Sunil Dutt biography in Telugu – సునీల్ దత్ జీవిత చరిత్ర

సునీల్ దత్ ను చాలా మంది నర్గిస్ దత్ యొక్క భర్త గా మరియు సంజయ్ దత్ తండ్రి గా చాలా మంది కి తెలుసు. సునీల్ తన జీవిత కాలంలో నటుడిగా, దర్శకుడిగా మరియు నిర్మాత గా పనిచేసారు. సునీల్ దత్ తన సినిమా జీవితం ముగించాక రాజకీయంలోకి ప్రవేశించారు. 

సునీల్ దత్ కాంగ్రెస్ హయాంలో  Ministry of Youth Affairs and Sports గా ఉన్నారు.ఈ పదవిలో ఉన్నప్పుడే గుండెపోటు వళ్ళ మరణించారు.

సంజయ్ దత్ బయోగ్రఫీ ను ఆధారం చేసుకొని తీసిన  సంజు సినిమా తరవాత తాను తన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఎంతగా ఆరాట పడ్డారో తెలిసింది.  

బాల్యం:  

సునీల్ దత్ జూన్ 6 1929  సంవత్సరంలో పాకిస్తాన్ లోని పంజాబ్ లో జన్మించారు. ఆ రోజుల్లో ఇండియా పాకిస్తాన్ విభజన కారణంగా చాలా మంది ఇండియా నుంచి పేకిటిస్తాం కు మరియు పాకిస్తాన్  నుంచి ఇండియా కు వెళ్లడం జరిగింది. విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉండటం చాలా ప్రమాదకరం అని గ్రహించిన సునీల్ దత్ కుటుంబం ఇండియా రావాలని అనుకున్నారు.  సునీల్ దత్ నాన్న యొక్క ఒక ముస్లిం స్నేహితుడైన యాకుబ్ వీరిని కాపాడి ప్రస్తుత పంజాబ్ రాష్ట్రం లోకి చేరవేసారు. తాను చదువు పూర్తి చేసుకున్న తరవాత ముంబై కి వచ్చి తన కెరీర్ ను ప్రారంభించారు.  

నటనా జీవితం:

ముంబై లోకి చేరినా సునీల్ దత్ తన కెరీర్ ను ఆసియ లోని పురాతన రేడియో స్టేషన్ లో రేడియో జాకీ గా పనిచేయటం మొదలుపెట్టారు. పాకిస్తాన్ లో పుట్టడం వళ్ళ సునీల్ దత్ గారికి ఉర్దూ భాష మీద బాగా పట్టు ఉంది అందుకే రేడియో జాకీ గా ఉద్యోగం దొరికింది. 

1955 సంవత్సరంలో తన నటనా జీవితాన్ని రైల్వే ప్లాట్ఫారం (Railway Platform) అనే సినిమా తో ప్రారంభించారు.

1957 వ సంవత్సరంలో నటీ నర్గిస్ తో నటించిన మదర్ ఇండియా (Mother India) అనే సినిమా తరవాత చాలా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద సక్సెస్ అయ్యింది. మదర్ ఇండియా సెట్ లోనే నర్గిస్ ను ఒక అగ్ని ప్రమాదం నుంచి సునీల్ దత్ కాపాడారు. ఈ సినిమా చేసే సమయంలో సునీల్ దత్ మరియు నర్గిస్ ప్రేమలో పడ్డారు.

నటి నర్గిస్ సునీల్ దత్ తో ప్రేమలో పడక ముందు రాజ్ కపూర్ తో 9 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. రాజ్ కపూర్ తన భార్యను వదిలి నర్గిస్ ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక నర్గిస్ తో తమ సంబంధాన్ని వదిలేసుకున్నారు.  

సునీల్ దత్ సాధన (1958), సుజాత (1959), ముఝే జీనే దో (1963), ఖాన్ దాన్ (1965)  పడోసన్ (1967) గుమ్రాహ్ (1963), వక్త్ (1965) హమ్రాజ్ (1967), హీరా(1973), ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే (1974), నాగిన్ (1976), జానీ దుష్మన్ (1979), ముఖాబల (1979), షాన్ (1980)  దర్ద్ కా రిష్టా (1982), బడ్లే కి ఆగ్ (1982), రాజ్ తిలక్ (1984), మంగళ్ దాదా (1986), వతన్ కె రఖ్వాలె (1987) మరియు ధరమ్ యుద్ (1988) అనే విజయవంతమైన సినిమాలను చేసారు.  

సునీల్ దత్ కుటుంబం:    

సునీల్ దత్ మదర్ ఇండియా సినిమా చేస్తున్న సమయంలో నటి నర్గిస్ తో ప్రేమలో పది పేలి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు సంజయ్ దత్ మరియు ప్రియా దత్, నమ్రత దత్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.    

1981 వ సంవత్సరంలో రాకీ (Rocky) అనే సినిమా ద్వారా తన కుమారుడు సంజయ్ దత్ ను లాంచ్ చేసారు. సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ రోజుల ముందు నర్గిస్ కాన్సర్ కారణంగా చనిపోయింది.  

మూవీ రిలీజ్ అయినప్పుడు సంజయ్ దత్ తన అమ్మ అయిన నర్గిస్ దత్ కోసం ఒక సీటు ఖాళీగా ఉంచారు. సునీల్ దత్ నర్గిస్ దత్ చనిపోయిన తరవాత జ్ఞాపకార్థం Nargis Dutt ఫౌండేషన్ ను కాన్సర్ పేషెంట్ ల కోసం ప్రారంభించారు. 

2003 లో తన కుమారుడి తో హిట్ సినిమా Munna Bhai M.B.B.S లో ఒకే స్క్రీన్ లో నటించారు.

మరణం : 

సునీల్ దత్ Youth Affairs and Sports కు మంత్రి గా ఉన్నప్పుడు 2005 మే 25 న గుండె పోటు వళ్ళ మరణించారు. రన్బీర్ కపూర్ నటించిన సంజు సినిమా లో సునీల్ దత్ రోల్ ను పరేష్ రావల్ నటించారు.  

Leave a Comment