గుజరాత్ లోని ఒక కుటుంబం లో జన్మించిన పటేల్ గారు చిన్న తనంలో చదువు అంత బాగా చదవక పోయిన లాయర్ అవ్వాలనే తమ కోరికను బాగా చదివి పూర్తిచేసుకున్నారు. పటేల్ జీవితంలో ఏమి సాధించలేరు అని అనుకున్న తమ కుటుంబసభ్యుల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఒక మంచి లాయర్ గా గుజరాత్ లో పేరు పొందారు.
లాయర్ అయిన తరవాత మెల్లగా రాజకీయాలలోకి ప్రవేశించిన పటేల్ గారు గాంధీజీ తో కలిసి పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.
దేశ విభజన సమయంలో కూడా అల్లర్లు జరగకుండా ఉండేవిధంగా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే వారికి వసతులు కలిగించడంలో ముఖ్య పాత్రను వహించారు.
Table of Contents
బాల్యం :
సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గుజరాత్ లోని నడియాడ్ పట్టణంలో ఝావేర్ భాయి పటేల్ మరియు లాడ్బా అనే దంపతులకు పుట్టారు. ఆరుగురి సంతానంలో పటేల్ గారు ఒకరు. చిన్నప్పటి నుంచే పటేల్ గారు ధైర్యవంతులు.
చదువు :
చదువు అంత బాగా చదవక పోయిన ఎలాగైనా లాయర్ అవ్వాలన్నది పటేల్ గారి కోరిక. పటేల్ గారు ఇంటి నుంచి దూరంగా ఉంటూ ఇతర న్యాయవాదుల నుంచి పుస్తకాలు తీసుకోని సొంతంగా చదివే వారు. రెండు సంవత్సరాలలోనే పరీక్ష కూడా పాస్ అయ్యారు.
కొద్దిరోజులలోనే ఒక మంచి లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు, ఈ సమయంలోనే ఒక ప్లేగు వ్యాధి బారిన పడ్డారు. అందరికి దూరంగా ఉంటూ మెల్లగా కోలుకున్నారు.
36 సంవత్సరాలప్పుడు చదువుకోవడానికి ఇంగ్లాండ్ కూడా వెళతారు అక్కడ 36 నెలల కోర్స్ ని కేవలం 30 నెలల వ్యవధి లో పూర్తి చేసి ఒక మంచి పేరు గాంచిన న్యాయవాదిగా అహ్మదాబాద్ లో స్థిరపడ్డారు.
స్వాతంత్ర పోరాటం :
1917 వ సంవత్సరంలో పటేల్ గారు మొదటి సారి గాంధీజీ తో కలిసారు. గాంధీజి చేస్తున్న స్వాతంత్ర పోరాటంలో పటేల్ గారు కూడా సహాయం చేయటం మొదలుపెట్టారు. గుజరాత్ లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన గుజరాత్ సభ కు సెక్రటరీ గా ఎన్నుకోబడ్డారు.
కాంగ్రెస్ సహాయంతో పటేల్ గారు టాక్స్ లకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు. ఈ తిరుగుబాటులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కానీ ప్రభుత్వం చివరికి దిగివచ్చి ఒక సంవత్సరం మొత్తం టాక్స్ లు కట్టనవసరం లేదు అని తెలిపింది. ఈ తిరుగుబారు తరవాత భారతదేశం మొత్తం లో పటేల్ గారి పేరు వినిపించటం మొదలయ్యింది.
1920 వ సంవత్సరంలో పటేల్ గారి నేతృత్వంలో విదేశీ బట్టలను పెద్ద మొత్తంలో కాల్చారు. ఇంతకూ ముందు విదేశీ బట్టలు ధరించే పటేల్ గారు కూడా ఖాదీ బట్టలు ధరించటం మొదలుపెట్టారు. గుజరాత్ లో పటేల్ గారు అంటరానితనం, కుల వివక్షత, మద్యం మరియు ఆడవారి అభివృద్ధి లాంటి సమస్యలపై కూడా పనిచేయటం మొదలుపెట్టారు.
1930 వ సంవత్సరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న పటేల్ గారిని పోలీసులు అరెస్ట్ చేసారు. స్వాతంత్ర కోసం చేసే పోరాటంలో గాంధీజీ మరియు పటేల్ ఇంకా సన్నిహితులుగా మారారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ లా అహింస మార్గాన్ని ఎంచుకోక పోవటం వల్ల విభేదాలు రావటం మొదలయ్యాయి.
పటేల్ గారి అన్న విఠల్ భాయి చనిపోయేటప్పుడు తన ఆస్తి లో ఎక్కువ భాగం బోస్ గారికి ఇవ్వాలని, ఈ డబ్బు బోస్ గారు విదేశాలలో స్వాతంత్ర పోరాటం కోసం వినియోగించాలని తెలిపారు.
ఈ ఆస్తి విషయంలో కూడా పటేల్ గారికి మరియు బోస్ గారికి విభేదాలు రావటం జరిగింది.
ఇండియా పాకిస్తాన్ విభజన :
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్నప్పుడు ముహమ్మద్ అలీ జిన్నాహ్ ముస్లిం లకు ఒక ప్రత్యేక దేశం కావాలని నిరసనలు చేయటం మొదలుపెట్టారు. ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే రెండు సముదాయాల మధ్య అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పటేల్ గారు దేశ విభజనకు ఒప్పుకున్నారు.
దేశ విభజన జరిగే సమయంలో కూడా పటేల్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారతదేశం నుంచి వెళ్లే ముస్లిం లపై దాడి జరగకుండా ఉండే విధంగా మరియు పాకిస్తాన్ నుంచి హిందువులకు మరియు సిక్కులకు వసతులు కలిపించటానికి చాలా కృషి చేసారు. కొంతమంది పటేల్ గారికి వ్యతిరేకంగా వెళ్లినా కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా మారిన తరవాత కూడా దేశంలో 565 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలకి కూడా భారతదేశం యొక్క స్వాతంత్రం లో సహాయం చేయాలని పటేల్ కోరారు.
పాకిస్తాన్ కి దూరంగా ఉన్న రాజ్యాలైన జునాగఢ్ మరియు హైదరాబాద్ రాజ్యాలకు చెందిన రాజులు తమ రాజ్యాలను పాకిస్తాన్ లో కలుపుతాం అని చెప్పారు.
ఈ రెండు రాజ్యలలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండటం మరియు ఇక్కడ ఉండే ప్రజలు కూడా భారతదేశంలో ఉండేందుకు ఇష్టపడటం వల్ల భారతదేశం యొక్క ఆర్మీ సహాయం తో రెండు రాజ్యాలను భారతదేశం లో కలుపుకున్నారు. పటేల్ గారు చేసిన ఈ కృషికి గాను ఇండియా ను ఐక్యం చేసిన వ్యక్తి గా కొనియాడుతారు.
దేశానికి సివిల్ సర్వీసెస్ ఎంత ముఖ్యమో గ్రహించిన పటేల్ గారు అల్ ఇండియా సర్వీసెస్ ను ప్రారంభించారు. అందుకే పటేల్ గారిని అల్ ఇండియా సర్వీసెస్ పితామహుడిగా పరిగణిస్తారు.
గాంధీ గారిని చంపినా నాథురాం గాడ్ సే RSS కు చెందిన వాడని గ్రహించిన పటేల్ గారు RSS పై నిషదం విధించారు. తరవాత పటేల్ గారి చెప్పిన షరతులను అంగీకరించిన తరవాత నిషేధాన్ని తీసి వేయటం కూడా జరిగింది.
వ్యక్తిగత జీవితం :
పటేల్ గారు లాయర్ అయిన తరవాత ఝవెర్బా ను పెళ్లి చేసుకొని గోద్రా లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మణిబెన్ మరియు దహ్య భాయి అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.
పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే పటేల్ గారి భార్య కాన్సర్ బారిన పడ్డారు. ముంబై లోని హాస్పిటల్ లో సర్జరీ కూడా చేయటం జరిగింది, సర్జరీ విజయవంతమైన హాస్పిటల్ లోనే చనిపోయారు.
కోర్ట్ లో ఒక కేసు వాదిస్తున్న సమయంలో పటేల్ గారికి ఒక చిన్న పత్రం ద్వారా ఈ విషయం తెలియచేయబడింది. కేసు మొత్తం వాదించి గెలిచిన తరవాతే ఈ విషయం అందరికి చెప్పారు.
పిల్లలు చిన్న తనంలోనే తల్లి చనిపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, పటేల్ గారు మాత్రం రెండవ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. తన కుటుంబంలో ఉండే వారి సహాయం తో పిల్లల బాగోగులు చూసుకునేవారు.
మరణం :
పటేల్ గారి ఆరోగ్యం క్షిణించటం వల్ల మీటింగ్ లకి రావటం తగ్గించేవారు. 15 డిసెంబర్ 1950 వ సంవత్సరంలో ముంబై పట్టణంలో గుండెపోటు తో మరణించారు.
సర్దార్ వల్లభ్ భాయి పటేల్ దేశాన్ని ఐక్యంగా ఉంచటానికి చేసిన కృషి కి గాను అక్టోబర్ 31 న నేషనల్ యూనిటీ డే గా ఖరారు చేసారు. పటేల్ గారు భారత స్వాతంత్రం లో చేసిన కృషికి గాను ఐరన్ మాన్ అని కూడా బిరుసు ఇవ్వబడింది.
పటేల్ గారి జ్ఞాపకార్థం గుజరాత్ లోని వడోద్రా లో ప్రపంచం లోనే ఎత్తైన స్టాచ్యూ అఫ్ యూనిటీ విగ్రహాన్ని 31 అక్టోబర్ 2018 లో స్థాపించారు.