Table of Contents
కరుణానిధి ఎవరు ?
కరుణానిధి తమిళనాడు కి చెందిన రచయిత, రాజకీయ నాయకుడు. రాజకీయాలలోకి రాక ముందు చాలా సినిమాలకు రచయితగా ఉన్నారు. రాజకీయాలలోకి ప్రవేశించిన తరవాత దాదాపు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 20 సంవత్సరాలు తమిళ పరాజయాలకు ముఖ్యమంత్రిగా సేవలను అందించారు.
ద్రావిడ ఉద్యమమునకు నాయకుడిగా ఉన్నారు. కరుణానిధి ఒక నాస్తికుడు, మతాలలో మరియు దేవుడిలో నమ్మకం లేదు. తమిళ లిటరేచర్ కు కూడా చాలా సహాయం చేసారు. అందుకే కరుణానిధి “kalaignar” (కళాకారుడు) అనే పేరుతో చాలా ప్రసిద్ధి చెందారు.
కరుణానిధి బాల్యం :
కరుణానిధి 3 జూన్ 1924 వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ లో నాగపట్టినం జిల్లా తిరుక్కువలై అనే గ్రామంలో జన్మిచారు. తానూ రాసిన రచనలలో తన కుటుంబం సంగీత వాయిద్యాలను వాయించే దేవదాసి అనే చిన్న కులం వారు అని పేర్కొన్నారు.
ప్రభుత్వం హిందీ భాష తప్పకుండ స్కూల్ లో ఉండాలని చెప్పినప్పుడు 15 సంవత్సరాల కరుణానిధి గారు హిందీ భాషకు వ్యతిరేకంగా నిరసనలు చేయటం జరిగింది. అంతేకాకుండా తన చేతితో రాసిన Manava Nesan అనే వార్తా పత్రికను తన స్నేహితుల గ్రూప్ లలో షేర్ చేయటం మొదలుపెట్టారు. తరవాత ఇదే మురసోలి అనే వార్తా పత్రికగా మారింది.
సినిమా జీవితం:
కరుణానిధి తన మొదటి రచయితగా రాసిన మొట్ట మొదటి సినిమా రాజకుమారి. ఈ సినిమాలో ఎం.జి రామచరణ్ గారు నటుడిగా ఉన్నారు. ఆ సమయంలో కరుణానిధి కలిసి పనిచేసినా తరవాత రామచరణ్ గారు AIADMK అనే పార్టీ ని స్థాపించిన తరవాత కరుణానిధి ప్రత్యర్థి గా మారారు.
కరుణానిధి గారు రచయితగా రాసిన కథలలో పరాశక్తి (Parasakthi) అనే తమిళ సినిమా చాలా వివాదాలకు గురి అయ్యింది. ఈ సినిమా లో బ్రాహ్మణులను చిన్నగా చూపించారని, ఒక పూజారి మందిరంలో ఒక మహిళ పై అత్యాచారానికి పాల్పడుతున్న దృశ్యాలు ఉన్నాయని చాలా మంది హిందువులు సినిమాను విడుదల కానివ్వలేదు.
రాజకీయ జీవితం:
14 సంవత్సరాల నుంచి రాజాకీయాలలోకి కరుణానిధి గారు రావటం జరిగింది. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగే నిరసనాలలో పాల్గొని ఒక స్టూడెంట్ వింగ్ ను తయారు చేసారు.
కల్లకూడి ఆందోళన లో కరుణానిధి పాల్గొన్న తరవాత తమిళ రాజకీయాలలో తన స్థానాన్ని గట్టి పరచుకున్నాడు. ఈ ఆందోళన కళ్లకుడి పేరును దాల్మియాపురంగా మార్చినందుకు జరిగింది.
దాల్మియాపురం నుంచి మళ్ళీ కళ్లకుడి కి మార్చమని రైల్వే స్టేషన్ లో దాల్మియా పురం గా ఉన్న బోర్డు ను చెరిపేసి రైలు పట్టాల మీద పడుకున్నారు. ఈ ఆందోళనలో ఇద్దరు చనిపోగా కరుణానిధిని అరెస్ట్ చేసారు. ఈ పేరు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించిన తరవాత మార్చినందు వళ్ళ ఈ ఆందోళనలు మొదలు అయ్యాయి.
1967 వ సంవత్సరంలో DMK పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత కరుణానిధి కి మంత్రి పదవి ఇచ్చారు.1969 లో అప్పటి ముఖ్యమంత్రి Annadurai చనిపోయిన తరవాత మొదటిసారిగా కరుణానిధి గారు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు.
1970 లో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు మొత్తం ఇండియా లో ఒక DMK పార్టీనే ఎమర్జెన్సీని వ్యతిరేకించింది.
మరణం :
2016 సంవత్సరం నుంచి కరుణానిధి ఆరోగ్యం క్షిణించటం జరిగింది. రాయకీయ పనులు కూడా తగ్గించారు. 28 జులై 2018 లో ఆరోగ్యం బాగా క్షిణించటం వళ్ళ హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. 7 ఆగస్ట్ 2018 న కరుణానిధి గారు మరణించారు. తమిళనాడు ప్రభుత్వం 8 ఆగస్ట్ 2018 న సెలవు గా ప్రకటించారు.