ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో సుందర్ పిచాయి ఒకరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టి పెరిగినా చదువులో ఎప్పుడు ముందుండే వారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరవాత గూగుల్ కంపెనీ లో చేరారు.
సుందర్ పిచాయ్ గూగుల్ లో పనిచేసేటప్పుడు గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ ను అభివృద్ధి చేయటంలో సహాయం చేసారు.
వీరి ప్రతిభను చూసి గూగుల్ CEO గా నియమించటం జరిగింది. సిలికాన్ వ్యాలీ లో సుందర్ పిచాయి ను అందరు నైస్ గాయ్ (మంచి వ్యక్తి ) అని అంటారు. కంపెనీ లో పనిచేసే విధానం ఒక ఫన్ వే లో ఉండాలి అని సుందర్ పిచాయి భావిస్తారు.
బాల్యం :
సుందర్ పిచాయ్ 1972 వ సంవత్సరంలో జూన్ 10 న తమిళనాడు లోని చెన్నై లో లక్ష్మి మరియు రఘునాత పిచాయ్ అనే దంపతులకు పుట్టారు. 10 వ తరగతి మరియు క్లాస్ 12 ను చెన్నై లోనే పూర్తి చేసుకున్నారు.
పిచాయ్ తన గ్రాడ్యుయేషన్ ను ఐఐటీ ఖరగపూర్ లో పూర్తి చేసారు. గ్రాడ్యుయేషన్ తరవాత స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ఎం.స్ (MS) ను మరియు పెన్సిల్ వేనియా లో MBA ను చదివారు.
కెరీర్ :
- సుందర్ పిచాయ్ తన చదువు పూర్తి అయిన తరవాత మెకిన్సే & కంపెనీ (McKinsey & Company) లో కన్సల్టెంట్ గా పనిచేసారు.
- 2004 వ సంవత్సరంలో పిచాయ్ గూగుల్ లో చేరారు. గూగుల్ లో చేరిన తరవాత పిచాయ్ గూగుల్ కి సంబంధించిన గూగుల్ క్రోమ్ మరియు గూగుల్ డ్రైవ్ లాంటి పలు సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ లలో పనిచేయటం ప్రారంభించారు.
- 20012 సంవత్సరంలో పిచాయి నాయకత్వంలో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం ను విడుదలను చేయటం జరిగింది.
- 2013 వ సంవత్సరంలో సుందర్ పిచాయి స్మార్ట్ ఫోన్ ల యొక్క ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ ను యొక్క అభివృద్ధి చేయటం ప్రారంభించారు.
- 2015 వ సంవత్సరం వరకు గూగుల్ CEO గా లారి పేజీ ఉన్నారు, లారీ పేజీ తరవాత సుందర్ పిచాయి ను CEO గా నియమించటం జరిగింది.
- 2019 వ సంవత్సరంలో సుందర్ పిచాయి గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ యొక్క CEO గా కూడా నియమించబడ్డారు.
వ్యక్తిగత జీవితం :
సుందర్ పిచాయి అంజలి ని పెళ్లి చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుందర్ పిచాయ్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చిన్నపుడు క్రికెట్ టీం కి కెప్టెన్ గా కూడా ఉన్నారు.
సుందర్ పిచాయ్ ఒకసారి ఇంటర్వ్యూ లో మీ దినచర్య రోజు ఎలా ఉంటుందని అడగగా కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలిపారు.
సుందర్ పిచాయ్ రోజు ఉదయం 6:30 నుంచి 7 గంటలప్పుడు మేల్కొంటారు.
ఛాయ్ తాగుతూ న్యూస్ పేపర్ ని చదువుతూ రోజుని ప్రారంభిస్తారు.
సుందర్ పిచాయ్ నేను మార్నింగ్ పర్సన్ కాను నేను ఉదయం వ్యాయామం చేయకుండా సాయంత్రం చేస్తాను అని తెలిపారు .