అరుణిమ సిన్హా ఒక ఆడపిల్ల కష్టమైనా పనులను చేయలేదు అనే ఆలోచన విధానాన్ని మార్చారు. అరుణిమ ఒక ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన తరవాత ఎవరు అలోచించని విధంగా ఆసుపత్రి బెడ్ పై ఉండగానే పర్వతాలను అధిరోహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ ప్రయాణంలో తనకు చాలా అడ్డంకులు వస్తాయి అని తెలిసిన పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు.
మనలో చాలా మంది చిన్న చిన్న పనులను చేయడానికి రేపటి పై వాయిదా చేస్తారు. లేదా కొన్ని రోజుల తరవాత ఆ పని ని లేదా లక్ష్యాన్ని వదిలేస్తారు.
అరుణిమ సిన్హా ఇండియా లో ఉండే యువత కు తన పర్వత అధిరోహణ నుంచి ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అని నిరూపించారు.
Table of Contents
బాల్యం :
అరుణిమ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జన్మించారు. అనుపమ తండ్రి ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగం చేసేవారు, తల్లి హెల్త్ డిపార్ట్మెంట్ లో సూపర్ వైజర్ గా చేసేవారు.
అనుపమ కి ఒక అక్క మరియు ఒక తమ్ముడు ఉన్నారు. అనుపమ తండ్రి చనిపోయిన తరవాత వీరి తల్లి మొత్తం కుటుంబాన్ని పోషించింది.
రైలు ప్రమాదం :
అరుణిమ సిన్హా జాతీయ వాలీబాల్ మహిళా క్రీడాకారిణి. అరుణిమ సిన్హా పారామిలటరీ ఫోర్సెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుంచి కూడా కాల్ లెటర్ కూడా వచ్చింది.
12 ఏప్రిల్ 2011 వ సంవత్సరంలో ఢిల్లీ లోని ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు ఆకతాయిలు అరుణిమ పై తాను వేసుకున్న గోల్డ్ చైన్ ను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తారు.
అరుణిమ ఒక స్పోర్ట్స్ క్రీడాకారిణి అవ్వటం తన బలంతో వారిని ఎదుర్కోవటానికి ప్రయాణిస్తారు. ఆకతాయిలు అరుణిమ బలాన్ని చూసి కోపంతో రాత్రి 1 గంటలకు నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు తోసివేస్తారు.
ట్రైన్ పట్టాల మీద పడి ఉన్న అరుణిమ కాలు పై నుంచి ట్రైన్ వెళుతుంది. ఈ ఘటనలో అరుణిమ కాలు నుజ్జు నుజ్జు అవటం తో తాను స్పృహ కోల్పోతుంది.
తరవాత అరుణిమ ను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాణాన్ని కాపాడటానికి కాలు ను తీసివేయాల్సి వచ్చింది. ఈ ఘటన తరవాత అరుణిమ కు స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి 25,000 రూపాయలు మరియు మినిస్టర్ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి 2,00,000 లక్షల రూపాయలు పరిహారంగా కూడా ఇవ్వటం జరిగింది.
ఈ భయంకర ఘటన తరవాత CISF మరియు ఇండియా రైల్వే ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేశారు. కొన్ని నెలలు గడిచిన తరవాత అరుణిమకు ఒక ప్రొస్థెటిక్ కాలు ను అమర్చారు.
పర్వత అధిరోహణ :
తన కాలు కోల్పోయిన విషయం ను గ్రహించిన తరవాత ఆసుపత్రి లో ఉన్నప్పుడే మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించాలని నిర్ణయించుకున్నారు.
అరుణిమ యొక్క ఈ ఆలోచనను కొంత మంది సాధ్యం కాదు అని అనుకున్నా తన మనసులో తీసుకున్న గట్టి నిర్ణయాన్ని ఎలాగైనా సాధించాలని నిశ్చయించుకున్నారు. అరుణిమ తల్లి కూడా తన ఈ నిర్ణయాన్ని అంగీకరించారు.
అరుణిమ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన మొట్ట మొదటి మహిళ అయిన బచేంద్రి పాల్ (Bachendri Pal) ను కలిసి తన పర్వత అధిరోహణ నిర్ణయాన్ని చెప్పగా ” ప్రోస్థటిక్ కాలి తో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ చేయాలనుకున్న క్షణమే నువ్వు ఆ పర్వతాన్ని అధిరోహించవని, ఇప్పుడు కేవలం నువ్వు అధిరోహించబోయే రోజు ప్రజలకి తెలియాలి మై చైల్డ్ ” అని చెప్పి తనలో స్ఫూర్తి ని నింపారు.
ఇక్కడి నుంచి అరుణిమ పర్వతారోహణకు సంబంధించిన ఒక కోర్స్ ను కూడా చేశారు. అరుణిమ మొట్ట మొదటి సారి హిమాలయ కు చెందిన ఐలాండ్ పీక్ (Island Peak) అనే 6150 మీటర్ల పర్వతాన్ని 2012 వ సంవత్సరంలో అధిరోహించారు.
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించేటప్పుడు ఇతర పర్వత అధిరోహకులు చాలా సార్లు నిరుత్సహానికి గురిచేసేవారు. పర్వతాన్ని అధిరోహించటానికి ఇతరులకి నిముషాలు పడితే అరుణిమ కు గంటలు పట్టేది.
ప్రొస్థెటిక్ కాలు అవ్వటం తో కొన్ని సార్లు కాలు నుంచి రక్తం కూడా వచ్చేది. తన గట్టి పట్టుదలతో 21 మే 2013 వ సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించి ప్రపంచంలోని మొట్ట మొదటి అంప్యూటీ మహిళ గా నిలిచారు. 52 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు.
గుర్తింపు :
మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి 25 లక్షల బహుమతి ని అందించారు. ప్రస్తుతం అరుణిమ సిన్హా వికలాంగుల కోసం ఒక స్పోర్ట్స్ అకాడమీ ను ప్రారంభించారు. 2015 లో అరుణిమ కు పద్మ శ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది.