ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వసీం రిజ్వి ప్రస్తుతం న్యూస్ ఛానల్ లలో చర్చలో ఉన్నారు. వసీం రిజ్వి ఇస్లాం మతం పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తరచూ చర్చలో ఉంటారు. 6 డిసెంబర్ 2021 సంవత్సరంలో ఇస్లాం మతం నుంచి హిందూ మతం లోకి మారారు.
రాజకీయ జీవితం :
2000 సంవత్సరంలో లక్నో లోని కాశ్మీరీ మొహల్లా వార్డ్ కి సమాజ్ వాది పార్టీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నుకోబడ్డారు. 2008 సంవత్సరంలో షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సభ్యుడిగా చేరారు.
వివాదాస్పద వ్యాఖ్యలు :
2018 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మరియు ప్రధాన మంత్రి మోదీ కి రాసిన ఉత్తరంలో “మదరసాలు తీవ్రవాదులను తయారు చేస్తుందని వాటిని మూసి వేయాలని” కోరారు.
ఇంకొక సందర్భంలో ప్రధాన మంత్రి మోదీ కి రాసిన ఉత్తరంలో Worship Act of 1991 ప్రకారం మందిరాలపై కట్టిన మసీదుల స్థలాన్ని తిరిగి తీసుకోవాలని చెప్పారు.
ఇటీవల వసీం రిజ్వి ఖురాన్ లోని 26 ఆయత్ (శ్లోకాలు) లను తీసివేయాలని, ఈ ఆయత్ లు లేకుండా తాను ఒక కొత్త ఖురాన్ ను రాసానని చెప్పారు.
సుప్రీం కోర్ట్ లో కూడా ఖురాన్ లో నుంచి 26 ఆయత్ లను తీసి వేయాలని పిటీషన్ చేసారు, కోర్ట్ ఈ పిటిషన్ ని కొట్టి పారేసింది.
2017 లో అమలు లోకి వచ్చిన ట్రిపిల్ తలాక్ బిల్లు కు వ్యతిరేకంగా చెప్పిన వారికి జైలు శిక్ష వేయాలని రిజ్వి కోరారు.
2020 లో పిల్లలు ఎక్కువగా కనటానికి లేదు అని ఎక్కువ మంది ను కంటే దేశానికే ప్రమాదం అని చెప్పారు.
నవంబర్ 2021 సంవత్సరంలో ముహమ్మద్ అనే పుస్తకం లో ఇస్లాం ను తాను ఎందుకని ఒక హింసాత్మక మతం గా పరిగణిస్తాను దానికి గల కారణాలు వివరించారు.
ముస్లిం నుంచి హిందువు గా :
డిసెంబర్ 6, 2021 వ సంవత్సరంలో ఇస్లాం మతం నుంచి హిందూ మతం లోకి మారారు. ఇప్పటినుంచి తాను హిందూ మతంలోని త్యాగి సముదాయానికి చెందుతానని చెప్పి తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి గా మార్చుకున్నారు.
ఇస్లాం నుంచి హిందువు గా మారె సంప్రదాయం ప్రకారం దస్నా దేవి గుడి లో శివ లింగానికి పాలు సమర్పించి యజ్ఞం కూడా చేసారు.
వసీం రిజ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతి సారి ముస్లిం సముదాయం వారు ఆక్రోశానికి గురి అయ్యారు. రిజ్వి ను అరెస్ట్ చేయాలని కోరారు.
ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కుటుంబలో కేవలం తాను మాత్రం హిందూ మతం లోకి వచ్చానని చెప్పారు.
Source: Syed Waseem Rizvi – Wikipedia