రాజ్ కపూర్ ఇండియన్ సినిమా లో ఒక నటుడిగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించారు. రాజ్ కపూర్ సంతానం నుంచే బాలీవుడ్ ఇండస్ట్రీ కి చాలా మంచి నటీ నటులు వచ్చారు అని చెప్పవచ్చు.
తన జీవిత కాలంలో తాను చేసిన సినిమాలకు అవార్డులు కూడా పొందటం జరిగింది. భారతదేశ ప్రభుత్వం 1971 లో పద్మ భూషణ్, 1987 సంవత్సరంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు తో సత్కరించటం జరిగింది.
Table of Contents
రాజ్ కపూర్ బాల్యం :
రాజ్ కపూర్ 1924 వ సంవత్సరంలో ఇప్పటి పెషావర్ నగరంలో ఒక పంజాబీ హిందూ ఫ్యామిలీ లో ప్రిథ్వీరాజ్ కపూర్, రాంసర్ని దేవి కపూర్ అనే దంపతులకు జన్మించటం జరిగింది. రాజ్ కపూర్ తండ్రి ప్రిథ్వీరాజ్ కపూర్ కూడా ఒక నటుడు, ఇండియన్ సినిమా ప్రారంభంలో నటించిన నటులలలో ఒక గొప్ప నటుడు ప్రిథ్వీరాజ్ కపూర్.
ప్రిథ్వీరాజ్ కపూర్ కు ఆరుగురు సంతానం, రాజ్ కపూర్ అందరిలో పెద్దవారు. రాజ్ కపూర్ సోదరులు షమ్మీ కపూర్, శశి కపూర్ కూడా బాలీవుడ్ లో మంచి నటులు.రాజ్ కపూర్ ఇప్పటి పాకిస్తాన్ లో పుట్టినా తరవాత పై చదువుల కోసం ఇండియా కి రావటం జరిగింది. ప్రిథ్వి రాజ్ కపూర్ తన సినిమా కెరీర్ ప్రారంభంలో చాలా నగరాలకు మారటం వళ్ళ రాజ్ కపూర్ కూడా వివిధ నగరాలలో తన విద్యాభ్యాసం చేసారు.
రాజ్ కపూర్ నటనా జీవితం:
రాజ్ కపూర్ తన నటనా జీవితాన్ని10 సంవత్సరాల వయస్సులో ప్రారంభించారు. ఇంకీలాబ్ అనే బాలీవుడ్ సినిమాలో మొట్ట మొదటి సారిగా నటించడం జరిగింది.
చాలా తక్కువ సమయంలో రాజ్ కపూర్ ఒక మంచి నటుడిగా పేరు సంపాదించారు. 1948 వ సంవత్సరంలో తన సొంత స్టూడియో R.K films ను స్థాపించి అతి చిన్న వయస్సులో సినిమాలకు దర్శకత్వం వహించటం ప్రారంభించారు.
R.K ఫిలిమ్స్ స్థాపించిన తరవాత నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేయటం ప్రారంభించారు. ఈ స్టూడియో ద్వారా Awaara సినిమా 1951 లో , Shree 420 అనే సినిమాను 1955 లో, Jagte Raho అనే సినిమాను 1956 లో మరియు Jis Desh Men Ganga Behti Hai అనే సినిమాను 1960 లో రిలీజ్ చేసిన చాలా గొప్ప ప్రజాధారణ పొందాయి.
రాజ్ కపూర్ఇతర నిర్మాతలతో Dastan అనే సినిమా 1950 లో , Anhonee అనే సినిమా 1952 లో , Aah అనే సినిమా 1953 లో, Chori Chori అనే సినిమా 1956 లో, Anari అనే సినిమా 1959 లో , Chhalia అనే సినిమా 1960 లో మరియు Dil Hi To Hai అనే సినిమా 1963 లో హిట్ సినిమాలను తీసారు.
