ముమైత్ ఖాన్ భారతదేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ మరియు ఒడియా భాష కు చెందిన సినిమాలలో పలు ఐటెం సాంగ్స్ చేసారు.
Table of Contents
బాల్యం:
ముమైత్ ఖాన్ 1వ సెప్టెంబర్ 1985 వ సంవత్సరంలో జన్మించారు. ఖాన్ ముంబై లోనే పుట్టి పెరిగింది. ముమైత్ ఖాన్ యొక్క తండ్రి పాకిస్తాన్ కి చెందిన వారు మరియు తల్లి తమిళనాడు లోని తిరుచిరాపల్లి కి చెందిన వారు.
కెరీర్:
ముమైత్ ఖాన్ 40 తెలుగు సినిమాలు, 20 హిందీ సినిమాలు, 16 తమిళం మరియు 5 కన్నడ సినిమాలలో పనిచేసారు.
సంజయ్ దత్త హీరో గా నటించిన మున్నా భాయ్ ఎంబీబీస్ లో ముమైత్ ఖాన్ చేసినా కేమియో ద్వారా మంచి పేరును సంపాదించారు.
సినిమాలు కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1, ఝలక్ దిఖ్లా జా 6, డాన్సీ ప్లస్ లాంటి టీవీ షోస్ చేసారు.
వివాదం:
ముమైత్ ఖాన్ 2018 వ సంవత్సరంలో బిగ్ బాస్ తెలుగు లో ఉన్నప్పుడు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల కారణంగా కెరీర్ పై ప్రభావం కలిగింది.
ఈ కేసు లో ప్రధాన నిందుతుడు అయిన కాల్విన్ మస్సెరెహాస్ తో ముమైత్ ఖాన్ రిలేషన్ షిప్ లో ఉండే వారు.
ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు కూడా విచారించబడ్డారు. డ్రగ్స్ యొక్క ఆరోపణల కారణంగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నుంచి తొలగించబడ్డారు.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ముమైత్ ఖాన్ మరియు 20 ఇతర సౌత్ ఇండస్ట్రీ కి చెందిన 20 మందిని విచారించటం జరిగింది. విచారణ తరవాత ముమైత్ ఖాన్ తిరిగి రియాలిటీ షో లోకి వచ్చింది.
ఆరోగ్యం:
2016 డిసెంబర్ లో ముమైత్ ఖాన్ బెడ్ పై నుంచి కింద పడి తలకు దెబ్బ తగలటంతో మెదడులోని నరాలు దెబ్బతిన్నాయి. 15 రోజుల పాటు కోమాలో ఉన్న తరవాత కోలుకున్నారు. చికిత్స తరవాత పూర్తిగా కోలుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుందని డాక్టర్ లు తెలిపారు.
ఫలితంగా ముమైత్ ఖాన్ బరువు పెరిగారు మరియు ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీ లోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు.