అభిలిప్సా పండా జీవిత చరిత్ర – Abhilipsa panda biography in Telugu

అభిలిప్సా పండా ఒరిస్సా కు చెందిన 21 సంవత్సరాల గాయకురాలు. ఈ మధ్య కాలంలో అభిలిప్సా పాడిన ఆధ్యాత్మిక పాట హర్ హర్ శంబు వైరల్ అవ్వటం వల్ల అందరూ తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

బాల్యం :

అభిలిప్సా ఒరిస్సా రాష్ట్రం లోని కియోంఝర్ (keonjhar) జిల్లా బార్బిల్ (Barbil) టౌన్ కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న తనం నుంచే తన కుటుంబంలో ఉండే తాతయ్య, అమ్మమ్మ మరియు నానమ్మ అభిలిప్సాను సంగీతం నేర్పించేవారు.

అభిలిప్సా కుటుంబంలో తల్లి తండ్రి మరియు ఒక చెల్లి ఉన్నారు. వీరి కుటుంబం అభిలిప్సా ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. 

మొదటి సారి అభిలిప్సా యొక్క అమ్మమ్మ గాయత్రీ మంత్రం ద్వారా సంగీతానికి పరిచయం చేసారు. కేవలం నాలుగు సంవత్సరాల వయస్సులోనే శాస్త్రీయ సంగీతంను నేర్చుకోవటం మొదలుపెట్టారు. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే సంగీతం నేర్చుకోవటం ఆపివేసారు.

2015 వ సంవత్సరంలో హిందుస్తానీ క్లాసికల్ వోకల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అదే సమయంలో ఒక గురువు తన వాయిస్ నచ్చి  ఒక పాటలో చిన్న పిల్ల వాయిస్ కావాలి నీ గొంతు బాగుంది నువ్వు పాడతావా అని అడగగా ఒకే అని చెప్పారు.  

ఇలా మొట్టమొదటి సారి ఒక స్టూడియో లో పాట రికార్డింగ్ చేయటం జరిగింది. 2017 వ సంవత్సరంలో హిందుస్తానీ క్లాసికల్ వోకల్ లో విన్నర్ గా కూడా నిలిచారు.   

కెరీర్ : 

సంగీత ప్రపంచంలో ఇలా మెల్ల మెల్లగా పైకి ఎక్కుతున్న సమయంలో అభిలిప్సా ఒక రియాలిటీ షో లో పాల్గొన్నారు.  హర్ హర్ శంబు పాటలో కో ఆర్టిస్ట్ గా ఉన్న జీతూ శర్మ అభిలిప్సా యొక్క రియాలిటీ షో వీడియో చూసి తనతో ఒక పాట చేయాలనీ కోరగా అభిలిప్సా ఒకే అని చెప్పారు.

కాలేజీ సెలవులలో ఉన్న అభిలిప్సా జీతూ శర్మ ద్వారా హర్ హర్ శంబు పాటలో పాడి వైరల్ సెలబ్రిటీ గా మారారు. పాటలే కాకుండా కరాటే లో కూడా అభిలిప్సా బ్లాక్ బెల్ట్ సంపాదించారు.

2019 వ సంవత్సరంలో కరాటే లో జాతీయ బంగారు పతకంను కూడా కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక పాటల వల్ల పాపులర్ అయిన అభిలిప్సా హిందీ మరియు ఇతర భాషలలో ఉండే సినిమా పాటలను పడటం కూడా ఇష్ట పడతారు.

హర్ హర్ శంబు పాట తరవాత మంజిల్ కేదార్ నాథ్ మరియు భోలే నాథ్ జి అనే రెండు పాటలు కూడా రిలీజ్ చేతం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయ్యిన రెండు పాటలను కూడా లక్షల సంఖ్యలో జనాలు వింటున్నారు.

తాను ఈ పాట ను చాలా భక్తి మరియు శ్రద్ధ తో పాడాను అని దేవుడే తన పాటను వైరల్ చేసాడని ఒక ఇంటర్వ్యూ లో అభిలిప్సా చెప్పారు.     

ప్రస్తుతం అభిలిప్సా ఇంటర్ రెండవ సంవత్సరం యొక్క ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.  

Leave a Comment