టెస్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఆవిష్కరణలకు సహాయపడ్డారు. ఈ రోజు మనము ఎలక్ట్రిసిటీ ని వినియోగిస్తున్నాము అంటే అది నికోలా టెస్లా చేసిన కృషి వల్లనే అని చెప్పుకోవచ్చు.
Table of Contents
బాల్యం మరియు చదువు :
నికోలా టెస్లా క్రోషియా అనే దేశంలోని స్మిల్జన్ అనే గ్రామంలో జూన్ 28, 1856 వ సంవత్సరంలో జన్మించారు. టెస్లా తండ్రి చర్చి లో ఫాదర్ గా పనిచేసేవారు. టెస్లా తల్లి యొక్క తండ్రి కూడా చర్చి లో ఫాదర్ గా పనిచేసేవారు. టెస్లా తనవద్ద ఉన్న తెలివి తేటలు తన తల్లి నుండి వచ్చాయని చెప్పేవారు.
టెస్లా కాలేజీ లో చదువుతున్నప్పుడు తన ప్రొఫెసర్ ఎలక్ట్రిసిటీ గురించి ఇచ్చిన వివరణ తరవాత తన ఆసక్తి ఇంకా పెరిగింది, అంతే కాకుండా ఎలక్ట్రిసిటీ గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించేది.
1873 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత తన స్వస్థలానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో కలరా అనే మహమ్మారి రోగం ప్రపంచమంతా వణుకు పుట్టించింది, అదే సమయంలో టెస్లా ఇంటికి చేరుకోగానే కలరా బారిన పడ్డారు. టెస్లా పరిస్థితి చూసి తండ్రి చాలా బాధ పడ్డారు, టెస్లా ఇక బతకరని అనే విధంగా టెస్లా ఆరోగ్యం క్షీణించింది.
టెస్లా తండ్రి టెస్లా ను చర్చి లో ఫాదర్ లాగా చూడాలని అనుకున్నారు కానీ టెస్లా పరిస్థితి చుసిన తర్వాత, టెస్లా ఆరోగ్యం మెరుగుపడితే తనను ఒక మంచి కాలేజీ లో చెరిపిస్తానని అన్నారు.
1875 లో పై చదువుల కోసం టెస్లా ఆస్ట్రియన్ పాలిటెక్నిక్ కాలేజీ లో చేరారు, అక్కడ మొదటి సంవత్సరంలో బాగానే చదివారు కానీ తర్వాత గ్యాంబ్లింగ్ కి అలవాటు పడ్డారు. చివరకి ఆ కాలేజీ లో డిగ్రీ సంపాదించకుండానే కాలేజీ వదిలేసారు.
1878 లో డ్రాఫ్ట్స్ మాన్ లాగా పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు, తాను చేసే ఉద్యోగం మానేసి స్వస్థలానికి రమ్మని టెస్లా తండ్రి వేడుకున్నాడు దీనికి టెస్లా నిరాకరించాడు. టెస్లా నివసిస్తున్న దేశం యొక్క రెసిడెన్షియల్ పర్మిట్ లేనందువల్ల చివరికి తన స్వస్థలానికి చేరుకున్నారు. 1879 లోనే టెస్లా తండ్రి గుర్తుపట్టలేని వ్యాధి బారిన పడి చనిపోయారు.
1880 లో టెస్లా యొక్క మావయ్య లు పై చదువుల కోసం సహాయం చేసి ప్రేగ్ (Prague) పట్టణానికి పంపించారు.
బుడాపెస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజి :
1881 లో హన్గేరి దేశం లోని బుడాపెస్ట్ పట్టణం లో ఒక టెలిగ్రాఫ్ స్టార్ట్ అప్ కంపెనీ లో చేరారు. ఈ కంపెనీ లో పనిచేసేటప్పుడు టెస్లాటెలిఫోన్ రిపీటర్ మరియు ఆమ్ప్లిఫైర్ లో మెరుగుదలలు చేశారు. ఈ కంపెనీ లో టెస్లా చేసిన మెరుగుదలలకు పేటెంట్ కూడా తీసుకోలేదు.
థామస్ ఎడిసన్ వద్ద టెస్లా :
థామస్ అల్వా ఎడిసన్ గురించి మనకు తెలిసిందే, లైట్ బల్బ్ ని కనిపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి ప్రపంచాన్నితన లైట్ బల్బ్ ఆవిష్కరణ తో వెలుగు తో నింపాడు.
ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో టెస్లా ఎడిసన్ కంపెనీ లో చేరారు. లైట్ బల్బ్ ల యొక్క ఇంస్టా లేషన్ సంబంధిన పనులు టెస్లా చూసుకునే వారు. ఎడిసన్ కంపెనీ ఇతర ఎలక్ట్రికల్ విభాగాలలో కూడా టెస్లా తనకున్న జ్ఞానం తో పనిచేసేవారు, ఏదైనా సమస్య వచ్చిన త్వరగా పరిష్కరించేవారు.
తాను చురుకుగా సమస్యలను పరిష్కరించడం చూసి జెనెరేటర్లు, మోటార్ లను ఇంకా మెరుగుపరచమని టెస్లా కు ఇచ్చారు, ఇతర దేశాలైన ఫ్రాన్స్ మరియు జర్మనీ లో కూడా ఏదైనా సమస్య వస్తే టెస్లా నే పంపించేవారు.
1884 లో టెస్లా ఎడిసన్ వద్ద పనిచేసేటప్పుడు అమెరికాలోనే స్థిర పడాలని నిర్ణయించుకున్నారు. ఎడిసన్ పనిచేస్తున్న చాలా ప్రాజెక్టులలో టెస్లా సహాయ పడ్డారు.
