Apple Success story in Telugu – ఆపిల్ సక్సెస్ స్టోరీ

ఆపిల్ కంపెనీ కి సంబంచిన ఏ ప్రోడక్ట్ అయినా సరే జనాలలో చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎందుకంటే స్టీవ్ జాబ్స్ తన కృషి వళ్ళ ఆపిల్ ని అలా బ్రాండెడ్ ప్రోడక్ట్ గా చేసారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీస్ దాకా అందరు ఈ బ్రాండ్ ని యూజ్ చేయాలనీ అనుకుంటారు.    

ఆపిల్ కంపెనీ iPhone smartphone, iPad tablet computer, iPod portable media players లాంటి ప్రొడక్ట్స్ ను తయారు చేయటంలో ముందంజ లో ఉంటుంది.  Macintosh అనే పర్సనల్ కంప్యూటర్ లను కూడా ఆపిల్ యొక్క ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పవచ్చు.    

ఆపిల్ ను ఒక బ్రాండ్ గా తయారు చేసారు కాబట్టే దీని విలువ ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. ఆపిల్ సంస్థ ను ఏప్రిల్ 1,1976 వ సంవత్సరంలో  Steve Jobs (స్టీవ్ జాబ్స్) మరియు Steve Wozniak (స్టీవ్ వజనియాక్) ఇద్దరు కలిసి కనుగొన్నారు.     

స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వజనియాక్ స్నేహం:

స్టీవ్ జాబ్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్టీవ్ వజనియాక్ తమ పరస్పర స్నేహితుడు బిల్ ఫెర్నాండేజ్ ద్వారా ఇద్దరు స్నేహితులుగా మారారు. అప్పుడు స్టీవ్ జాబ్స్ వయస్సు 16 సంవత్సరాలు మరియు  స్టీవ్ వజనియాక్ వయస్సు 21 సంవత్సరాలు. 

స్టీవ్ వజనియాక్ “Blue boxes” ను తయారు చేసారు. ఈ బ్లూ బాక్స్ దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఎటువంటి ఖర్చు లేకుండా కాల్ చేసుకునే వసతిని కలిపించేది. స్టీవ్ జాబ్స్ దాదాపు 200 ల బ్లూ బాక్స్ లను, ఒకటి 150 డాలర్ల చొప్పున అమ్మారు.  

స్టీవ్ జాబ్స్ కి బ్లూ బాక్స్ ఐడియా ఒక వేల రాకపోయి ఉంటె ఆపిల్ కంపెనీ ఈ రోజు ఉండేది కాదని చెప్పారు. జాబ్స్ మరియు వజనియాక్ కి ఎలక్ట్రానిక్స్ మరియు భవిష్యత్తు లో టెక్నాలజీ మీద ఉన్న మగ్గువ వళ్ళ ఇద్దరూ తాము చదువుతున్న కాలేజీ లు వదిలేసారు.    

1975 వ సంవత్సరంలో జాబ్స్ మరియు వజనియాక్  Homebrew Computer Club ను హాజరు కావటం మొదలు పెట్టారు.  

ఆ సమయంలో తయారు చేయబడ్డ మైక్రో కంప్యూటర్ Altair 8800, IMSAI లను చూసేవారు. వజనియాక్ కూడా ఒక కంప్యూటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.  కంప్యూటర్ కి కావాల్సిన మైక్రోప్రాసెసర్ చాలా ఖరీదైనది గా ఉండటం వళ్ళ కంప్యూటర్ తాయారు చేయకుండా ఆగారు. 

1976 వ సంవత్సరంలో ప్రాసెసర్ రేట్ తగ్గిన తరవాత కంప్యూటర్ ను తయారు చేయటం జరిగింది. ఈ కంప్యూటర్ నే ఆపిల్ 1 అనే కంప్యూటర్ ను తయారు చేయటం జరిగింది.     

వజనియాక్ తయారు చేసిన కంప్యూటర్ ను చూసిన తరవాత స్టీవ్ జాబ్స్ ఈ ఐడియా తో బిజినెస్ మొదలు పెట్టవచ్చు అని అనుకున్నారు. మొదట వజనియాక్ తయారు కాకపోయినా తరవాత ఇద్దరూ కలిసి బిజినెస్ ప్రారంభించాలని అనుకున్నారు.    

బిసినెస్ మొదలుపెట్టడానికి డబ్బులు కావాలి కాబట్టి స్టీవ్ జాబ్స్ తన వద్ద ఉన్న కారు ను అమ్మగా వజనియాక్ తన వద్ద ఉన్న  HP-65 programmable calculator ను అమ్మి తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసారు.ఇలా ఆపిల్ సంస్థ ఏప్రిల్ 1,1976 వ సంవత్సరంలో కనుగొన బడింది. 

మొదటి ఆపిల్ కంప్యూటర్ :  

Homebrew Computer క్లబ్ లో పరిచయం అయిన Paul Terrell ఆపిల్ 1 కంప్యూటర్ ను చూసిన తరవాత తనకు 50 కంప్యూటర్ లు కావాలని స్టీవ్ జాబ్స్ తో కోరారు. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ వద్ద 50 కంప్యూటర్లకు కావలసిన విడి భాగాలను కొనడానికి డబ్బులు లేవు. ఎలక్ట్రానిక్ పార్ట్ లు అమ్మే దుకాణములో వెళ్లి “తనకు 50 కంప్యూటర్ ల ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు కంప్యూటర్ తయారు చేయడానికి సరిపడ సామాగ్రి ఇస్తే తాను 50 కంప్యూటర్లను తయారు చేసి అమ్మిన తరవాత వచ్చిన డబ్బు తో బిల్ ను చెల్లిస్తానని అని అన్నాడు”. ఆ దుకాణం యజమాని  నేరుగా Paul టెర్రెల్ ను కలిసి 50 కంప్యూటర్ల ఆర్డర్ గురించి అడిగి తెలుసు కున్నాడు.

స్టీవ్ జాబ్ తన ఇచ్చిన మాట ప్రకారం 50  ఆపిల్ 1 కంప్యూటర్ల ను చేసి పాల్ టెర్రెల్ కి అమ్మాడు. ఆపిల్ 1 చాలా బాగా అమ్ముడుపోయింది. తన ఈ సక్సెస్ ను చూసిన స్టీవ్ జాబ్స్ ఇంకా ఆనందపడ్డారు ఇక ఆపిల్ కంపెనీ ను ఇంకా చాలా ముందుకి తీసుకువెళ్లాలని అనుకున్నారు.    

ఆపిల్ ప్రోడక్ట్ లు :    

 ఆపిల్ కంపెనీ కి ఆపిల్ అనే పేరు స్టీవ్ జాబ్స్ పెట్టడం జరిగింది. తానూ తన స్నేహితుడి ఫార్మ్ హౌస్ లో గడిపినప్పుడు తిన్న ఆపిల్ గుర్తుకు వచ్చి తాము పెట్టే కొత్త కంపెనీ కి ఆపిల్ అనే పేరు పెట్టడం జరిగింది.  

ఆపిల్ 1 సక్సెస్ తరవాత ఆపిల్ 2, ఆపిల్ 3 అనే కంప్యూటర్లను తయారు చేయటం జరిగింది. ఆ సమయంలో IBM మాత్రమే ఆపిల్ కంప్యూటర్ కు పోటీ గా ఉండేది.1984 వ సంవత్సరం లోఆపిల్ సంస్థ Macintosh ను విడుదల చేయాలని అనుకుంది. Macintosh, IBM కి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు కానీ ఈ ప్రయత్నం విఫలం అయ్యింది.  

ఫలితంగా జాబ్స్ కి  మరియు అప్పట్లో ఆపిల్ కంపెనీ కి CEO గా పనిచేస్తున్న John Sculley కి చాలా మనస్పర్థలు రావటం జరిగింది.కంపెనీ బోర్డు మొత్తం ఒకవైపు స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వజనియాక్ ఒకవైపు అయ్యారు. 1985 లో స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీ ను వదిలేసారు.

ఆపిల్ నుంచి వెళ్లిపోయిన తరవాత స్టీవ్ జాబ్స్ NEXT అనే కంపెనీ పెట్టడం జరిగింది. NEXT కంపెనీ కొద్దీ రోజుల లోనే ఎదగ సాగింది. 1996 లో ఆపిల్ NEXT కంపెనీ ను  సొంతం చేసుకుంది మరియు స్టీవ్ జాబ్స్ ను కూడా మళ్ళీ ఆపిల్ సంస్థ లో చేరాలని కోరింది.  

ఆపిల్ ఎదుగుదల :

2001 వ సంవత్సరంలో ఆపిల్ Mac OS ను లాంచ్ చేసింది. ఇదే సంవత్సరంలో ఆపిల్ యొక్క రిటైల్ స్టోర్ లను కూడా తెరిచింది. అక్టోబర్ 2001 వ సంవత్సరంలో Apple ipod ను లాంచ్ చేసింది.   

2003  వ సంవత్సరంలో iTunes Music Store ను లాంచ్ చేయగా 16 రోజులలో 2  మిలియన్ల డౌన్ లోడ్ లు చేయబడ్డాయి.  

2006 వ సంవత్సరంలో ఆపిల్ ఇంటెల్ తో కలిసి ఆపిల్ కంప్యూటర్ల కు ఇంటెల్ ప్రాసెస్ లను వినియోగించాలని నిర్ణయించుకుంది. 


క్రమ క్రమంగా ఆపిల్ ఐఫోన్ లను తయారు చేయటం, ఆపిల్ వాచ్ లను తయారు చేయటం మొదలు పెట్టింది. ఇలా ఆపిల్ టెక్నాలజీ ప్రపంచంలో దూసుకెళ్తూనే ఉంది.          

Leave a Comment