Yogi Adityanath biography in Telugu – యోగి ఆదిత్యనాథ్ జీవిత చరిత్ర

యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన సాధువు మరియు రాజకీయ నాయకుడు. 2017 సంవత్సరం లో ఉత్తరప్రదేశ్ యొక్క 22 వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రి అవ్వక ముందు గోరకపూర్ నుంచి 5 సార్లు  MP గా ఎన్నుకోబడ్డారు.  

ఆదిత్యనాథ్ తన కుటుంబాన్ని త్యజించి గోరకపూర్ లోని గోరఖ్ నాథ్ మఠ్ లో  మహంత్ అవైద్యనాథ్ అనే గురువు వద్ద ఉండటం ప్రారంభించారు. మహంత్ అవైద్యనాథ్ ను తన ఆధ్యాత్మిక తండ్రిగా ఆదిత్యనాథ్ తెలిపారు. 

యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని అనే సంస్థను కూడా కనుగొన్నారు. ఈ సంస్థ ఎప్పుడూ  ఎదో ఒక వివాదంలో చిక్కుకొని ఉంటుంది. 

యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా యోగి కుటుంబం మాత్రం చాలా సాధారణ జీవితం గడుపుతారు.   

బాల్యం :

యోగి ఆదిత్యనాథ్ 5 జూన్ 1972 లో ఉత్తరప్రదేశ్ లోని పంచుర్ అనే గ్రామంలో ఆనంద్ సింగ్ బిష్త్ మరియు సావిత్రి దేవి అనే ఇద్దరు దంపతులకు పుట్టారు. ఈ దంపతులకి నలుగురు కొడుకులు మరియు ముగ్గురు కూతుళ్లు. యోగి ఆదిత్య నాథ్ రెండవ కుమారుడిగా పుట్టారు, యోగి పుట్టినపుడు అజయ్ మోహన్ బిష్త్ అని పేరు పెట్టారు కానీ తరవాత తన పేరును యోగి ఆదిత్యనాథ్ గా మార్చుకున్నారు.  

రాజకీయ జీవితం:  

మాథెమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నయోగి తరవాత 1990 లో ఇంటిని వదిలి రామ మందిర ఉద్యమంలో పాల్గొనడానికి బయలు దేరారు. అక్కడ గోరకనాథ్ మఠ్ లో ముఖ్య పూజారి మహంత్ అవైద్యనాథ్ వల్ల ప్రభావితం అయిన అజయ్ మోహన్ బిష్త్ తన పేరు ను యోగి ఆదిత్యనాథ్ గా మార్చుకున్నారు.

మహంత్ అవైద్యనాథ్ హిందూ మహాసభ అనే పొలిటికల్ పార్టీ సభ్యుడు కావటం మరియు గోరకపూర్ MLA కావటం వల్ల యోగి కి రాజకీయాలలోకి రావటానికి అవకాశం లభించింది.క్రమ క్రమంగా చిన్న చిన్న పార్టీలు బీజేపీ లో కలవటం వల్ల BJP ఇంకా బలవంతంగా మారింది. యోగి కూడా 1991 లో BJP పార్టీ లో చేరారు. 

1994 వ సంవత్సరంలో యోగి ని మహంత్ అవైద్యనాథ్ యొక్క ఉత్తరాధికారి గా నియమించటం జరిగింది. 1998 సంవత్సరంలో MLA గా గెలిచి రాజకీయాలలో ప్రవేశించారు. 

2002 వ సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని అనే యూత్ వింగ్ ను ప్రారంభించారు.హిందూ వాహిని సంస్థ వల్ల యోగి ఎక్కువగా చర్చలలో ఉంటారు. ఈ సంస్థ పై పలు రకాల అల్లర్లు మరియు హత్యలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.    

26 సంవత్సరాల వయస్సులో గోరకపూర్ నుంచి MP గా ఎన్నుకోబడ్డ యోగి 1998 నుంచి 2014 వరకు 5 సార్లు ఎన్నుకోబడ్డారు. అవైద్యనాథ్ చనిపోయిన తరవాత 2014 వ సంవత్సరంలో యోగి ఆదిత్యనాథ్ గోరకనాథ్ మఠ్ యొక్క ముఖ్య పూజారి గా ఎన్నుకోబడ్డారు.    

యోగి ఆదిత్యనాథ్ కు మరియు బీజేపీ పార్టీ కి పలు మార్లు వివాదాలు వచ్చాయి. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ సరిగా పాటించటం లేదని బీజేపీ పార్టీ ని నిలదీసారు. ఉత్తరప్రదేశ్ లోని గోరకపూర్ లో హిందూ యువ వాహిని సంస్థ స్థాపించిన తరవాత యోగి ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఇతర మతాల వారిని లక్ష్యంగా చేసిన ప్రసంగాలు పలు మార్లు అల్లర్లు కూడా రేకెత్తించాయి.      

యోగి గోరకపూర్ లో ఎంత ప్రాముఖ్యత పొందారంటే బీజేపీ పార్టీ సహాయం లేకుండా తాను తేలికగా గెలిచే స్థాయికి ఎదిగారు. 

2017 లో జరిగిన ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్య మంత్రిగా ఎన్నుకోబడ్డారు.  

ముఖ్య మంత్రి అయిన తరవాత UP లో చేసిన మార్పులు : 

ముఖ్యమంత్రి అయిన తరవాత మొట్ట మొదటి మార్పు, అక్రమంగా నడుపుతున్న కబేళాలను మూయించివేసారు. ఆవుల అక్రమ రవాణా పై కూడా నిషేధం విధించారు.  

అమ్మాయిలను వేదించే మరియు వెంబడించే వాళ్లను అదుపుచేయడానికి అంటి-రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేసారు.  

ప్రుభుత్వ కార్యాలయాలలో గుట్కా మరియు పాన్ లాంటి ఉమ్ముడు పదార్థాలు నిషేదించారు. మరియు స్వచ్ భారత్ మిషన్ కోసం ప్రతి సంవత్సరం 100 గంటలు పనిచేయాలని ఆదేశించారు. 

అనేక IAS మరియు IPS అధికారులను బదిలీ చేయటం జరిగింది. 

87 లక్షల రైతుల రుణ మాఫీలు కూడా చేయటం జరిగింది. యోగి ప్రభుత్వం దాదాపు  30 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసి రైతులకు ఊరట కలిగించింది.    

Leave a Comment