ఐశ్వర్య రాయ్ జీవిత చరిత్ర – Aishwarya Rai biography in Telugu

ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశానికి చెందిన నటి మరియు మిస్ వరల్డ్ 1994 పోటీలో గెలిచిన విజేత. ఐశ్వర్య రాయ్ భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన మరియు ప్రభావవంతమైన సెలెబ్రీటీలలో ఒకరు.

బాల్యం :

ఐశ్వర్య రాయ్ నవంబర్ 1 1973 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరంలో, క్రిష్ణ రాజ్ మరియు వృంద అనే దంపతులకు జన్మించారు.

ఐశ్వర్య తండ్రి ఆర్మీ లో జీవశాస్త్రవేత్త గా పనిచేసేవారు, 18 మర్చి 2017 వ సంవత్సరంలో మరణించారు. తల్లి వృంద ఒక గృహిణి. ఈమె కి ఒక ఆదిత్య రాయ్ అనే అన్నయ్య ఉన్నాడు.

తరవాత వీరి కుటుంబం ముంబై లో ఉండటం మొదలుపెట్టింది. తన స్కూల్ చదువును ఆర్య విద్యా మందిర్ హై స్కూల్ నుంచి పూర్తి చేసారు.

ఇంటర్మీడియట్ చదువును జై హింద్ కాలేజి నుంచి మరియు గ్రాడ్యుయేషన్ చదువును డిజి రూపారెల్ కాలేజి నుంచి పూర్తి చేసారు. ఐశ్వర్య చదువులో ముందుండే వారు.

టీనేజ్ సమయం నుంచే అయిదు సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ మరియు సంగీతాన్ని నేర్చుకునేవారు. చదువుకునే రోజులలో డాక్టర్ అవ్వాలని అనుకున్నారు, తరవాత ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకోని రచనా సంసద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు.

చివరికి నటనలో తన కెరీర్ ను కొనసాగించటానికి చదువును మానేసారు.

మోడలింగ్ :

1991 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సూపర్ మోడల్ పోటీలో గెలిచి అమెరికాకు చెందిన మేగజీన్ వోగ్ (Vogue) లో ఫీచర్ అయ్యారు.

1993 వ సంవత్సరంలో నటులు అమిర్ ఖాన్ మరియు మహిమ చౌదరితో పాటు కలిసి పెప్సీ ఆడ్ (ప్రకటన) చేసారు. ఈ ప్రకటనలో కొన్ని సెకన్లు మాత్రమే నటించిన ఐశ్వర్య ఫేమస్ అయ్యింది.

1994 వ సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రెండవ స్థానంలో నిలిచారు. ఇదే సంవత్సరం జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో గెలిచారు.

సినిమా జీవితం (1997) :

మోడలింగ్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న ఐశ్వర్య 1997 వ సంవత్సరంలో తమిళ్ పొలిటికల్ డ్రామా సినిమా ఇరువర్ లో నటించారు. ఇదే సంవత్సరం బాలీవుడ్ లో రొమాంటిక్ కామెడీ ఔర్ ప్యార్ హో గయా అనే సినిమా లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో విఫలమయ్యాయి.

1998 సంవత్సరంలో తమిళ్ రొమాంటిక్ డ్రామా సినిమా జీన్స్ లో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

1999 వ సంవత్సరంలో హిందీ సినిమా ఆ అబ్ లౌట్ చలేన్ లో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయ్యింది. ఇదే సంవత్సరం డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి ద్వారా హిందీ రొమాంటిక్ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్ లో నటించారు.

ఈ సినిమా ఐశ్వర్య కెరీర్ లో ఒక ముఖ్యమైన సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో విజయం సాధించింది. ఐశ్వర్యకు ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది.

ఇదే సంవత్సరం ఐశ్వర్య మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా హిందీ సినిమా అయిన తాల్ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు నటన సరిగా చేయట్లేదని విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్య ఇప్పుడు అందరి ప్రశంసలు పొందింది.

2000 సంవత్సరంలో కూడా కందుకొండైన్ కందుకొండైన్ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో మంచి విజయాన్ని సాధించింది.

ఇదే సంవత్సరం షారుఖ్ ఖాన్ మరియు చంద్రచూర్ సింగ్ తో ఆక్షన్ డ్రామా అయిన హిందీ సినిమా జోష్ మరియు సోషల్ డ్రామా హిందీ సినిమా అయిన హమారా దిల్ ఆప్కే పాస్ హై సినిమా లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

తరవాత అభిషేక్ బచ్చన్ తో కలిసి ధాయి ధై అక్షర్ ప్రేమ్ కే అనే రొమాంటిక్ హిందీ సినిమా లో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో డిసాస్టర్ అయ్యింది. ఈ సినిమా తరవాత మరొక రొమాంటిక్ సినిమా మొహబ్బతేన్ సినిమా లో సపోర్టింగ్ రోల్ లో నటించారు.

2001 వ సంవత్సరంలో గోవిందా మరియు జాకీ ష్రాఫ్ తో కలిసి రొమాంటిక్ కామెడీ హిందీ సినిమా అల్బెలా లో నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య నటన సరిగా లేదని విమర్శలు వచ్చాయి.

