Telangana Formation Day – తెలంగాణ అవతరణ దినోత్సవం ఎలా ఏర్పడింది ?

తెలంగాణ రాష్ట్ర చరిత్ర:  

తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి తెలుసుకొనే ముందు  స్వతంత్ర సమయంలో తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్ లో కాకుండా భారత దేశంలో విలీనం అయ్యేటప్పుడు ఎదుర్కున్న కష్టాలను కచ్చితంగా తెలుసుకోవాలి.   

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరవాత హైదరాబాద్ నిజామ్ హైదరాబాద్ ను ఇండియా లో విలీనం చేయటానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ ను ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఉండనివ్వాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో కొంత మంది ముస్లిం లు మరియు హిందువులు కలిసి “జాయిన్ ఇండియా (Join India) ” అనే ఉద్యమం ను ప్రారంభించారు.     

ఖాసీం రజ్వి అనే  MIM పార్టీ రాజకీయ నాయకుడు రజాకార్ అనే ముస్లిం ఆర్మీ ను తయారు చేసి హైదరాబాద్ ను ఇండియా లో విలీనం చేయవద్దని పోరాటాం చేసాడు కానీ భారత దేశ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ సహాయంతో “ఆపరేషన్ పోలో (Operation polo)” అనే ఆపరేషన్ ను చేసి హైదరాబాద్ ను ఇండియా లో కలపడం జరిగింది.  

నిజామ్ హయాం లో ప్రజల కష్టాలు: 

ఇక నిజాం ప్రభుత్వం హయాం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో  జమిందార్ లు ఎక్కువగా పాలించేవారు. వీటిని ఆరోజుల్లో సంస్థానాలు అని కూడా అనే వారు.ఈ సంస్థానాలు దేశస్తా బ్రాహ్మణులు, రెడ్డీలు, వేలమా ల ఆధీనంలో ఉండేవి. ఈ జమిందారీ వ్యవస్థను రద్దు చేయాలని 1946 నుంచి 1951 వరకు ప్రజలు తిరుగుబాటు కూడా చేసారు. 

స్వతంత్ర సమరంలో భారతదేశం స్వతంత్రం పొందిన హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం ఇంకా స్వతంత్రం లభించలేదు. నిజామ్ తానూ పాలించే రాష్ట్రాన్ని అలాగే ఉంచాలని రజాకారుల సహాయం తో చాలా దారుణాలకు పాల్పడ్డాడు. ఈ రజాకారులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో హైదరాబాద్ ని కూడా భారత దేశంలో విలీనం చేయాలనీ అని కోరిన వారిన కఠినంగా హింసించే వారు.   

ఆపరేషన్ పోలో అనే ఆపరేషన్ ద్వారా భారత ఆర్మీ హైదరాబాద్ లోకి ప్రవేశించి రజా కారులను ఎదుర్కోవటం ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలో చాలా వరకు ముస్లిం లు చనిపోయారు, దాదాపు 50,000 మంది ముస్లిం లు చనిపోవటం జరిగింది.  

17 సెప్టెంబర్ 1948 సంవత్సరంలో హైదరాబాద్ కి కూడా స్వతంత్రం లభించింది. రజా కారులకు నేతృత్వం వహించిన ఖాసీం రిజ్వి చివరికి భారత దేశ ఆర్మీ చేతిలో ఓడిపోయి కొద్దీ రోజులు హౌస్ అరెస్ట్ లో ఉన్న తరవాత పాకిస్తాన్ వెళ్లి స్థిరపడ్డాడు.   

హైదరాబాద్ రాష్ట్రం లోని జిల్లాలు:

ముందు హైదరాబాద్ రాష్ట్రం లో  తెలుగు భాషను మాట్లాడే 9 జిల్లాలు, కన్నడ భాషను మాట్లాడే గుల్బర్గా కు చెందిన 4 జిల్లాలు మరియు మరాఠీ భాషను మాట్లాడే  ఔరంగాబాద్ కు చెందిన 4 జిల్లాలు ఉండేవి.    1952 లో మొదటి సారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. Dr. బూర్గుల రామకృష్ణ రావు మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. తెలుగు ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రజలు మరియు కర్నాటకా కు సంబంధించిన ప్రజలు ఉండ కూడదని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాలు కూడా కేవలం హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకే ఇవ్వాలని కోరారు. 

అటు పొట్టి శ్రీరాములు చేసిన కృషి త్యాగం వళ్ళ అక్టోబర్ 1,1953 వ సంవత్సరంలో కర్నూల్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. 

