అన్న మణి గారు భారతదేశానికి చెందిన ఒక భౌతిక మరియు వాతావరణ శాస్త్రవేత్త.
అన్న మణి గారు 1918 సంవత్సరంలో కేరళ లోని పీర్మేడ్ గ్రామంలో సిరియా కు చెందిన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ లో జన్మించారు.
మని గారు తమ కుటుంబంలో పుట్టిన 8 మంది సంతానం లో ఏడవ సంతానం. మణి గారికి చిన్న తనం నుంచే పుస్తకలాంటే చాలా ఇష్టం.
కేవలం 8 సంవత్సరాల వయస్సులో పబ్లిక్ లైబ్రరీ లో ఉన్న దాదాపు అన్ని మలయాళం పుస్తకాలను చదివారు.12 సంవత్సరాల వయస్సులో లైబ్రరీ లో ఇంగ్లీష్ లో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలను చదివారు.
చిన్న తనంలో మని గారి తల్లి తండ్రులు పుట్టిన రోజు కనుకగ డైమండ్ రింగ్ ఇవ్వగా, కానుకను బదులుగా పుస్తకాన్ని కోరారు. ఎక్కువగా చదవటం వీరి జీవితంలో ఎదుగుదలకు సహాయపడింది. పుస్తకాలు చదవటం వల్ల అన్న మణి గారి జీవితంలో చాలా మంచి మార్పులు కలిగాయి.
మని గారికి నాట్యం పై ఆసక్తి ఉన్నా వారికి నచ్చిన ఫిజిక్స్ సబ్జెక్టు ను కెరీర్ గా ఎంచుకున్నారు.1945 వ సంవత్సరంలో లండన్ కి ఫిజిక్స్ లో పై చదువుల కోసం వెళ్లిన మని గారు అనుకోకుండా వాతావరణ శాస్త్రం లో నైపుణ్యత పొందారు.
సర్ C.V రామన్ గారి నేతృత్వంలో ఫిజిక్స్ పై పట్టు సాధించి, కొన్ని రీసెర్చ్ పేపర్లను కూడా రాయటం జరిగింది.
1948 సంవత్సరంలో ఇండియా కు తిరిగి వచ్చిన తరవాత పూణే లోని వాతావరణ శాఖ లో చేరారు. పూణే లో పనిచేస్తున్న సమయంలో కూడా పలు రీసెర్చ్ పేపర్లను రాసారు.1954 వ సంవత్సరంలో 121 మంది బృందానికి నేతృత్వం వహించారు.
అన్న మని గారు గాంధీజీ గారి ఉధ్యమాలతో ప్రభావితురాలయ్యి కేవలం ఖాదీ బట్టలనే ధరించేవారు. మణి గారు భారతదేశాన్ని వాతావరణ పరికరాలలో స్వతంత్ర దేశం గా కోరుకునే వారు.
అన్న మని గారు దాదాపు 100 వాతావరణ సాధనాలను తీర్చి దిద్ది ప్రమాణీకరించారు. ఇవే కాకుండా సోలార్ ఎనర్జీ ను, సోలార్ రేడియేషన్ మరియు ఓజోన్ ను పరీక్షించడానికి సాధనాలను కూడా తయారు చేసారు.
అమెరికన్ మెటియోలాజికల్ సొసైటీ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, వరల్డ్ మెటియోలాజికల్ ఆర్గనైజేషన్ (WMO), ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ సొసైటీ, మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెటియరాలజీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ లాంటి శాస్త్రీయ సంస్థలతో కలిసి పని చేసారు.
1969 సంవత్సరంలో భారత దేశ వాతావరణ శాఖ లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేసారు. ఇదే పదవి లో ఉండగానే 1976 సంవత్సరంలో రిటైర్ అయ్యారు.
తాను చేస్తున్న రీసెర్చ్ లో ఆటంకం ఉండవద్దని పెళ్లి కూడా చేసుకోలేదు.1994 సంవత్సరంలో 82 సంవత్సరాలు ఒక వారంలో పూర్తి అవుతాయి అన్నప్పుడు గుండె పోటు వల్ల తమ తుదిశ్వాస విడిచారు.
Source: Anna Mani – Wikipedia