నీరజ్ చోప్రా జీవిత చరిత్ర – Neeraj chopra biography in Telugu

జన్మం 24 December 1997
వయస్సు 25 సంవత్సరాలు

నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం లోని, పానిపత్ జిల్లాలోని ఖంద్రా గ్రామంలో జన్మించారు.తన చదువు ను చండీగఢ్ లోని DAV కాలేజీ లో పూర్తి చేశారు.

2016 వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీ లో నాయబ్ సుబేదార్ ర్యాంక్ తో జూనియర్ కమిషనర్ ఆఫీసర్ గా నియమించబడ్డారు.

కెరీర్ :

జావెలిన్ త్రో (Javelin throw) లో నీరజ్ మొట్ట మొదటి సారిగా 2016 సౌత్ ఆసియన్ లో బంగారు పతాకాన్ని సంపాదించారు.

2016 వ సంవత్సరంలోనే పోలాండ్ లో జరిగిన 2016 IAAF World U20 ఛాంపియన్ షిప్ లో మళ్ళీ బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.

రెండు సార్లు బంగారు పతాకాన్ని గెలుచుకున్నా 2016 లో జరిగే ఒలింపిక్స్ లో మాత్రం క్వాలిఫై అవ్వలేదు. దీనికి గల కారణం ఏమిటంటే, ఒలింపిక్స్ లో అర్హులు కావాలంటే 83 మీటర్లు జావెలిన్ త్రో చేసి ఉండాలి. నీరజ్ 82.23 మీటర్ల వరకే జావెలిన్ త్రో చేసినందుకు అర్హులు అవ్వలేదు.

2017 లో Asian Athletic championships 2017 లో మళ్ళీ ఒకసారి బంగారు పతాకాన్ని సాధించారు.

2018 లో జరిగిన 2018 Commonwealth Games లో 86.47 మీటర్ల జావెలిన్ త్రో చేసి భారతదేశం పేరు కామన్ వెల్త్ గేమ్స్ లో మారుమోగించారు. నీరజ్ చోప్రా కు అర్జున అవార్డు ఇవ్వటం జరిగింది.

2018 లోనే Doha Diamond League లో 87.43 మీటర్ల త్రో చేసి తన రికార్డు తానే బద్దలు కొట్టారు.

2018 Asian Games లో కూడా 88.06 m త్రో చేసి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.

నీరజ్ చోప్రా ప్రతి సారి తన రికార్డు ను తానే బద్దలు చేసుకుంటూ విజయం వైపు వెళ్ళసాగారు.

ఆగస్ట్ 2023లో, అతను 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(World Athletics Championships)లో 88.17 మీటర్ల త్రో తో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

Olympic Games Tokyo 2020:

2021 లో జరుగుతున్నా ఒలింపిక్స్ లో తన పాత రికార్డులు అన్నీటిని తిరగరాసారు. ఆగస్ట్ 7 వ తారీకు జరిగిన జావెలిన్ త్రో లో 87.58 మీటర్లు త్రో చేసి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.

ఆగస్టు 26, 2022 వ సంవత్సరంలో జరిగిన లాసాన్ డైమండ్ లీగ్ మీటింగ్ లో 89.09m త్రో చేసి గెలిచి, భారత దేశం నుంచి ఈ లీగ్ గెలిచే మొట్ట మొదటి క్రీడా కారుడిగా చరిత్ర సృష్టించాడు.

Leave a Comment