కల్పనా చావ్లా జీవిత చరిత్ర – Kalpana chawla biography in Telugu.

కల్పనా చావ్లా అనే పేరు భారత దేశానికి ఒక గొప్ప నిదర్శనం. భారత దేశం నుంచి  అంతరిక్షం లోకి వెళ్లిన మొట్ట మొదటి మహిళా వ్యోమగామి. చావ్లా ఎంతో మంది అమ్మాయిలకు నిదర్శనంగా నిలిచారు.   

బాల్యం:  

కల్పన మార్చి 17,1962 సంవత్సరంలో హర్యానా లోని కర్నల్ అనే నగరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి  కల్పనా కు ఏరోప్లేన్స్ అన్న వాటిని నడపటం అన్న చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఫ్లైయింగ్ క్లబ్స్ కి వెళ్లి ప్లేన్ లు ఎగరటాన్ని తన తండ్రి తో కలిసి చూసేవారు. చావ్లా తన తండ్రి ని ఈ ఏరోప్లేన్స్ లో మనము కూడా  ప్రయానించుదాం అని అడిగే వారు.

విద్య: 

1976 లో చావ్లా టైగర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్నారు. కల్పనా చావ్లా కి చిన్నప్పటి నుంచి చదవటం అంటే చాలా ఇష్టం అందుకనే మంచి మార్కులు కూడా వచ్చేవి.      

ఇండియా లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి బాచిలర్స్ డిగ్రీ సంపాదించారు. ఇండియా లో చదువు ముగించుకొని ఏరో స్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించడానికి 1982 లో యునైటెడ్ స్టేట్స్ కి బయలు దేరారు. 1984 లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించిన తర్వాత 1986 లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుంచి పిహెచ్డి ని కూడా చదివారు.

కల్పనా  చావ్లా నాసా లో : 

 1988 లో చావ్లా నాసా పరిశోధన కేంద్రం లో చేరడం జరిగింది. చావ్లా వద్ద ఏరోప్లేన్స్, గ్లిడెర్స్, లాంటి విమానాల కోసం ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ గా సర్టిఫికేట్ ను కలిగి ఉన్నారు. 1991 లో అమెరికా పౌరసత్వం లభించిన తర్వాత “నాసా ఆస్ట్రోనాట్ సంస్థ” కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1995 లో ఈ సంస్థ లో చేరడం జరిగింది, ఈ సంస్థలో అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలు చేయబడతాయి.      

అంతరిక్ష ప్రయాణం:  

 19 నవంబర్, 1987 లో కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష ప్రయాణం చేసారు. ఈ ప్రయాణం లో 6 వ్యోమగాముల బృందం స్పేస్ షటిల్  కొలంబియా ఫ్లైట్ ను ఉపయోగించారు. భారత దేశం నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్ట మొదటి మహిళగా కల్పనా చావ్లా చరిత్ర లో నిలిచి పోయారు.

కల్పనా చావ్లా స్పార్టన్ అనే శాటిలైట్ కూడా లాంచ్ చేసారు, అంతరిక్ష ప్రయాణం తర్వాత అంతరిక్ష కేంద్రం లో చావ్లా టెక్నికల్ విభాగం లో పనిచేయడం మొదలుపెట్టారు.

2001 వ సంవత్సరంలో చావ్లా రెండవ సారి అంతరిక్ష ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ ప్రయాణానికి STS – 107 అనే అంతరిక్ష నౌకని ఉపయోగించారు.

కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ  ప్రయాణం చాలా సార్లు వాయిదా పడింది. జనవరి 26, 2003 వ సంవత్సరంలో STS-107 మిషన్ కొరకు తమ అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణం లో చావ్లా మరియు తనతో పాటు ఉన్న సిబ్బంది 80 కి పైగా ప్రయోగాలు చేసారు, ఈ  ప్రయోగాలు భూమి,స్పేస్ సైన్స్ మరియు వ్యోమగామిల ఆరోగ్యము, రక్షణ లాంటి విషయాలపై చేయడం జరిగింది.     

ఆకస్మిక ఆపద :

  కల్పనా చావ్లా ప్రయాణం చేసిన  STS-107 ప్రయాణానికి ముందు చాలా సాంకేతిక కారణాలతో వేదించిన విషయం తెలిసిందే. చావ్లా భూమినుంచి అంతరిక్షానికి ప్రయాణం మొదలుచేసినప్పుడు ఫోమ్ ఇన్సులేషన్ నుంచి ఒక ముక్కస్పేస్ షటిల్ బాహ్య ట్యాంక్ నుంచి విరిగి ఎడమ పక్క గల ఆర్బిటర్ రెక్కను ను ఢీ కొట్టింది. 

ఇంతకుముందు జరిగిన ప్రయోగాలలో కూడా చిన్న చిన్న స్వల్ప నష్టాలు జరిగాయి కానీ ఎలాంటి పెద్ద ప్రమాదాలకు దారి తీయలేదు.

మరణం:

చావ్లా ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్ భూమి వైపు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు షటిల్ కి జరిగిన చిన్న నష్టం పెద్దగా మారి స్పేస్ షటిల్ యొక్క రెక్కల నిర్మాణాన్ని తీవ్రంగా నష్టపరిచింది, ఫలితంగా కొలంబియా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కల్పన చావ్లా తో పాటు మిగతా బృందం చనిపోవటం జరిగింది..

Source: Kalpana Chawla – Wikipedia

2 thoughts on “కల్పనా చావ్లా జీవిత చరిత్ర – Kalpana chawla biography in Telugu.”

Leave a Comment