2002 వ సంవత్సరంలో హమ్ కిసీసే కమ్ నహీన్ అనే కామెడీ హిందీ సినిమాలో నటించారు. ఈ సినిమా విజయాన్ని సాధించలేక పోయింది.

ఇదే సంవత్సరం రొమాంటిక్ డ్రామా హిందీ సినిమా అయిన దేవదాస్ సినిమాలో నటించారు. ఈ సినిమా అంతర్జాతీయ విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ లో కూడా మంచి కలెక్షన్లను సంపాదించింది.

2003 సంవత్సరంలో ఐశ్వర్య మొత్తం మూడు సినిమాలలో నటించారు. వీటిలో దిల్ కా రిస్తా మరియు కుచ్ నా కహో సినిమాలు ప్లాప్ అయ్యాయి.

మూడవది ఒక బెంగాలీ సినిమ చోకర్ బాలి లో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

2004 వ సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ అక్షయ్ కుమార్ తో హిందీ సినిమా ఖాకి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ లను సంపాదించింది.

ఇదే సంవత్సరం క్యూన్! హో గయా నా అనే హిందీ సినిమాలో నటించారు. ఈ సినిమా వివేక్ ఒబెరాయ్ తో కలిసి చేసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విఫలం అయ్యింది.

తరవాత నటించిన రెండు సినిమాలలో మొదటి సినిమా, Bride and Prejudice సినిమా మంచి కలెక్షన్ లను ఇచ్చింది. రెండవ సినిమా రైన్ కోర్ట్ బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ అవ్వలేక పోయింది. ఈ సినిమాను కేవలం 16 రోజులలో పూర్తి చేసారు. ఐశ్వర్యకు ఫిలిం ఫేర్ ఉత్తమ నటిగా అవార్డు లభించింది

2005 లో ఐశ్వర్య నటించిన శబ్ద్ మరియు The Mistress of Spices సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. అలాగే బాక్స్ ఆఫీస్ లో కూడా ఫెయిల్ అయ్యాయి.

ఇదే సంవత్సరం రిలీజ్ అయిన బంటీ ఆర్ బబ్లీ హిందీ సినిమాలో ఐశ్వర్య రాయ్ చేసిన ఐటెం సాంగ్ “కజరారే” ఒక పెద్ద హిట్ అయ్యింది.

2006 వ సంవత్సరంలో ఐశ్వర్య ఉమ్రావ్ జాన్ అనే హిందీ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో మంచి విజయాన్ని అందించింది.

ఇదే సంవత్సరం ఐశ్వర్య ధూమ్ 2 లో నటించారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ మరియు హ్రితిక్ రోషన్ ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది. 2006వ సంవత్సరంలో భారతదేశంలో విదుదల అయిన సినిమాలలో ధూమ్ 2 అత్యధిక వసూళ్లను సాధించింది. తరవాత బ్రిటిష్ డ్రామా సినిమా Provoked లో నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య చేసిన నటనకు ప్రశంసలు లభించాయి.

2007 వ సంవత్సరంలో ఐశ్వర్య హిందీ సినిమా గురు మరియు The Last Legion అనే అడ్వెంచర్ సినిమాలో నటించారు.

2008 వ సంవత్సరంలో జోధా అక్బర్ మరియు సర్కార్ రాజ్ (సర్కార్ సినిమా పార్ట్ 2) లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

2009 వ సంవత్సరంలో అమెరికా కు చెందిన కామెడీ సినిమా The Pink Panther 2 లో నటించారు.

2010 వ సంవత్సరంలో రావణన్, ఎంథిరన్ (రోబోట్), గుజారిష్, సినిమాలలో నటించారు. గుజారిష్ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయ్యింది.

ఐదు సంవత్సరాల గ్యాప్ తరవాత ఐశ్వర్య మళ్ళీ సినిమాలలో నటించటం మొదలుపెట్టారు. జజ్బా, సరబ్జిత్ మరియు ఆయె దిల్ హాయ్ ముష్కిల్ సినిమాలలో నటించారు.

2022 వ సంవత్సరంలో Ponniyin Selvan: I, చరిత్రాత్మక సినిమాలో నటించారు.

వ్యక్తిగత జీవితం :

1999 సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ జాక్టో సల్మాన్ ఖాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య విబేధాలు రావటం వల్ల 2002 వ సంవత్సరంలో విడిపోయారు.

తరవాత వివేక్ ఒబెరాయ్ తో రేలషన్ షిప్ లో ఉన్నారు. ఈ జంట 2005 వ సంవత్సరంలో విడి పోయారు.

ధూమ్ 2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య తో ప్రేమలో పడతారు. ఇద్దరు 20 ఏప్రిల్ 2007 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముంది ఐశ్వర్య ముంబైలోని బాంద్రా లో నివసించేవారు.

ఈ దంపతులకు 16 నవంబర్ 2011 వ సంవత్సరంలో ఒక పాప పుట్టింది. ఈ పాప పేరు ఆరాధ్య అని పెట్టారు.

Source: Aishwarya Rai Bachchan – Wikipedia

Leave a Comment