హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర (Helen Keller biography in Telugu)

హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర తెలుసుకునే ముందు తాను సాధించిన కొన్ని లక్ష్యాల గురించి మరియు ఆమె ఎందుకని ఇంతలా గోప్ప వ్యక్తిగా పరిగణించ బడుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాము.

హెలెన్ కెల్లర్ అమెరికా కు చెందిన రచయిత మరియు రాజకీయ కార్యకర్త. కెల్లర్ బాచిలర్ అఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ సంపాదించిన మొదటి చెవిటి,అంధురాలిగా చరిత్రలో నిలిచిపోయింది.

హెలెన్ కెల్లెర్ బాల్యం :

 హెలెన్ కెల్లర్ జూన్ 27, 1880 లో జన్మించారు. హెలెన్ కు నలుగురు అన్న తమ్ముళ్లు, ఈ నలుగురిలో ఇద్దరు సొంత తమ్ముళ్లు మరియు మిగతా ఇద్దరు వారి నాన్నకు మొదటి పెళ్లి లో పుట్టిన వారు.

హెలెన్ కెల్లెర్ తండ్రి అమెరికన్ ఆర్మీ లో కెప్టెన్ గా పనిచేసాడు. ఆ తరవాత టూస్క్యూఎంబీయే (Tuscumbia) లో North Alabamian అనే వార్త పత్రికలో ఎడిటర్ గా కూడా పనిచేసాడు. కెల్లెర్ తల్లి కూడా అమెరికన్ ఆర్మీ జనరల్ కూతురు, కెల్లెర్ జీవితంలో ని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన తండ్రి వంశంలోనే ఒకరు మొదటి సారిగా చెవిటి పిల్లలకు టీచర్ గా కూడా పాఠాలు చెప్పేవారు. బహుశా అదే విషయం కెల్లెర్ ని ప్రభావితం చేసింది.

హెలెన్ కెల్లెర్ జీవితంలో విషాదం: 

హెలెన్ కెల్లెర్ ఏడాదిన్నర సంవత్సరంలో ఉన్నప్పుడు తాను ఒక వింత రోగం బారిన పడింది. ఈ జబ్బు ముఖ్యంగా కెల్లెర్ కడుపు,మెదడు ని బాగా దెబ్బతీసింది ఫలితంగా కెల్లెర్ చెవిటి మరియు అంధురాలిగా మారిపోయింది. 

కెల్లెర్ తనకి ఎదురైనా ఈ పరిస్థితిని తన జీవిత చరిత్రలో ” at sea in a dense fog ” (దట్టమైన పొగమంచులలో ఉన్న సముద్రం) గా వర్ణించింది.

కెల్లెర్ ఆరు సంవత్సరాల నుంచి సైగలతో మాట్లాడటం ప్రారంభించింది. ఇంతే కాకుండా ఎదుటివారు చేసే శబ్దాలని వారు వచ్చే తీరు ని గమనించి వాళ్ళు ఎవరు అనేది గుర్తు పట్టేది. 

కెల్లెర్ తల్లి తన ఈ పరిస్థితిని చూసి తనని ఒక మంచి వైద్యుడి కి చూపించాలని నిర్ణయించుకుంది. 1886 లో కెల్లెర్ తన తండ్రి తో పాటు కలిసి బాల్టిమోర్ (Baltimore) లోని ENT స్పెషలిస్ట్ జే. జూలియన్  చిసోల్మ్ (J. Julian Chisolm ) వద్దకు వెళ్లారు, జూలియన్ చిసోల్మ్ అలెగ్జాండర్ గ్రహంబెల్ ని  కలవమని సలహా ఇచ్చాడు . 

అలెగ్జాండర్ గ్రాహంబెల్ సలహా :   

అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ని కనుగొన్నది దాదాపు అందరికి తెలిసిందే, టెలిఫోన్ కనుగొనక ముందు గ్రహంబెల్ కూడా చెవిటి పిల్లలకు భోధించేవాడు. 

గ్రహంబెల్ కెల్లెర్ ని పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్  ఫర్ ద బ్లైండ్ (Perkins Institute for the Blind)  లో చేర్పించమని సలహా ఇచ్చాడు. కెల్లెర్ ఆ స్కూల్ లో చేరిన తరవాత ఆ స్కూల్ యొక్క డైరెక్టర్ అదే స్కూల్ లో చదువుతున్న 20 సంవత్సరాల అన్నీసల్లివన్ (Anne Sullivan) ని కెల్లెర్ ని భోదించమని అడిగాడు.