కొద్దీ రోజులు ఎడిసన్ వద్ద పనిచేసిన తరవాత టెస్లా ఇక మానేసారు.దానికి కారణం ఎడిసన్ టెస్లా ను వివిధ రకాల మెషిన్ లు తయారు చేస్తే 50000$ ఇస్తానని చెప్పడం జరిగింది. టెస్లా తన పని పూర్తి చేసిన తరవాత డబ్బులు అడిగితె అది ఒక జోక్ అని తీసి పడేసారు.
ఎడిసన్ వద్ద మానివేసిన తరవాత ఆర్క్ లైట్ లాంప్ మరియు మెరుగు పరిచిన DC జనరేటర్ ఆవిష్కరణల కోసం టెస్లా కృషి చేయడం మొదలుపెట్టారు, ప్రత్యేకంగా Tesla Electric Light & Manufacturing అనే కంపెనీ కూడా పెట్టారు.టెస్లా దురదృష్టం ఏమో కానీ తానూ మొదలు పెట్టిన ఈ ఆవిష్కరణ కు పేటెంట్ ఐతే లభించింది కానీ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఆసక్తి చూపక పోవటం వళ్ళ కంపెనీ మూత పడింది.
AC మరియు ఇండక్షన్ మోటార్ :
మనము ఈ రోజుల్లో ఉపయోగించే కరెంటు AC కరెంటు, AC కరెంటు అంటే ఆల్టర్ నటింగ్ కరెంటు, ఈ కరెంటు DC కరెంటు అనగా డైరెక్ట్ కరెంటు కంటే చాలా మేలు.
టెస్లా ఎడిసన్ వద్ద నుంచి వెళ్ళిపోయినా తర్వాత తన సొంతంగా 1887 లో ఇండక్షన్ మోటార్ ను తయారు చేసారు. ఈ మోటార్ AC కరెంటు ని ఉపయోగించి తయారు చేయబడింది. AC కరెంటు ఉపయోగించటం వళ్ళ ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే దూరపు ప్రదేశాలకు చాల సులువుగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక వేల డైరెక్ట్ కరెంటు ను ఉపయోగిస్తే కొంత దూరానికి మాత్రమే పరిమితం అవుతుంది.
టెస్లా ఇద్దరు పెట్టుబడిదారుల సహాయంతో తన ఈ ఆలోచనను అమలు లోకి తీసుకొచ్చారు, అదే సమయంలో వెస్టింగ్ హౌస్ అనే కంపెనీ ఒక మంచి ఎలక్ట్రికల్ ఫీల్డ్ కు సంబంధించిన వ్యక్తి లేదా ఆవిష్కరణ కోసం వేచి ఉన్నారు. టెస్లా తయారు చేసిన AC కరెంటు గురించి తెలుసుకున్న తర్వాత ఈ మోటార్ ను తమ కంపెనీ సొంతం చేసుకోవాలని అనుకుంది. టెస్లా 60,000$ తీసుకోని AC మోటార్ లైసెన్స్ ఇచ్చారు. వెస్టింగ్ హౌస్ కంపెనీ కోరిక మేరకు ప్రతి నెల 2000$ ల వేతనంతో సలహాదారుడిగా చేరారు.
ఆ రోజుల్లో ఎడిసన్ DC కరెంటు మంచిదని AC కరెంటు వళ్ళ చాల నష్టాలు ఉన్నాయని దుష్ప్రచారం చేయటం మొదలు పెట్టాడు. కానీ చాలా వాదోపవాదాల తరవాత AC కరెంటు మంచిదని, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని గ్రహించిన తరవాత ప్రపంచం మొత్తం AC కరెంటును వినియోగించటం మొదలుపెట్టింది.
టెస్లా ఇతర ఆవిష్కరణలు :
1891 లో టెస్లా అమెరికా పౌరుడుగా మారారు. టెస్లా తన జీవిత కాలంలో చాలా ఆవిష్కరణలు చేసారు. వీటిలో టెస్లా కోయిల్ (Tesla Coil) , వైర్లెస్ పవర్(Wireless power), టెస్లా ఆసిలేటర్ (Tesla’s oscillator), X-ray, రేడియో రిమోట్ కంట్రోల్(Radio remote control), Wardenclyffe Tower, లాంటి ఆవిష్కరణలు చేసారు.
టెస్లా చివరి రోజులు :
టెస్లా ఇన్ని ఆవిష్కరణలు చేసిన తన చివరి రోజులలో తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఏమి లేదు, చాలావరకు తన ఆలోచనలను తన ఆవిష్కరణలను ఇతరులు ఉపయోగించుకున్నారు. టెస్లా తన పేటెంట్ల పై పెద్దగా ఆసక్తి చూపక పోవటం, పేటెంట్ చేసుకున్న కొన్ని కారణాల వళ్ళ వాటి నుంచి లబ్ది పొందలేక పోయారు.
మరణం:
టెస్లా తన చివరి రోజులలో ఎక్కువగా హోటల్స్ లోనే గడిపేవారు. తాను ఉండే హోటల్స్ వద్ద పావురాలతో కాలక్షేపం చేసేవారు, ఎక్కువగా వాటికి గింజలు వేయటం వంటివి చేసేవారు. ఆ పావురాలలో ఒక ఆడ తెల్ల పావురం టెస్లా కి ఎంతగానో నచ్చేది.
తన వద్ద ఉన్న తెలివి తేటలతో ప్రపంచం మొత్తానికి సహాయపడిన టెస్లా తన చివరి రోజులలో డబ్బులు కూడా ఉండేవి కావు.
టెస్లా 1943 లో 86 సంవత్సరాల వయసులో హోటల్ న్యూయార్కర్ లోని 3327 రూమ్ నెంబర్ లో తనువు చాలించారు.