కళ్ళు లేని వారికి, కుష్టు రోగంతో బాధపడేవారికి, తమను వద్దనుకున్న వారికి, ప్రేమించబడని వారికి, సమాజం పట్టుంచుకొని వారికి, సమాజానికి భారంగా మారిన వారికి” మిషనరీస్ అఫ్ చారిటీ (Missionaries of charity) అండగా మరియు ఎల్లపుడు సహాయం చేస్తుందని తెలిపారు.

ఈ చారిటీలో లో పనిచేసే వారు నీలి రంగు బార్డర్ తో ఉన్న తెల్ల చీరను కట్టుకునేవారు. ఈ చీర ఒక సాంప్రదాయ దుస్తువు గా మరియు మిషనరీస్ అఫ్ చారిటీ కి ఒక గుర్తింపుగా మారింది.  

1952 వ సంవత్సరంలో కలకత్తా అధికారుల సహాయం తో మొట్ట మొదటి ధర్మశాల ను ప్రారంభించారు. థెరీసా ఒక పాడుబడ్డ గుడి అయిన కాళీఘాట్ ను పేదవారికి మరియు అవసరంలో ఉన్న వారి కోసం కాళీఘాట్, నిర్మల హ్రిదయా నిలయం అని పేరు పెట్టారు.

ఈ  గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏ మతం వారు వచ్చిన తమ తమ మతాలను అనుసరించే అవకాశాన్ని ఇవ్వటం జరిగేది. ముస్లిం లు ఖురాన్ చదవటానికి, హిందువులకు గంగా నది యొక్క నీరును మరియు క్రిస్టియన్స్ కి ఎక్స్ట్రీమ్ అంక్షన్ ఇచ్చేవారు.     

థెరీసా ఇలాంటి చావును ఒక అందమైన మరణంగా చెప్పేవారు,  ఇన్నిరోజులు ఎవరు పట్టించుకోని వారికి ధర్మశాల వీరిని ప్రేమించి ఆడుకుంది అనే చెప్పేవారు.

థెరీసా పెళ్లి చేసుకోక పోయిన చిన్న పిల్లలకి మరియు అవసరంలో ఉన్న వారికి, రోగాలతో భాదపడుతున్న వారికి  ఒక అమ్మ లాగా నిలిచారు.   

 మదర్ థెరిసా చేసే మంచి పనులను చూసి చాలా మంది డొనేషన్లను ఇవ్వటం మొదలుపెట్టారు.  1960 సంవత్సరం లో థెరిసా ఇండియా మొత్తంలో ధర్మ శాలలను విస్తరించారు. ఇండియా లోనే కాకుండా ప్రపంచం లోని పలు దేశాలలో థెరిసా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు.   

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రదర్స్ :

ముందు కొంత మంది సిస్టర్స్ తో కలిసి ప్రారంభించిన మిషనరీ అఫ్ చారిటీ 1963 వ సంవత్సరంలో మిషనరీస్ అఫ్ చారిటీ  బ్రథర్స్ అని ఇంకొక బ్రాంచ్ తో మొదలుపెట్టారు.

మదర్ థెరిసా కు వచ్చిన చిన్న ఆలోచన మరియు సేవ చేయాలనే ఒక గుణం ఎంతో మందిని ప్రేరేపించింది. 2007 వ  0…సంవత్సరం వచ్చే నాటికి 450 బ్రదర్స్ తో మరియు 5000 సిస్టర్ల తో 120 దేశాలలో విస్తరించింది.  

అవార్డులు : 

మదర్ థెరిసా కు ఇండియా లో చూపిన విధంగా అవార్డు లు ఇచ్చారు. 

సంవత్సరం అవార్డులు 
1962పద్మశ్రీ 
1969జవహర్ లాల్ నెహ్రు అవార్డు 
1979నోబెల్ పీస్ ప్రైజ్ 
1980భారత్ రత్న 

ఇండియా లో కాకుండా ప్రపంచంలోని పలు దేశాలలో కూడా థెరిసా చేసిన మంచి పనులను గుర్తించి అవార్డులను ఇవ్వటం జరిగింది.  

 మరణం : 

థెరిసా గారికి 1983 లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది, 1989 లో రెండవ సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. 1990 నుంచి థెరిసా ఎక్కువగా అనారోగ్యంగానే ఉండేవారు.   

13 మార్చి 1997 లో థెరిసా మిషనరీస్ అఫ్ చారిటీ హెడ్ గా రాజీనామా చేశారు.  

మదర్ థెరిసా పై ఆరోపణలు :

మదర్ థెరిసా చేసిన పనులకు చాలా మంది వ్యతిరేకత కూడా చూపించారు., కలకత్తా లో పుట్టి పెరిగిన అరూప్ ఛటర్జీ ” నేను ఎప్పుడు కలకత్తా స్లమ్స్ లో సిస్టర్స్ ని చూడలేదు” అని ఆరోపించారు.     

కొన్ని హిందుత్వ వర్గాలు కూడా థెరిసా కలకత్తా ను తప్పుగా చూపించారని, అక్కడ అంత మంది పేదలు లేరని ఆరోపించారు. మరి కొన్ని వర్గాలు థెరిసా చారిటీ పేరుతో మత మార్పిడిలు చేశారని కూడా ఆరోపించారు.     

Source: Mother Teresa – Wikipedia

1 thought on “మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu”

Leave a Comment