Nandamuri Balakrishna biography in Telugu – నందమూరి బాలకృష్ణ జీవిత చరిత్ర

Nandamuri Balakrishna quick bio

NameNandamuri Balakrishna
Age10 June 1960 (59)
ParentsN.T. Rama Rao, Basavatarakam
WifeVasundhara Devi
Children3 (Brahmani Nandamuri,Mokshagna Teja, Tejaswini Nandamuri)

నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి నటుడిగా మరియు రాజకీయ నాయకుడిగా పరిగణించ బడుతారు. ప్రముఖ నటుడు ముఖ్యమంత్రి  N. T. Rama Rao గారి పన్నెండు మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు. చిన్న తనం నుంచే సినిమాల లోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికి 100 కన్న ఎక్కువ సినిమాలలో నటించారు. 

బాల్యం : 

బాలకృష్ణ 1960 వ సంవత్సరంలో N. T. Rama Rao మరియు బసవతారకం అనే దంపతులకు తమిళనాడు లోని చెన్నై లో జన్మించారు. తన యవ్వనంలో తమిళనాడు వదిలి హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్ లోనే తన చదువును ముగించడం జరిగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మొదలవడం ప్రరారంభమైంది. 

సినిమాలలో బాలకృష్ణ : 

1974 వ సంవత్సరంలో 14 సంవత్సరాల వయస్సులో “తాతమ్మ కల” అనే సినిమాలో బాలకృష్ణ బాల కళాకారుడి గా తన కెరీర్ ను ప్రారంభించారు. 16 సంవత్సరాల వయస్సులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984 లో సాహసమే జీవితం  అనే సినిమాలో మొట్ట మొదటి సారిగా హీరో గా నటించడం జరిగింది.  

బాలక్రిష్ణ తన కెరీర్ పారరంభంలో నటించిన సినిమాలలో సాహసమే జీవితం, జనని జన్మభూమి, మంగమ్మగారి మనవడు, అపూర్వ సహోదరుడు, మువ్వా గోపాలుడు, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి అనే సినిమాలు విజయవంత మయ్యాయి. 

తెలుగులో మొట్ట మొదటి సారిగా తీసిన సై ఫై  సినిమా ఆదిత్య 369 లో బాలక్రిష్ణ పాత్రను మరియు కథను చాలా మంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలా వరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు.  

2019 వ సంవత్సరంలో  N T రామరావు గారి బయోగ్రఫీ N.T.R: Mahanayakudu

సినిమాలో తన తండ్రి పాత్రను పోషించారు. 

రాజకీయ జీవితం : 

2014 సంవత్సరంలో రాజకీయాలలోకి ప్రవేశించిన బాలక్రిష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేసి MLA గా గెలిచారు. 

బాలక్రిష్ణ బెల్లం కొండా  వివాదం: 

2004  వ సంవత్సరంలో జూన్ 3 న తన హైదరాబాద్ ఇంట్లో బాలక్రిష్ణ బెల్లం కొండా సురేష్ మరియు తన అనుచరుడి పై కాల్పులు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. 

బాలకృష్ణ మరియు బెల్లం కొండా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వివాదం చోటు చేసుకుంది అని మీడియా వర్గాలు తెలిపాయి. 

బెల్లం కొండా  మొదట కోర్ట్ లో బాలక్రిష్ణ తమ పై కాల్పులు జరిపారని చెప్పారు కానీ తరవాత తమ ఫిర్యాదు ని వాపసు తీసుకొన్నారు.    

బాలక్రిష్ణ చేసే వ్యాఖ్యలు మరియు దురుసు ప్రవర్తన వళ్ళ కూడా వార్తలలో ఉంటూ ఉంటారు.  

Leave a Comment