Tik Tok Success story in Telugu – టిక్ టాక్ సక్సెస్ స్టోరీ

ఈ రోజుల్లో దాదాపు చాలా వరకు అందరి ఫోన్ లలో టిక్ టాక్ ఆప్ ఇన్స్టాల్ చేయబడి ఉంది.కొంత మంది దీనిని టైంపాస్ చేయడానికి ఉపయోగిస్తారు మరికొంత మంది తమ వీడియోలను టిక్ టాక్ లో అప్లోడ్ చేసి ఫేమస్ అవ్వడానికి పోటీ పడుతుంటారు. 

డబ్ స్మాష్ ఆప్ :

2014 వ సంవత్సరంలో డబ్ స్మాష్ అనే ఆప్ ని ఉపయోగించి లిప్ సింక్ చేస్తూ పాటలు పాడటం, డైలాగు లు చెప్పటం, డాన్స్ లు చేయటం వంటివి చేసేవారు. అప్పుడు ఎదో కామెడీ కోసం చేసిన ఆప్ మరీ ఇంత ఫేమస్ అవుతుందని ఎవరు అనుకోలేదు. 

ఈ ఆప్ విడుదల అయిన కొద్ది రోజులలోనే 29 దేశాలలో No.1 ఆప్ గా పేరు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2019 వ సంవత్సరంలో డబ్ స్మాష్ డేటా దొంగతనం కావటం డార్క్ మార్కెట్ లో యూజర్ల  డేటా అమ్మకానికి పెట్టడం జరిగింది ఫలితంగా డబ్ స్మాష్ కి చాలా నష్టం జరిగింది.   

Musical.ly :    

డబ్ స్మాష్ తరవాత musical.ly అనే ఆప్ కూడా అంతే వేగంతో ఫేమస్ అవ్వటం మొదలైంది. 2014 వ సంవత్సరంలో ఈ ఆప్ మార్కెట్ లో కి వచ్చింది, ఈ ఆప్ లో 15  సెకండ్ల టైం లో లిప్ సింక్ చేస్తూ పాటలు పాడటం, డైలాగు లు చెప్పటం, డాన్స్ లు చేసే అవకాశం కలిపించింది.  

2017 వ సంవత్సరం నాటికి  200ల మిలియన్ల యూజర్లు ఈ ఆప్ ని వినియోగించేవారు. November 9, 2017 వ సంవత్సరంలో ByteDance Ltd అనే సంస్థ Musical.ly ను కొనుగోలు చేసింది. ఒక సంవత్సరము తరవాత  Musical.లీ ను Tik tok లోనే విలీనం చేసేసారు. 

రెండు ఆప్ లను విలీనం చేయటం వళ్ళ రెండు ప్లేట్ ఫారం ల యూజర్లు ఒకే దగ్గర రావటం వళ్ళ చాలా త్వరగా టిక్ టాక్ ఒక ఫేమస్ ఆప్ గా మారిపోయింది. 

Douyin  : 

2016 వ సంవత్సరంలో ByteDance అనే సంస్థ చైనా లో Douyin అనే ఆప్ ను తయారు చేసారు. ఈ ఆప్ లో కూడా లిప్ సింక్ చేస్తూ పాటలు పాడటం, డైలాగు లు చెప్పటం, డాన్స్ లు చేయటం వంటివి చేసేవారు. ఈ ఆప్ ను కేవలం చైనా లో మాత్రమే వినియోగించే వారు.

Douyin  మరియు tik  tok ఆప్ లు ఒకటి కావు వీటి రెండింటిని కలపాలన్న ByteDance ప్రయత్నం విఫలించింది  

Tik tok :

2017 వ సంవత్సరంలో ByteDance అనే సంస్థ టిక్ టాక్ అనే కొత్త ఆప్ ను ప్రారంభించారు. ఈ ఆప్ ను అంతర్జాతీయ మార్కెట్ ను ఆధారంగా చేసుకొని ప్రారంభించారు.ఈ ఆప్ ప్రారంభించిన కొంత కాలానికే musicl.ly అనే ఆప్ ఆప్ ను విలీనం చేసుకుంది.

75 కు పైగా బాషలలో అందుబాటులో ఉన్న ఈ ఆప్  కొంత కాలం లోనే పేస్ బుక్, యు ట్యూబ్, ఇంస్టాగ్రామ్ ఆప్ ల కంటే ఎక్కువగా డౌన్ లోడ్ చేయబడ్డ IOS ఆప్ గా పరిగణించ బడింది.  

టిక్ టాక్ లోని ఫీచర్లు ఏమిటి ? 

టిక్ టాక్ లో డ్యూయెట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ను వినియోగించి టిక్ టాక్ యూజర్లు చేసిన వీడియోస్ కి రియాక్షన్ ఇవ్వొచ్చు.  

లిప్ సింక్ చేసేటప్పుడు టిక్ టాక్ లో ఉన్న వివిధ రకాల ఫిల్టర్లను కూడా వినియోగించవచ్చు. మరియు యూజర్ అప్లోడ్ చేసే వీడియోస్ ను పబ్లిక్ గా కాకుండా ప్రైవేట్ గా కూడా ఉంచొచ్చు.  

టిక్ టాక్ లోని “for you” సెక్షన్ లో  వినియోగదారుల ఆసక్తి ని బట్టి వారికి వీడియోస్ వారికీ చూపించబడుతాయి.  ఈ ఆప్ లో ఫర్ యు పేజీ చూడాలంటే వినియోగదారుడి వయస్సు 16 సంవత్సరాలు లేదా ఆ పై ఉండాలి.

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించి వినియోగదారుల ఆసక్తి ని బట్టి వీడియోస్ ను టిక్ టాక్ ఆప్ రికమెండ్ చేస్తుంది.  

టిక్ టాక్ పై పలు దేశాల బ్యాన్ : 

టిక్ టాక్ ను కొన్ని దేశాలు బ్యాన్ చేసాయి.ఈ ఆప్ పోర్న్ వీడియోస్ ను మరియు స్వలింగ సంపర్గులను, మతాలను రెచ్చగొడుతోందని బ్యాన్ విధించారు.

మన దేశం లోని మద్రాస్ హైకోర్టు కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనీ ఇది పోర్నోగ్రఫీ చూడడానికి కారణంగా మారుతుందని, పిల్లలు ఇందులోని వీడియోలు చూసి క్రూరంగా మారుతున్నారని ఆదేశాలు జారీ చేసింది.    

2020 లో తెలిపిన లెక్కల ప్రకారం టిక్ టాక్ వీడియోస్ తీస్తూ ఇప్పటివరకు 41 మంది చనిపోయారు, వీరిలో 35 మంది ఇండియా నుంచి కావటం గమనార్హం.  

Leave a Comment