Microsoft Success story in Telugu – మైక్రో సాఫ్ట్ సక్సెస్ స్టోరీ

ప్రపంచం మొత్తం లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో ఏమో కానీ దాదాపు అన్ని కంప్యూటర్లలో ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఉంటుంది. లెక్కల ప్రకారం 70% కంప్యూటర్ లు విండోస్ వినియోగిస్తే 13 % ఆపిల్ ఆపరేటింగ్ సిస్టం ను వినియోగిస్తారు. ఇంతలా విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎలా పాపులర్ అయ్యింది.   

మైక్రో సాఫ్ట్ ఎలా మొదలైంది ? 

బిల్ గేట్స్ , పాల్ అల్లెన్ చిన్న నాటి స్నేహితులు వీరిద్దరూ తమ వద్ద ఉన్న ప్రోగ్రామింగ్ తెలివి తేటలను వినియోగించాలని నిర్ణయించుకున్నారు. 1972 వ సంవత్సరంలో Traf-O-Data అనే ట్రాఫిక్ కి సంభందించిన డేటా ను జమ చేయడానికి ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసారు. 

మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ (Bill gates) మరియు పాల్ అల్లెన్ (Paul Allen) ఏప్రిల్ 4 ,1975 సంవత్సరంలో న్యూ మెక్సికో లో కనుగొన్నారు.

1974 సంవత్సరంలో పాల్ అల్లెన్ హానీ వెల్ అనే కంపెనీ లో ఒక ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నప్పుడు పాపులర్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక పత్రిక లో Altair 8800 అనే ఒక మైక్రో కంప్యూటర్ గురించి ప్రకటనను చూసాడు. అల్లెన్ ఇది చుసిన వెంటనే ఆ పత్రికను కొని హార్వర్డ్ కాలేజీ లో చదువుతున్న తన స్నేహితుడు బిల్ గేట్స్ కి చూపించాడు. ఈ మైక్రో కంప్యూటర్ కు BASIC అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను అమలు పరచాలని నిర్ణయించుకున్నారు.   

గేట్స్ Altair మైక్రో కంప్యూటర్ ను తయారు చేసిన (Micro Instrumentation and Telemetry Systems ) MITS కంపెనీ ను సంప్రదించి తాము BASIC ప్రోగ్రామింగ్ ను అల్టాయిర్ లో ఇంప్లీమెంట్ చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. చివరికి ఈ డీల్ సక్సెస్ కావటం అల్టాయిర్ మైక్రో కంప్యూటర్ BASIC అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో Altair BASIC తయారు చేయబడింది. ఇలా గేట్స్ మరియు అల్లెన్ కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థకు పునాదులు వేసారు.  

మైక్రో సాఫ్ట్ ను కనుగొనాలని అనుకున్నప్పుడు ఒక మంచి పేరు ఈ కంపెనీ కి పెట్టాలని అనుకున్నారు. అల్లెన్ Micro computer నుంచి “Micro” ను software నుంచి “Soft”  ను తీసుకోని “MICROSOFT” అనే కంపెనీ ను మొదలుపెట్టారు.

1977 సంవత్సరంలో మొదటి సారిగా తమ ఇంటర్నేషనల్ ఆఫీసు “ASCII Microsoft” ను జపాన్ లో ప్రారంభించారు. 1979 లో US లోని వాషింగ్టన్ కు తమ ఆఫీసు ను మార్చారు. 

మైక్రోసాఫ్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను Applesoft BASIC మరియు IBM PC ల కోసం వినియోగించబడింది.            

మైక్రో సాఫ్ట్ ఎదుగుదల : 

1981 వ సంవత్సరంలో  Seattle Computer Products అనే  సంస్థ నుంచి QDOS అనే ఆపరేటింగ్ సిస్టం రైట్స్ కొనుగోలు చేసింది, ఇదే తరవాత MS- DOS గా మారింది. ఈ ఆపరేటింగ్ సిస్టం ను IBM Personal Computer కోసం వినియోగించారు.

1983 లో మైక్రో సాఫ్ట్ వర్డ్ ను ప్రకటించడం జరిగింది. 1985 లో Microsoft  Excel ను విడుదల చేసిన తరవాత అప్పట్లో చాలా ప్రసిద్ధి లో ఉన్న IBM యొక్క Lotus 1-2-3  ను అధిగమించింది. Lotus 1-2-3 కూడా ఎక్సెల్ తరహా లోనే ఉండేది.   

1990 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ అత్యధికంగా ప్రాచుర్యం లో ఉన్న Microsoft Office ను విడుదల చేసారు.

1995 సంవత్సరం నాటికీ విండోస్ ను మైక్రో సాఫ్ట్ క్రమ క్రమంగా అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. 1985 నుంచి 1995 మధ్య పది సంవత్సరాల వ్యవధి లో Windows 1.౦,Windows 2.03, Windows 3.0, Windows 3.1, Windows NT 3.1, Windows NT 3.5,Windows NT 3.51, Windows 95 అనే ఆపరేటింగ్ సిస్టం లను తయారు చేసింది. 

1997 వ సంవత్సరంలో ఆపిల్ ఆపరేటింగ్ సిస్టం Macintosh లో Internet Explorer ను డిఫాల్ట్ బ్రౌసర్ గా ఉంచడానికి ఆపిల్ కంపెనీ తో మైక్రో సాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని కొన్ని చిన్న మార్పులను చేస్తూ విండోస్ ని అభివృద్ధి చేయసాగింది.  

2001 లో విండోస్ లో బాగా ప్రఖ్యాతి చెందిన Windows XP రిలీజ్ చేయడం జరిగింది. 2007 వ సంవత్సరంలో Windows Vista ను, 2009 వ సంవత్సరంలో Windows 7 ను రిలీజ్ చేయటం జరిగింది.    

2009 వ సంవత్సరంలో “బింగ్ (BING)” సెర్చ్ ఇంజిన్ ను 2010 లో విండోస్ ఫోన్    లాంచ్ చేసింది. 

2015 వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ Windows 7, Windows 8.1 or Windows Phone 8.1, Windows 10  ను లాంచ్ చేసింది. 

2019 వ సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (Internet Explorer) ను  Microsoft Edge తో బదిలీ చేయటం జరిగింది. 

బిల్ గేట్స్ , పాల్ అల్లెన్ :

మైక్రో సాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడి గా పేరు తెచ్చుకున్నారు. పాల్ అల్లెన్ దురదృష్ట వశాత్తు తనకు ఎంతో కాలంగా వేధిస్తున్న కాన్సర్ జబ్బు మరియు అనారోగ్యం కారణంగా మైక్రో సాఫ్ట్ లో తన ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయారు. ఫలితంగా 2018 సంవత్సరంలో మృతి చెందారు.

Source: Microsoft – Wikipedia

Leave a Comment