Sonam kapoor Biography – సోనమ్ కపూర్ జీవిత చరిత్ర

అనిల్ కపూర్ లాంటి గొప్ప నటుడి ఇంట్లో పుట్టిన సోనమ్ కపూర్ ఎప్పుడు కూడా తన తండ్రి డబ్బులపై ఆధారపడలేదు. సినిమాలలోకి రాక ముందు తన బరువు ఎక్కువగా ఉండటంతో సినిమాల కోసం ఏకంగా 30 కిలోలు తగ్గారు.   

అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సోనమ్ రాంఝన (Ranjhana) సినిమా తరవాత తన నటన ద్వారా అందరి మెప్పు పొందారు. సోనం కపూర్ 2018 వ సంవత్సరంలో ఆనంద్ అహుజా అనే వ్యాపారవేత్త తో పెళ్లి చేసుకున్నారు. 

బాల్యం: 

సోనమ్ కపూర్ 1985 సంవత్సరంలో ముంబై లో నటుడు అనిల్ కపూర్ మరియు మోడల్ సునీతా దంపతులకు పుట్టారు. సోనమ్ కపూర్ తాత సురిందర్ కపూర్ కూడా ఒక నిర్మాత, అనిల్ కపూర్ ఫిలిమ్స్ కంపెనీ ను స్థాపించారు.

బోనీ కపూర్ కు సోనమ్ కపూర్ మేన కోడలు అవుతుంది. అర్జున్ కపూర్,మోహిత్ మర్వాహ మరియు రణవీర్ సింగ్ బంధువులు అవుతారు.  

సోనమ్ కు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి వద్ద డబ్బులు ఎందుకు తీసుకోవాలి అని ఏదైనా ఉద్యోగం చేయాలని ఒక వెయిట్రెస్ (waitress) గా కూడా పనిచేసారు. కానీ ఈ ఉద్యోగం కేవలం ఒక వారం మాత్రమే చేసారు.

సోనమ్ కపూర్ ఇప్పుడు చూస్తే స్లిమ్ గా అందంగా కనిపిస్తారు కానీ సినిమాలలోకి రాక ముందు తన బరువు ఎక్కువగా ఉండేది. ముఖం పై వెంట్రుకలు ఉండటం మరియు ఇతర ఆరోగ్య సంభందమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నీటితో పోరాడి చివరికి తన బరువు తగ్గించారు. సింగపూర్ లో సినిమాలకు సంబంచిన చదువు కూడా చదివారు.

సోనమ్ కు దర్శకత్వం పైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. సోనమ్ నాన్న అనిల్ కపూర్ రెకమెండేషన్ చేయగా బ్లాక్ (BLACK) అనే సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్న సంజయ్ లీల భన్సాలీ సోనమ్ కపూర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకున్నారు . ఈ సినిమాలో నటించిన రాణి ముఖర్జీ కపూర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండటం కూడా సోనమ్ కపూర్ కు సహాయ పడింది.            

సినిమాలలో సోనమ్ కపూర్ :    

బ్లాక్ సినిమా లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సోనమ్ కపూర్ ను తాను తీయబోయే సావరియా (Saawariya) అనే సినిమా లో లీడ్ రోల్ లు తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని భన్సాలీ చెప్పగా సోనమ్ కూడా తన నటన జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నారు.

ఆ సమయంలో సోనమ్ కపూర్ దాదాపు 80 కేజీల బరువు ఉన్నారు, భన్సాలీ సలహా మేరకు తన బరువు తగ్గించడం మొదలుపెట్టారు. ఈ సినిమా దర్శకులకు నచ్చకపోవడం వళ్ళ ప్లాప్ అయ్యింది.  

I Hate Luv Storys  అనే సినిమా సోనమ్ కపూర్ కు మంచి విజయాన్ని అందించింది. సోనమ్ తరవాత చేసిన పలు సినిమాలు ప్లాప్ అయ్యాయి.  

2013 లో రిలీజ్ అయిన రాంఝన (Ranjhana)  సోనమ్ కపూర్ ఒక అమాయక ముస్లిం అమ్మాయిగా చేసిన నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ఈ సినిమా తరవాత సోనమ్ కపూర్ కెరీర్ లో ఒక మలుపు వచ్చింది.   

సల్మాన్ ఖాన్ తో నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో ( Prem Ratan Dhan Payo) అనే సినిమాలో సోనమ్ ఒక రాజకుమారి పాత్రను చేసారు. ఈ సినిమా ఆ సంవత్సరంలో ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరింది.   

2016 లో ఎయిర్ హోస్టెస్ Neerja Bhanot పై తీసిన సినిమా Neerja లో సోనమ్ కపూర్ Neerja Bhanot పాత్ర ను చేసింది.  Pan Am Flight 73 అనే విమానం హైజాక్ కు గురి అయినప్పుడు నీర్జా ప్రయాణికులను కాపాడుతూ చనిపోయింది. సోనమ్ కపూర్ చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించింది.  

సోనమ్ కపూర్ పెళ్లి : 

సోనమ్ కపూర్ వ్యాపార వేత్త అయిన ఆనంద్ అహుజా ను సిక్కు ఆచారాల ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లి చేసుకున్న తరవాత చేసిన Veere Di Wedding అనే సినిమా గొప్ప విజయం సాధించింది. సోనమ్ కపూర్ బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసునే వారిలో పరిగణించబడుతారు.

  బాలీవుడ్ లో సోనమ్ కపూర్ డ్రెస్సింగ్ ను మరియు తన ఫ్యాషన్ ను చాలా మంది మెచ్చుకుంటారు. 

Leave a Comment