శిల్పా శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక గొప్ప నటి. బాలీవుడ్ లో చాలా విజయవంత మైన సినిమాలు చేసారు. బాలీవుడ్ లో సినిమాలు మానేసిన తరవాత ఇప్పుడు సూపర్ డాన్సర్,నచ్ బలియే లాంటి టీవీ షోలు చెయ్యటం మొదలు పెట్టారు. 2007 వ సంవత్సరంలో బిగ్ బ్రదర్ లో కూడా పాల్గొన్నారు.
శిల్పా శెట్టి మరియు తన భర్త రాజ్ కుంద్రా కలిసి ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ టీం యజమాని గా కూడా ఉన్నారు. ఈ రోజుల్లో యోగా ను ప్రచారం చేయటం కూడా మొదలు పెట్టారు. రిచర్డ్ గేర్ అనే అమెరికన్ నటుడు శిల్పా శెట్టి ను స్టేజి పై ముద్దు పెట్టుకున్న తరవాత చాలా మంది భారత దేశంలో నిరసనలు చేసారు.
Table of Contents
బాల్యం :
శిల్పా శెట్టి కర్నాటకా లో సురేంద్ర మరియు సునంద అనే దంపతులకు 1975 వ సంవత్సరంలో జన్మించారు. శిల్పా శెట్టి తన చదువు ముంబై లో పూర్తి చేసుకుంది. బాల్యం లోనే భరతనాట్యం నేర్చుకోవటం వళ్ళ సినిమా రంగంలో బాగా సహాయ పడింది.
16 సంవత్సరాల వయస్సులోనే టీవీ లో యాడ్స్ చేయటం మొదలుపెట్టారు. ఒకటి తరవాత మరొక యాడ్స్ రావటం మొదలయ్యాయి. టీవీ లో చేసే యాడ్స్ వల్లనే సినిమాలలో అవకాశాలు రావటం మొదలు అయ్యాయి.
సినిమా జీవితం :
1992 సంవత్సరంలో శిల్పా ఒక సినిమా చేయటం ప్రారంభించారు కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. శిల్ప రెండవ సినిమా బాజిగర్ (Bazigar) ను షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ తో కలిసి నటించింది. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మరియు వసూళ్ళలో కూడా ఆ సంవత్సరం నాలగవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా తరవాత Aag మరియు Main Khiladi Tu ఆనాటి అనే సినిమాలు కూడా చాలా విజయవంతమయ్యాయి.
కొన్ని ఫ్లాప్ సినిమాల తరవాత 2000 సంవత్సరం తరవాత Dhadkan, Rishtey అనే విజయవంతమైన సినిమాలు చేసారు. Phirmilenge సినిమాలో శిల్పా శెట్టి ఒక HIV సోకినా అమ్మాయి జీవితం గురించి చాలా బాగా నటించింది. ఈ సినిమాలో శిల్పా శెట్టి నటనను చాలా మంది పొగిడారు, తరవాత శిల్ప HIV చారిటీ కి సంబంధించిన పనులు కూడా చేయటం ప్రారంభించింది.
శిల్పా శెట్టి ఒకటే రకమైన పాత్రలలో కాకుండా వివిధ రకాల పాత్రలలో చేసారు. Dus, Auto Shankar, life in a metro, Apne లాంటి చాలా పెద్ద హిట్ సినిమాలు చేసారు.
వివాదాలు :
2006 వ సంవత్సరంలో తమిళనాడు లోని మదురై నగరంలో శిల్ప శెట్టి మరియు రీమాసేన్ మీద చిన్న బట్టలు వేసుకున్నందుకు కేసు బుక్ చేసారు.
శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో లో పాల్గొన్నారు. ఈ షోను చుసిన తరవాతే ఇండియా లో బిగ్ బాస్ షో ను లాంచ్ చేసారు. బిగ్ బ్రదర్ బ్రిటిష్ రియాలిటీ షో, శిల్పా శెట్టి ఈ షో లో పాల్గొన్నప్పుడు చాలా మంది తన రంగు ను ఆధారం చేసుకొని వాగ్విదానికి దిగారు.
అమెరికా కు చెందిన నటుడు రిచర్డ్ గేర్ ఎయిడ్స్ అవహగాహన సభలో శిల్పా శెట్టిని అందరి ముందు ముద్దు పెట్టుకోవటం చాలా వివాదానికి గురి అయ్యింది. దేశంలోని పలు రకాల నగరాలలో నిరసనలు వ్యక్తం చేసారు మరియు దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేసారు.
శిల్పా శెట్టి మాత్రం రిచర్డ్ కి ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలియదని చెప్పారు. బయటి దేశం నుంచి వచ్చిన వారిని ఇలా టార్గెట్ చేయవద్దని వేడుకున్నారు.
సినిమాల తరవాత శిల్పాశెట్టి :
Phirmilenge సినిమా లో HIV భాదితురాలుగా చేసిన తరవాత తనకు ఈ పాత్ర చాలా బాగా నచ్చిందని హెచ్ఐవి-ఎయిడ్స్ భాదితుల కోసం చారిటీ చేయటం మొదలు పెట్టారు.
సినిమాలలో తన కెరీర్ ను పూర్తి చేసుకున్న తర్వాత టీవీ షో లలో జడ్జి గా చేయటం మొదలుపెట్టారు. Jhalak Dikhhla Jaa ,Nach Baliye, Super Dancer లాంటి టీవీ షో లలో జడ్జి గా చేయటం మొదలుపెట్టారు.
శిల్పా శెట్టి భర్త ఒక వ్యాపారవేత్త గా కావటం వళ్ళ ఇద్దరూ ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ యొక్క యజమానులుగా ఉన్నారు.
శిల్పా శెట్టి ఇటీవలి కాలంలో తన యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించారు. ఈ ఛానల్ లో వివిధ రకాలైన వంటలు చేస్తారు.
శిల్పా శెట్టి కుటుంబం:
శిల్పా శెట్టి తాను సినిమాలు చేసే సమయంలో తన సహా నటుడు అయిన అక్షయ్ కుమార్ తో ప్రేమలో పాడారు. ఈ ఇద్దరు మీడియా లో కూడా తమ సంబంధం గురించి కూడా చెప్పారు కానీ చివరికి వీళ్ళు విడిపోయారు.
2009 వ సంవత్సరంలో వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా తో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం. ఒక కొడుకు మరియు ఒక కూతురు.