సానియా మీర్జా ఇండియా కు చెందిన ఒక టెన్నిస్ ప్లేయర్. చిన్న వయసులోనే టెన్నిస్ ను ఆడటం మొదలుపెట్టిన క్రీడా కారిణి. ఆరు గ్రాండ్ స్లాం టైటిల్ లను, డబుల్స్ లో ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో కూడా నిలిచారు.
సానియా మీర్జా ఆడిన ఆట తీరును చూసి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అంబాసిడర్ గా నియమించటం జరిగింది.
Table of Contents
బాల్యం :
సానియా మీర్జా 15 నవంబర్ 1986 సంవత్సరంలో ముంబై నగరంలో ఇమ్రాన్ మీర్జా మరియు నసీమ అనే హైదరాబాద్ కు చెందిన దంపతులకు జన్మించారు.
సానియా మీర్జా యొక్క తండ్రి ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ మరియు తల్లి ప్రింటింగ్ బిజినెస్ లో పనిచేసేవారు. సానియా మీర్జా పుట్టిన తరవాత ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చి నివసించటం మొదలుపెట్టారు.
ఆరు సంవత్సరాల వయస్సు నుంచే సానియా మీర్జా టెన్నిస్ ఆడటం మొదలుపెట్టారు. సానియా తన స్కూలు చదువును నాసర్ బాలికల పాఠశాల నుంచి పూర్తి చేసారు. ఈ స్కూలు లో చదివేటప్పుడు కూడా తన టెన్నిస్ కెరీర్ ను కొనసాగించారు. తన కాలేజీ చదువును సెయింట్ మేరీ కాలేజీ నుంచి పూర్తి చేసారు.
చెన్నై లోని Dr. M.G.R. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి గౌరవప్రదమైన డాక్టర్స్ అఫ్ లెటర్స్ అనే డిగ్రీ ను ఇవ్వటం జరిగింది.
కెరీర్ :
2002 లో బుసాన్ లో జరిగిన 2002 Asian games లో బ్రోన్జ్ మెడల్ ను గెలిచారు. 2003 లో జరిగిన 2003 Afro-Asian Games లో నాలుగు గోల్డ్ మెడల్ లను సంపాదించారు.
2003 వ సంవత్సరంలో గర్ల్స్ డబుల్స్ లో 2003 వింబుల్డన్ ఛాంపియన్ షిప్ ను గెలిచారు. 2003 US Open girls doubles లో సెమీఫైనల్స్ కి చేరారు.
2005 సంవత్సరంలో జరిగిన AP Tourism Hyderabad Open లో గెలిచి WTA టైటిల్ ను గెలిచిన మొట్ట మొదటి మహిళ గా నిలిచారు. ఇదే సంవత్సరంలో US Open వద్ద జరిగిన Grand slam tournament లో నాలగవ రౌండ్ కి వెళ్లిన మొట్ట మొదటి మహిళగా నిలిచారు.
2007 వ సంవత్సరంలో జరిగిన US Open Series లో తన సింగిల్స్ ర్యాంకింగ్ ను అత్యధికంగా 27 వ స్థానం గా కైవసం చేసుకున్నారు.
2008 లో జరిగిన PTT Pattaya Open లో కాలు గాయం కారణంగా ఆడ లేకపోయారు. ఇదే సంవత్సరంలో జరిగిన పలు మ్యాచులలో కూడా చేతి గాయాల కారణాల వల్ల ఆడలేక పోయారు.
2010 సంవత్సరంలో జరిగిన 2010 Commonwealth Games లో సెకండ్ సీడ్ గా నిలిచారు కానీ ఫైనల్స్ లో ఓడిపోయారు.
నవంబర్ లో జరిగిన 2010 Asian Games లో జరిగిన సింగిల్స్ లో బ్రోన్జ్ మెడల్ ను మరియు ఇండియా కు చెందిన విష్ణు వర్ధన్ తో పాటు ఆడిన డబుల్స్ లో సిల్వర్ మెడల్ ను సంపాదించారు.
2014 సంవత్సరంలో సౌత్ కొరియా లో జరిగిన 17th Asian Games లో గోల్డ్ మరియు బ్రోన్జ్ మెడల్స్ లను గెలిచారు.
ఇదే సంవత్సరంలో Cara Black మరియు సానియా మీర్జా జోడి కలిసి WTA ఫైనల్స్ లో గెలిచారు.
2015 సంవత్సరంలో జరిగిన Family Circle Cup’s డబుల్స్ లో సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్ జోడి గెలిచి టైటిల్ ను సంపాదించారు.
వ్యక్తిగత జీవితం :
2009 సంవత్సరంలో సానియా మీర్జా యొక్క నిశ్చితార్థం సోహ్రాబ్ మీర్జా తో జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి మాత్రం జరగలేదు.
12 ఏప్రిల్ 2010 వ సంవత్సరంలో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను హైదరాబాద్ లోని తాజ్ క్రిష్ణా హోటల్ లో పెళ్లి చేసుకున్నారు. వలీమా ను పాకిస్తాన్ లోని సియల్ కోట్ లో చేయటం జరిగింది. ఈ దంపతులకు అక్టోబర్ 2018 సంవత్సరంలో కొడుకు ఇజ్హాన్ మీర్జా మాలిక్ పుట్టడం జరిగింది.
సానియా మీర్జా హైదరాబాద్ లో తన టెన్నిస్ అకాడమీ ను కూడా ప్రారంభించారు.
అవార్డులు :
సానియా మీర్జా కు 2004 సంవత్సరంలో అర్జున అవార్డు, 2006 సంవత్సరంలో పద్మ శ్రీ అవార్డు ను , 2015 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ను, 2016 వ సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డు ను ఇవ్వటం జరిగింది.
2014 వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జా ను రాష్ట్రం యొక్క అంబాసిడర్ గా నియమించారు.
వివాదాలు :
2006 వ సంవత్సరంలో సానియా మీర్జా ఇజ్రాయెల్ కు చెందిన టెన్నిస్ ప్లేయర్ Shahar Pe’er తో డబుల్స్ ఆడటానికి నిరాకరించారని, భారత దేశ ముస్లిం లు నిరసనలు చేస్తారని ఆడలేదని న్యూస్ చానెల్స్ లో చెప్పటం జరిగింది. కాని 2007 వ సంవత్సరంలో జరిగిన 2007 WTA Tour of Stanford లో అదే ఇజ్రాయెల్ క్రీడాకారిణి Shahar Pe’er తోనే కలిసి ఆడటం జరిగింది.
2008 సంవత్సరంలో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం లో డ్రెస్ కోడ్ రూల్ ను ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి.
2008 లో జరిగిన హాప్మాన్ కప్ లో రోహన్ బోపన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో సానియా మీర్జా తన కాళ్ళను ఇండియా ఫ్లాగ్ వైపు పెట్టారు. ఆ సమయంలో తీసిన ఫోటో లు మీడియా లో చక్కర్లు కొట్టడంతో చాలా విమర్శలకు గురి అయ్యారు.
Source: Sania Mirza – Wikipedia