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విలీనం:

1953 వ సంవత్సరంలో States Reorganisation Commission ను స్థాపించడం జరిగింది. ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక భాషకు సంబంధిన ప్రజలు ఒకటే రాష్ట్రంలో ఉండాలి. తెలంగాణ ప్రజలు మాత్రం ఆంధ్ర మరియు విలీనం కోసం ఒప్పుకోలేదు. తెలంగాణా లో పన్నుల రూపంలో వచ్చే డబ్బు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగిస్తారని మరియు క్రిష్ణా, గోదావరి నీటిని కూడా ఎక్కువగా ఆంధ్ర కి తరలిస్తారని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఆంధ్ర ప్రజలు దక్కించుకుంటారని  అందుకే విలీనానికి వ్యతిరేకంగా ఉన్ననమని తెలంగాణా ప్రజలు తెలిపారు.

1955 సంవత్సరంలో 103 MLA లు ఆంధ్ర మరియు తెలంగాణా విలీనానికి మద్దత్తు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ నాయకులూ మరియు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తో 20 ఫిబ్రవరి 1956 సంవత్సరంలో తెలంగాణా ప్రజలకు ప్రత్యేక వసతులు కలిగిస్తామని చెప్పి తెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం గా తయారు అయ్యింది.    

తెలంగాణ ఉద్యమం:    

1969 లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని గ్రహించిన ప్రజలు ఆందోళనలు చేయటం ప్రారంభించారు. 1969 నుంచి 1973 మధ్య కాలంలో ప్రజలు “జై తెలంగాణా” “జై ఆంధ్ర” అనే ఉద్యమాలు ప్రారంభించారు. ఈ ఉద్యమాలు క్రమ క్రమంగా హింసాత్మకంగా మారాయి. ఈ ఉద్యమాలు రాబోయే కాలంలో ఒక పార్టీ అండ లో కోనసాగాలని తెలంగాణా ప్రజా సమితి అనే పార్టీ ను 1969 లో ప్రారంభించటం జరిగింది.

పార్టీలోని సభ్యులు ఒకరి తరవాత ఒకరు తమ ముఖ్య లక్ష్యమైన తెలంగాణా ఉద్యమాన్ని చేయటం మాను కున్నారు. మరో వైపు ఆంధ్ర ప్రజలు మాత్రం తమ స్వస్థలాలో ఉంటూనే పరాయి వాళ్ళ లాగా మారటం ఇష్టం లేదు అన్నారు. తెలంగాణా ప్రజలు తమ ని ఒక పరాయి రాష్ట్రం ప్రజలుగా చూడటం ఇబంది గా మారుతుందని జై ఆంధ్ర ఉద్యమాన్ని బలవంతం చేయటం ప్రారంభించారు.

2009 వ సంవత్సరంలో కాంగ్రెస్ లీడర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరవాత రాష్ట్రం లో సరైన నాయకుడు లేకపోవటం వళ్ళ పార్టీ క్షీణించ సాగింది.ఇది మంచి సమయం అనుకున్న కెసిఆర్  నిరాహార దీక్షను ప్రారంభించారు. చాలా మంది రాజకీయ నాయకులూ ఈ నిరాహార దీక్షను సమర్ధించారు.   

2011 వ సంవత్సరంలో ఈ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరటం మొదలు పెట్టారు. 3 లక్షల ఉద్యోగులు 16 రోజుల పాటు చేసిన ఉద్యమం కారణంగా 8 బిలియన్ రూపాయల నష్టం ప్రభుత్వానికి కలిగింది.రాజకీయ నాయకులు కూడా తెలంగాణ ఉద్యమన్ని బలోపేతం చేయడానికి రాజీనామాలు కూడా చేసారు.  

అనేక తెలంగాణ ప్రజలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఈ ఉద్యమాన్ని చేరటం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి కి గురిచేసింది. 

అక్టోబర్ 3 2013 వ సంవత్సరంలో యూనియన్ కాబినెట్ కొత్త తెలంగాణ రాష్ట్రం కోసం ఆమోదం ఇచ్చింది. ఈ విభజన తరవాత హైదరాబాద్ 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ తరవాత తెలంగాణ రాజధాని అవుతుందని ప్రకటించడం జరిగింది.      

2 జూన్ 2014 వ సంవత్సరంలో అధికారికంగా Kalvakuntla Chandrashekar Rao మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు.   

Leave a Comment