Table of Contents
నర్గిస్ బాల్యం :
నర్గిస్ పంజాబ్ కు చెందిన ఒక ముస్లిమ్ కుటుంబంలో అబ్దుల్ రషీద్, జద్దన్ బాయి హుస్సేన్ అనే దంపతులకు జూన్ 1, 1929 సంవత్సరంలో జన్మించటం జరిగింది. నర్గిస్ తల్లి తండ్రులు ఇద్దరు కూడా హిందువులే కానీ ఇస్లాం మతంలో మారటం జరిగింది. నర్గిస్ పుట్టినప్పుడు తనకు పెట్టిన అసలు పేరు ఫాతిమా రషీద్ కానీ సినిమాలలోకి వచ్చిన తరవాత తన పేరును నర్గిస్ గా మార్చటం జరిగింది.
ఇండియన్ సినిమా ప్రారంభంలో నర్గిస్ తల్లి మ్యూజిక్ కంపోజర్, డాన్సర్, నటి గా తమ కెరీర్ ను ప్రారంభించారు. బహుశా తన తల్లి వళ్ళ నర్గిస్ సినిమా ఇండస్ట్రీ లోకి రావటం జరిగింది.
నర్గిస్ తన కెరీర్ ను 1935 లో ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు తలాషే ఇష్క్ అనే సినిమా నుంచి ప్రారంభించారు. ఆ సమయంలో తనను “బేబీ నర్గిస్” అని పిలవటం మొదలు పెట్టారు కానీ అదే పేరు తరవాత తన స్టేజి పేరు గా మారింది.
నర్గిస్ కెరీర్ :
నర్గిస్ Barsaat (1949), Andaz (1949), Jogan (1950), Awaara (1951), Deedar (1951), Anhonee (1952), Shree 420 (1955), and Chori Chori (1956) లాంటి చాలా హిట్ బాలీవుడ్ సినిమాలలో నటించి చాలా మంచి గుర్తింపు పొందారు. 1957 లో నర్గిస్ నటించిన “మదర్ ఇండియా” సినిమాకు గాను ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది .
నర్గిస్ వ్యక్తిగత జీవితం :
నర్గిస్ తన నటించే సమయంలో రాజ్ కపూర్ హీరో తో ప్రేమలో పడ్డారు. రాజ్ కపూర్ అప్పట్లో చాలా పెద్ద హీరో, వీరిద్దరూ దాదాపు 9 సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నర్గిస్ తనను పెళ్లిచేసుకోమని అడిగారు కానీ రాజ్ కపూర్ తన భార్య పిల్లలను వదిలేయటం ఇష్టం లేక నర్గిస్ తో పెళ్ళికి ఒప్పుకోలేదు.
రాజ్ కపూర్ తన భార్యకు విడాకులు ఇవ్వను అని తేల్చి చెప్పిన తరవాత నర్గిస్ రాజ్ కపూర్ తో తన 9 సంవత్సరాల సంభందాన్ని ముగించారు.
11 మార్చి 1951 లో నర్గిస్ నటుడు సునీల్ దత్ ను పెళ్లిచేసుకుంది. పెళ్లిచేసుకొనే ముందు నర్గిస్ ఇస్లాం నుంచి హిందూ మతం లోకి మారారు. ఈ ఇద్దరి దంపతులకి సంజయ్, నమ్రత, ప్రియా అనే ముగ్గురి సంతానం కలిగింది.
సంజయ్ దత్ మాత్రం తరవాత ఒక పెద్ద హీరో గా మారటం జరిగింది. ప్రియా దత్ ఒక రాజకీయ నాయకురాలుగా ఎన్నుకోబడ్డారు.
తన పెళ్లి తరవాత Ajanta Arts Cultural Troupe అనే సంస్థ ను తయారు చేసారు. ఈ సంస్థలో చాలా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు ఈ సంస్థ లో చేరారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం భారత్ దేశ ఆర్మీ ఉండే మారుమూల ప్రదేశాలలో వెళ్లి నటి నటులు ప్రదర్శించి వారిని వినోదాన్ని చేకూర్చేవారు.
మరణం:
1980 లో నర్గిస్ కు pancreatic కాన్సర్ ఉందని తేలింది. మొదట తనకు న్యూయార్క్ లోని ఒక ఆసుపత్రి లో చికిత్స చేయటం జరిగింది తరవాత ముంబై లోని ఒక ఆసుపత్రి లో చేర్చటం జరిగింది.
2 మే 1981 సంవత్సరంలో నర్గిస్ కోమా లోకి వెళ్ళటం జరిగింది ఆ మరుసటి రోజు 3 మే 1981 రోజున మరణించడం జరిగింది. నర్గిస్ ను మరీన్ లైన్స్ ముంబై లోని Badakabarastan లో ఖననం చేయటం జరిగింది.
సంజయ్ దత్ 7 May 1981 లో తన మూవీ ప్రీమియర్ లో నర్గిస్ గారు లేకపోయినా ఒక కుర్చీ తన కోసం ఖాళీ గా ఉంచారు.
సునీల్ దత్ నర్గిస్ గారి జ్ఞాపకర్తం The Nargis Dutt Memorial Cancer Foundation ను కూడా ప్రారంభించటం జరిగింది.