రాజ్ కపూర్ నటనను చూసిన వారు బాలీవుడ్ చార్లీ చాప్లిన్ అని కొనియాడేవారు. రాజ్ కపూర్ కు ఒక ప్రతిష్టాత్మక సినిమా తీయాలని కోరిక ఉండేది అందుకే 6 సంవత్సరాల వ్యవధి తీసుకోని మేరా నామ్ జోకర్ అనే సినిమాను తీసారు. ఈ సినిమాలో తన కొడుకు రిషి కపూర్ కూడా నటించటం జరిగింది. ఈ సినిమా రిషికపూర్ మొదటి సినిమా, తన తండ్రి చిన్నప్పటి పాత్రను ఈ సినిమాలో వేయడం జరిగింది.
ఆరు సంవత్సరాలు కష్ట పడినా ఆ సినిమా మాత్రం చివరికి ప్రజలకు నచ్చలేదు, ఒక ప్లాప్ సినిమా గా మిగిలిపోయింది. తరవాత ప్రజలు ఈ సినిమాను ను మంచి సినిమా గా గుర్తించారు.ఈ సినిమా తరవాత కపూర్ కుటుంబం ఆర్థికంగా చాలా నష్ట పడింది.
రాజ్ కపూర్ 1971 వ సంవత్సరంలో రణధీర్ కపూర్ ను Kal Aaj Aur Kal అనే సినిమా తో లాంచ్ చేసారు. 1973 వ సంవత్సరంలో తన రెండవ కుమారుడు రిషి కపూర్ ను Bobby అనే సినిమా ద్వారా లాంచ్ చేసారు. 1970 తరవాత రాజ్ కపూర్ సినిమాలలో చిన్న చిన్న పత్రాలు వేసేవారు.
రాజ్ కపూర్ కుటుంబం :
1946 వ సంవత్సరంలో రాజ్ కపూర్ క్రిష్ణా మల్హోత్రా తో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకి 5 మంది సంతానం.
- Randheer kapoor
- Rishi kapoor
- Rajiv kapoor
- Ritu Nanda
- Rima jain
రాజ్ కపూర్ ముగ్గురు కుమారులు బాలీవుడ్ లో హీరోలుగా నటించారు. మొదటి కూతురు రీతూ నంద బిజినెస్ చేస్తారు, రెండవ కూతురు రీమా జైన్ ఒక బిసినెస్ మాన్ ను పెళ్లి చేసుకున్నారు.
మొదటి కుమారుడు రణధీర్ కపూర్ నటి బబితా ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒకరు కరిష్మాకపూర్ రెండు కరీనా కపూర్, వీరు ఇద్దరు కూడా బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించారు.
రెండవ కుమారుడు రిషికపూర్ నటి నీతూ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఒకరు రిద్ధిమా మరియు రెండో సంతానం రణబీర్ కపూర్.
మూడవ కుమారుడు రాజీవ్ కపూర్ ఆర్తి సభర్వాల్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే విడాకులతో విడి పోయారు. వీరికి ఎలాంటి సంతానం లేదు.
రాజ్ కపూర్ మొదటి కూతురు రాజన్ నంద అనే వ్యాపార వేత్త ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఒకరు నతాషా నంద మరియు వీరి కొడుకు నిఖిల్ నంద అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ ను పెళ్లి చేసుకున్నారు.
రాజ్ కపూర్ చిన్న కూతురు రీమా జైన్ మనోక్ జైన్ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఒకరు అర్మాన్ జైన్ రెండవ కుమారుడు ఆదార్ జైన్.
మరణం :
రాజ్ కపూర్ తన చివరి రోజులలో ఆస్తమా వళ్ళ భాధపడేవారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు తీసుకునే సమయంలో రాజ్ కపూర్ ఒక్కసారి కుప్ప కూలిపోయారు. ఆసుపత్రి లో దాదాపు ఒక నెల చికిత్స తీసుకున్న తరవాత 1988 సంవత్సరంలో 63 వయస్సులో మరణించారు.