Yahoo success story in Telugu – యాహూ సక్సెస్ స్టోరీ మరియు పతనం

ఇంటర్నెట్ కొత్తగా వచ్చిన రోజుల్లో తయారు చేసిన వెబ్ సైట్ లలో ఒకటి యాహూ. యాహూ ను 1994 సంవత్సరంలో Jerry Yang మరియు David Filo అనే ఇద్దరు యువకులు కలిసి 1990 లో యాహూ అనే కంపెనీ ను మొదలుపెట్టారు.  

ఇంటర్ నెట్ ప్రపంచంలో యాహూ వెబ్ సైట్ : 

 Yang మరియు Filo ఇద్దరు Stanford University లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లుగా చదువుతున్నప్పుడు “Jerry and David’s guide to the World Wide Web” అనే వెబ్ సైట్ ను తయారు చేసారు. ఈ వెబ్ సైట్ లో ఇంటర్నెట్ లో ఉన్న మొత్తం వెబ్ సైట్ ల లిస్ట్ ఉండేది. 1995 వ సంవత్సరంలో ఈ వెబ్ సైట్ పేరు ను yahoo.com గా మార్చడం జరిగింది. 1994 చివరిలో యాహూ 1 మిలియన్ విజిటర్లు రావటం చూసి తమ వెబ్ సైట్ ద్వారా మంచి బిసినెస్ ను తయారు చేయవచ్చు అనుకున్నారు. అందుకే 1995 లో యాహూ ఒక సంస్థ గా మార్చాలని నిర్ణయించుకున్నారు.     

1990 వ సంవత్సరం నుంచి మొదలుకొని యాహూ చిన్న చిన్న కంపెనీ లను కొన సాగింది. ఈ సంస్థలను యాహూ Four11,Rocketmail, ClassicGames.com,GeoCities,eGroups కొని తన సొంతం చేసుకుంది. 1998 సంవత్సరంలో యాహూ పేజర్ అనే మెసేజ్ సర్వీస్ ను మొదలుపెట్టింది, దీనినే తరవాత Yahoo messanger గా పేరు మార్చారు.  

Dot-com bubble మరియు యాహూ ఎదుగుదల :  

1995 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో ఇంటర్నెట్ ప్రపంచం ప్రసిద్ధి చెందటం తో చాలా మంది ఫేక్ వెబ్ సైట్ ల పేరున ఇన్వెస్టర్ లను తమ తమ వెబ్ సైట్ లో ఇన్వెస్ట్ చేయమని భవిష్యత్తులో ఇంటర్ నెట్ ద్వారానే బిసినెస్ లు నడుస్తాయి అని చాలా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పేవారు.

 ఈ వదంతులను చాలా మంది నిజం అనుకోని ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టారు కానీ తరవాత తెలిసింది ఏంటంటే అలాంటి వెబ్ సైట్ లేదని తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బు అంత వృధా అయ్యిందని తెలుసుకోవటం జరిగింది.   

ఆ సమయంలో కొన్ని కంపెనీ లకు నిజంగానే వెబ్ సైట్ ఉంది మరియు వారు సర్వీస్ కూడా అందచేస్తున్నరు. దీనికి Yahoo మరియు Ebay వెబ్ సైట్ లు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.   

ఇప్పుడు కూడా Crypto currency పేరుతో చాలా మందిని పిచ్చోళ్లను చేస్తున్నారు. Cryptocurrency లో ఇన్వెస్ట్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు కానీ వీటిలో నిజమైన కరెన్సీ ఎదో ఫేక్ కరెన్సీ ఎదో తెలియక జనాలు చాలా మంది తమ డబ్బులను వృధా చేసుకుంటున్నారు.    

Dot-com bubble తరవాత స్టాక్ మార్కెట్ లో యాహూ యొక్క విలువ అతి పెద్ద మొత్తంలో ఒక్క షేర్ కు $118.75  చొప్పున అమ్ముడు పోయింది.  

ముందు రోజులలో యాహూ చాలా బాగా ఎదిగినా గూగుల్ సంస్థ వచ్చిన తరవాత యాహూ సంస్థ కు చాలా నష్టం కలిగింది.  

గూగుల్ జీమెయిల్ (gmail) సర్వీస్ ను ప్రారంభించిన తరవాత యాహూ సంస్థ నష్టాల లోకి వెళ్ళటం జరిగింది ఫలితంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. గూగుల్ ప్రవేశ పెట్టిన జీమెయిల్ యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, ఇంకా అనేక గూగుల్ కు సంబంధించిన ప్రోడక్ట్ లలో ఉపయోగ పడటం వళ్ళ  చాలా మంది ఇతర మెయిల్ ల నుంచి జీమెయిల్ కు మారారు.   

మైక్రోసాఫ్ట్ యాహూ ను కొనే ప్రయత్నం:  

మైక్రోసాఫ్ట్ యాహూ సంస్థ ను కొనాలని చాలా సార్లు ప్రయత్నించింది, చాలా సార్లు డీల్ ఫైనల్ కూడా అయ్యింది కానీ చివరికి ఎదో ఒక కారణం వళ్ళ డీల్ అవ్వలేదు. 10 సంవత్సరాల తరవాత యాహూ తమ సెర్చ్ ఇంజిన్ ను అధ్యయనం చేయటానికి మైక్రోసాఫ్ట్ కు అనుమతి ఇచ్చింది.  మైక్రోసాఫ్ట్ సంస్థ తాము తయారు చేస్తున్న BING అనే సెర్చ్ ఇంజిన్ ను డెవలప్ చేయటానికి యాహూ ని ఉపయోగించారు.

2017 వ సంవత్సరంలో Verizon Communications అనే కంపెనీ యాహూ కు సంబంచిన చాలా వరకు ఇంటర్నెట్ కు సంబంధించిన బిసినెస్ ను కనుగోలు చేయటం జరిగింది.   

యాహూ ప్రస్తుతం అందజేస్తున్న సర్వీసులు:  

Yahoo! 

Yahoo! Answers

 Yahoo! Developer Network

 Yahoo! Entertainment

 Yahoo! Finance 

Yahoo! Groups 

Yahoo! Lifestyle 

Yahoo! Mail 

Yahoo! Maps 

Yahoo! Mobile 

Yahoo! News 

Yahoo! Research 

Yahoo! Safety Center

 Yahoo! Gemini 

Yahoo! Shopping 

Yahoo! Small Business 

Yahoo! Smart TV 

Yahoo! Sports Rivals

Leave a Comment