గూగుల్ అనగానే ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అన్ని సమాచారాలను, విషయాలను తమ సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రపంచానికి తెలియ జేస్తుంది.
Table of Contents
గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి ?
ఇంటర్నెట్ లో దాదాపు ప్రతి విషయం గురించి సమాచారం అందుబాటులో ఉంది, ఏదైనా విషయాన్ని తెలుసు కోవాలనుకున్నప్పుడు లేదా వెతకడానికి ఒక సెర్చ్ ఇంజిన్ అవసరం అవుతుంది. గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్, ఈ సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా విషయాన్ని మీరు టైపు చేసినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని వివిధ పేజీల రూపంలో మనకు అందచేస్తుంది. మనకు కావలసిన సమాచారం మాత్రం దాదాపు మొదటి పేజీ లోనే దొరుకుతుంది.
గూగుల్ ఎలా మొదలైంది ?
గూగుల్ ని లారి పేజీ మరియు సెర్జీ బ్రిన్ అనే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చదివే ఇద్దరు విద్యార్థులు తమ PHD ప్రాజెక్ట్ కోసం తయారు చేయటం మొదలు పెట్టారు. వీరు ఈ ప్రాజెక్ట్ పై పనిచేసేటప్పుడు ఒక మూడో వ్యక్తి కూడా వీరితో పనిచేసాడు.
స్కాట్ హస్సాన్ అనే వ్యక్తి లారి పేజీ కి వచ్చిన ఆలోచనలను కోడ్ రూపంలో రాయడం మొదలుపెట్టాడు, స్కాట్ తన సొంత కంపెనీ రోబోటిక్స్ లో ప్రారంభించాలి అనుకోని గూగుల్ ని వదిలేసాడు.
Pagerank :
మొదటి సారిగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను తయారు చేసేటప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా కీవర్డ్ తో సెర్చ్ చేసినపుడు ఆ కీవర్డ్ ఏదైతే పేజీ లో ఎక్కువగా ఉంటుందో మరియు ఆ పేజీ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయో అనే ఆధారాలను బట్టి వెబ్సైటు లను ర్యాంక్ చేసే వారు. ఇలా ర్యాంక్ చేయడాన్ని గూగుల్ ఫౌండర్స్ “pagerank ” అని పేరు పెట్టారు.
బ్యాంకు లింక్ ల ఆధారంగా వెబ్ సైట్ ను తయారు చేసారు కాబట్టి ఆ వెబ్ సైట్ పేరు “బ్యాక్ రబ్ (BackRub)” అని పేరు పెట్టారు. పేజ్ర్యాంకింగ్ అల్గోరిథము చైనా కు చెందిన రాబిన్ లి (Robin Li) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అల్గారిథం ను ఆధారం చేసుకునే నిర్మించారు.
గూగుల్ పేరు ఎలా వచ్చింది ?
గూగుల్ పేరు స్పెల్లింగ్ లో మిస్టేక్ రావటం వళ్ళ ఏర్పడింది, ముందు ” googol ” అని పెడదామనుకున్నారు, Googol అంటే 1 నెంబర్ తరవాత 100 సున్నాలు అని అర్థం. ఈ సెర్చ్ ఇంజిన్ చాలా పెద్దమొత్తం లో సమాచారాన్ని అందిస్తుందని ఈ పేరు పెట్టారు.
1998 వ సంవత్సరంలో గూగుల్ పేరు మీదుగా రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. గూగుల్ ఫౌండర్స్ తమ ఆఫీస్ ని తమతో పాటు చదివే సుసాన్ వజేసీసీకి (Susan Wojcicki) గ్యారేజ్ లో మొదలుపెట్టారు. సుసాన్ గూగుల్ సంస్థ యొక్క మొదటి ఉద్యోగి. ప్రస్తుతం సుసాన్ (susan) యుట్యూబ్ కి సీఈఓ గా నియమించబడ్డారు.
గూగుల్ సంస్థ Acquire చేసిన కంపెనీలు :
గూగుల్ పెరుగుతున్న తన డిమాండ్ తో ఇతర పెద్ద పెద్ద కంపెనీలను స్వాధీనం చేసుకోవటం మొదలుపెట్టింది.
2006 వ సంవత్సరంలో గూగుల్ వీడియో షేరింగ్ ప్లాటుఫారమ్ “యూట్యూబ్” ను $1.65 బిలియన్ డాలర్ల తో అక్వైర్ చేసుకుంది.
2007 వ సంవత్సరంలో “డబల్ క్లిక్” అనే సంస్థ ను $3.1 బిలియన్ డాలర్ల తో అక్వైర్ చేసుకుంది.
2011 వ సంవత్సరంలో “మోటోరోలా మొబిలిటీ” అనే సంస్థ ను $12.5 బిలియన్ డాలర్ల తో అక్వైర్ చేసుకుంది.
2013 వ సంవత్సరంలో “వాజ్” అనే సంస్థ ను $966 మిలియన్ డాలర్ల తో అక్వైర్ చేసుకుంది.
2014 వ సంవత్సరంలో “డీప్ మైండ్ టెక్నాలజీస్” అనే సంస్థను $400 మిలియన్ డాలర్ల తో అక్వైర్ చేసుకుంది.
అలెక్స ర్యాంకింగ్:
గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు ప్రపంచం లోనే మొట్ట మొదటి వెబ్ సైట్ గా గుర్తింపు పొందింది. అలెక్సా లెక్కల ప్రకారం కూడా గూగుల్ ప్రపంచంలో మొదటి స్థానం లో ఉంది. చాలా వరకు డివైస్ లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ డిఫాల్ట్ గా ఉంటుంది.