అన్నీసల్లివన్ :

అన్నీ సల్లివన్ కెల్లెర్ ను చదివంచడానికి ఒప్పుకుంది. 1887 నుండి సల్లివన్ కెల్లెర్ ను చేతి సైగలతో ఎలా ఎదుటివారితో ఎలా మాట్లాడాలి  అని బోధించడం మొదలుపెట్టింది. ప్రారంభంలో కెల్లెర్ కు చేతి సైగలతో మాట్లాడటం చాలా కష్టంగా అనిపించింది కానీ క్రమ క్రమంగా అలవాటు చేసుకుంది. 

అన్ని సల్లివన్ కెల్లర్ ని నేర్పించడమే కాకుండా తనకు ఎల్లప్పుడూ తోడుగా కూడా ఉండేది. సల్లివన్ వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం బాగా క్షిణించింది. 1936 సంవత్సరంలో సుల్లివాన్ కోమా లో కి వెళ్ళిపోయింది, తన చివరి క్షణాలలో తన చేతులు కెల్లర్ పట్టుకొని ఉన్నప్పుడు సల్లివన్ చనిపోయింది.  

విద్యాభ్యాసం:

కెల్లెర్ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ లో 1888 లో చేరి విద్యాభ్యాసం ప్రారంభించింది.1894 లో కెల్లెర్ న్యూయార్క్ లోని  Wright-Humason School for the Deaf లో చేరింది. ఆ తరవాత Sarah Fuller అనే టీచర్ వద్ద నేర్చుకోవడానికి Horace Mann School for the Deaf లో చేరింది. 1900 సంవత్సరంలో కెల్లెర్  Radcliffe College కాలేజీ లో చదివేటప్పుడు, Henry Huttleston Rogers కెల్లెర్ చదువు కు సంభందించిన ఖర్చులు తానే భరించాడు. 

ఇదే కాలేజీ నుండి మొట్ట మొదటి సారిగా Bachelor of Arts degree సంపాదించిన చెవిటి, అంధ మహిళ హెలెన్ కెల్లెర్.  

ఎదుటివారితో మాట్లాడటం కెల్లెర్ కి  చాలా ఇష్టం అందుకని చాలావరకు తన సమయాన్ని ప్రసంగాలలో, ఉపన్యాసాలలో గడిపేది.  

రాజకీయ జీవితం:

కెల్లర్ తన రాజకీయ జీవితం కూడా అంధుల సేవ గురించి  అంకితం చేసింది. హెలెన్ కెల్లెర్ 25 దేశాల అంధులను తన ప్రసంగాలతో ప్రభావితం చేసారు. ఇదే కాకుండా సల్లివన్ తో కలిసి 40 దేశాల పర్యనటన కూడా చేసింది. తన జీవితంలో  తాను చేసే మంచి పనుల వళ్ళ చాలా మంది ప్రముఖులు తనకు స్నేహితులుగా మారారు.    

కెల్లర్ సోషలిస్ట్ పార్టీ లో చేరి మహిళల హక్కుల గురించి  మరియు యుద్ధాల వళ్ళ కలిగే నష్టాల గురించి పోరాడింది, పెరుగుతున్న జనాభాని కూడా అదుపులో ఉంచాలని తానూ కోరేది.   

కెల్లర్ తన రాజకీయ జీవితం లో ఎలాగైతే ప్రసంగాలు చేసి మెప్పు పొందిందో అలాగే తను 12 పుస్తకాలు వేరు వేరు అంశాల పై రాసింది.

గౌరవ పురస్కరాలు :

ఇండియా లోని మైసూర్ లో హెలెన్ కెల్లెర్ జ్ఞాపకర్తం గా  All India Institute of Speech and Hearing ను నిర్మిచడం జరిగింది.  హాస్పిటల్స్ మరియు వీధుల పేర్లు హెలెన్ కెల్లర్ పేరు మీదుగా పెట్టడం జరిగింది. 1973 లో National Women’s Hall of Fame లో తన పేరుని చేర్చడం జరిగింది. 1980 నాటికి కెల్లెర్ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో  United States Postal Service కెల్లర్ పేరు మీద స్టాంప్ కూడా జారీ చేసారు.  

మరణం : 

1961 సంవత్సరంలో పలుమార్లు గుండెపోటు బారిన పడ్డారు. జూన్ 1,1968 సంవత్సరంలో ఇంట్లోనే  నిద్రలోనే మరణించారు.

2 thoughts on “హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర (Helen Keller biography in Telugu)”

Leave a Comment