అరుల్మోజి వర్మన్ ను రాజరాజ I లేదా రాజ రాజ ది గ్రేట్ అని కూడా అంటారు.
985 సంవత్సరం నుంచి 1014 సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆ రోజులలో ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులలో అత్యంత శక్తివంతమైన రాజు. ఈయన చోళ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడంలో మరియు చోళుల యొక్క ఆధిపత్యాన్నిహిందు మహా సముద్రం అంతటా తెలిసేలా చేసాడు.
Table of Contents
బాల్యం :
అరుల్మోజి (రాజ రాజ ) 947 క్రీస్తు శకం లో పరాంతక II రాజు మరియు రాణి వనవన్ మహాదేవి కు జన్మించారు.
రాజ రాజ యొక్క తాతయ్య పరాంతక I చనిపోయిన తరవాత తన కుమారుడు గందారాదిత్య రాజు గా ఎన్నుకోబడ్డాడు. గందారాదిత్య చనిపోయిన తరవాత తన కుమారుడు ఉత్తమ చిన్న వయస్సు కలిగి ఉండటం వల్ల రాజు గా ఎన్నుకోబడలేదు.
బదులుగా పరాంతక I రెండవ కుమారుడు అరింజయ రాజుగా ఎన్నుకోబడ్డాడు. అతి తక్కువ కాలంలోనే అరింజయ రాజు చనిపోవటం జరిగింది.
అరింజయ రాజు చనిపోయిన తరవాత తన కుమారుడు పరాంతక II రాజు గా ఎన్నుకోబడ్డాడు.
పరాంతక II రాజు కు ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు మరియు గందారాదిత్య రాజు కొడుకు ఉత్తమ చనిపోయిన తరవాత రాజ రాజ రాజుగా ఎన్నుకోబడ్డాడు.
985 సంవత్సరంలో రాజ రాజ (రాజులలో రాజు) రాజు గా ఎన్నుకోబడ్డాడు. రాజ రాజ తనను శివపాద శేఖర అని పిలుచుకునేవాడు. శివపాద శేఖర అంటే తన కిరీటాన్నిశివుడి యొక్క పాదాల వద్ద పెట్టే వాడు అని అర్థం.
విజయాలు :
రాజ రాజ ను రాజు గా ఎన్నుకున్న సమయంలో చోళ రాజ్యం చాలా చిన్నదిగా ఉండేది.
ఆ రోజులలో చోళ రాజ్యం తమిళనాడు కి చెందిన తంజావూరు మరియు తిరుచిరాపల్లి ప్రాంతాలలో కేంద్రంగా ఉండేది.
రాష్ట్రకూట సామ్రాజ్యం చేసిన దండయాత్రల నుంచి కోలుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని శక్తివంత సామ్రాజ్యంగా చేయసాగాడు.
తన ఆధిపత్యంలో శక్తివంతమైన సైన్యాన్ని మరియు నౌక దళాన్ని ఏర్పాటు చేసారు.
988 క్రీస్తు శకం లో కండలూర్ సాలై (ప్రస్తుతం కేరళ) తో యుద్ధం చేసి రాజ రాజ విజయం సాధించారు. ఈ యుద్ధంలో చోళ సైన్యం మరియు నౌకా దళం కలిసి విజయానికి కారకులయ్యారు. 11 వ శతాబ్దంలో పాండ్యుల రాజధాని అయిన మధురై ను ఓడించారు.
చోళ సామ్రాజ్యం యొక్క నౌకా దళం చేసిన సహస యాత్ర ఫలితంగా మాల్దీవుల దీవులను కూడా కైవసం చేసుకున్నారు.
993 వ సంవత్సరంలో చోళ సామ్రాజ్యం శ్రీలంకను ఓడించింది. చోళులు 1070 సంవత్సరం వరకు శ్రీలంకాను శాసించారు.
తరవాత చోళులు కళింగ మరియు వేంగి సామ్రాజ్యం పై దండయాత్ర చేసి గెలిచారు.
వ్యక్తిగత జీవితం :
రాజ రాజ అనేకమంది స్త్రీలను వివాహమాడారు. ఈయనకు కనీసం ముగ్గురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజ రాజ శివుడి యొక్క భక్తుడు అయినప్పటికీ విష్ణు భగవంతుడి పలు ఆలయాలను నిర్మించాడు. 2022 వ సంవత్సరంలో రాజ రాజ ను ఆధారం చేసుకొని పొన్నయన్ సెల్వన్: I (Ponnaiyan Selvan: I) సినిమా ను తీయటం జరిగింది.
మరణం :
రాజ రాజ 1014 సంవత్సరంలో మరణించారు. రాజ రాజ మరణించిన తర్వాత రాజేంద్ర చోళ I రాజు గా ఎన్నుకోబడ్డారు.
Source: Rajaraja I – Wikipedia