రామ నాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తయారు చేసి తన పేరును గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగు లో అని కాకుండా 13 బాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామ నాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీదుగానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద హీరో.
సినిమాలే కాకుండా రాజకీయాలలో కూడా రామ నాయుడు పోటీ చేసారు. 1999 నుంచి 2004 వరకు MP గా కూడా ఉన్నారు.
Table of Contents
బాల్యం:
రామ నాయుడు 1936 వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే గ్రామంలో పుట్టారు. కాలేజీ చదువు చెన్నై లో పూర్తి చేసుకొని రైస్ మిల్ ఓనర్ గా బిజినెస్ ను మొదలు పెట్టారు.
ఈ వృత్తి ఇష్టం లేక ట్రావెల్ బిజినెస్ లో మరియు ఇటుకల బిజినెస్ లో ఇలా రెండు మూడు బిజినెస్ లు చేసిన తరవాత క్రమంగా తన నాన్న వాళ్ళ సినిమాల లోకి రావటం జరిగింది. రామ నాయుడు నాన్న నమ్మిన బంటు అనే సినిమాకి నిర్మాతగా చేయటం మరియు రామ నాయుడు తెలుగు కళాకారులను తరచూ కలవటం కూడా తన ఆసక్తి సినిమాల వైపు మళ్లింది.
సినిమా జీవితం :
రామ నాయుడు మొదట్లో తన స్నేహితులతో కలిసి ఒక సినిమాను తయారు చేశారు కానీ అది అంతగా విజయవంతం కాలేదు. 1964 వ సంవత్సరంలో తన పెద్ద కొడుకు సురేష్ మీదుగా సురేష్ ప్రొడక్షన్స్ ను మొదలు పెట్టారు.
1971 లో తీసిన సినిమా ప్రేమ్ నగర్ అనే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు మరియు వాణిశ్రీ నటించారు. ఈ సినిమాను తమిళ్ మరియు హిందీ భాషలలో కూడా డబ్ చేయటం జరిగింది.
ఆ రోజులలో స్టూడియో లు మద్రాస్ లో ఉండేవి. రామానాయుడు మొదటి సరిగా హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ ను ప్రారంభించారు.
ఒకటి తర్వాత మరొకటి ఇలా 13 భాషలలో రామానాయుడు తీసిన సినిమాలకు గాను 2008 లో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో తన చోటు ను దక్కించుకున్నారు.
రామ నాయుడు కుటుంబం :
రామ నాయుడు కి ముగ్గురు సంతానం. దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ దగ్గుబాటి మరియు లక్ష్మి దగ్గుబాటి. రానా దగ్గుబాటి మరియు నాగ చైతన్య రామానాయుడికి మనవళ్ళు అవుతారు. 2012 వ సంవత్సరంలో రామ నాయుడి కి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు తో సత్కరించింది .
మరణం:
రామానాయుడు గారికి 2014 లో ప్రోస్టేట్ కాన్సర్ ఉంది అని తేలింది. 2015 వ సంవత్సరంలో హైదేరాబద్ లో తన తుదిశ్వాస విడిచారు.