Mani Ratnam biography in Telugu – మనిరత్నం జీవిత చరిత్ర

 మణిరత్నం తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన దర్శకుడు, నిర్మాత, రచయిత. సినీ పరిశ్రమలో తానూ చేసిన పనులకు గాను భారత ప్రభుత్వం “పద్మశ్రీ” అవార్డు తో సత్కరించింది. 

బాల్యం:  

మణిరత్నం జూన్ 2 , 1956 వ సంవత్సరంలో సినీ పరిశ్రమతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న చిత్ర నిర్మాత ఐయ్యర్ కుటుంబలో జన్మించారు. మణిరత్నం గారి నాన్న S. గోపాల రత్నం వీనస్ పిక్చర్స్ లో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసారు. మణిరత్నం గారి ఇద్దరు సోదరులు కూడా సినిమాలకు నిర్మాతలుగా ఉన్నారు. 

మణిరత్నం గారు అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నై లో పెరిగారు. కుటుంబం మొత్తం సినీ పరిశ్రమకు చెందిన వారైనా పిల్లలకు మాత్రం సినిమాలను చూడనిచ్చేవారు కాదు.     

చిన్నప్పుడు మణిరత్నం గారికి సినిమాలు అంటే సమయం వృధా చేసేవి అని అనిపించేది. శివాజీ గణేశన్, నగేష్ లాంటి నటులను చుసిన తరవాత తన మక్కువ సినిమాల పై పెరగ సాగింది.  దర్శకుడు K. బాలచందర్ సినిమాలను ఇష్టపడటం మొదలుపెట్టారు. 1977 సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరవాత చెన్నై లో ని ఒక ప్రైవేట్ సంస్థ లో కొద్దీ రోజులు ఉద్యోగం చేసారు.  

నిర్మాతగా మణిరత్నం :

మణిరత్నం తాను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం నచ్చక తన స్నేహితులతో కలిసి ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. తన కంపనీ లో కొద్దీ రోజులు సెలవులు పెట్టి సినిమా పై దృష్టి పెట్టడటం మొదలుపెట్టారు. నటులను కూడా ఎంపిక చేసుకున్నారు, తాను చేస్తున్న ఉద్యోగం పూర్తిగా మానేసారు కూడా కానీ వీరిలో ఏ ఒక్కరికి సినిమా ఎలా తీయాలన్న విహాయం పై అవగాహన లేకపోవటం వళ్ళ ఆ సినిమా మొదలు అవ్వక ముందే ముగిసింది. 

ఈ సినిమా తరవాత కూడా మణిరత్నం గారు ఒక కథను రాసి దానిని చిత్రీకరించాలని చాలా ప్రయత్నించారు కూడా కానీ ఫలితం దక్కలేదు.  

మణిరత్నం గారు రాసిన కథను తన మావయ్య కు చూపించగా తాను ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటానని చెప్పారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో తీయాలని ఒక కండిషన్ కూడా పెట్టారు. Pallavi Anu Pallavi అనే సినిమా పేరు తో అనిల్ కపూర్ మరియు లక్ష్మి గారిని ఈ సినిమా కోసం హీరో హీరోయిన్ పాత్రల కోసం ఎంచుకున్నారు. 

ఈ సినిమా అంతగా ఆడక పోయినా మణిరత్నం గారు రాసిన కథకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.    

నిర్మాతగా హిట్ సినిమాలు : 

మొదటి చిత్రం పూర్తి చేసిన తరవాత క్రమ క్రమంగా సినిమాలకు దర్శకత్వం చేయటం మొదలుపెట్టారు. 1986 లో దర్శకత్వం వహించిన మౌన రాగం పెద్ద హిట్ సినిమా అయ్యింది. 

1987 లో గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమాను ఆధారం చేసుకొని “నాయకన్” అనే సినిమాను తీయగా అది కూడా ప్రజలకు చాలా బాగా నచ్చింది. 

1989 సంవత్సరంలో మణిరత్నం గారు తన మొట్ట మొదటి మరియు చివరి తెలుగు సినిమా “గీతాంజలి”కు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నాగార్జునా గారి కోరిక మేరకు దర్శకత్వం వహించారు.       

ఈ సినిమాకు గాను మణిరత్నం గారికి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. 1990 లో తీసిన అంజలి అనే సినిమా ఆస్కార్ అవార్డు కు నామినేట్ కూడా అయ్యింది.మణిరత్నం గారు తాను తీసే సినిమాలలో ఇళయ రాజాను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవటం వళ్ళ సినిమా లోని సంగీతానికి బలం చేకూర్చింది.  

1992 లో తీసిన రోజా సినిమా విజయవంతం అయ్యింది.  ఈ సినిమాను ఇతర బాషలలో కూడా డబ్ చెయ్యగా అక్కడ కూడా ప్రజలకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది.  మణిరత్నం గారు రాంగోపాల్ వర్మ తో కూడా కలిసి Thiruda Thiruda ,గాయం అనే సినిమాలను తీసారు.

1995 Bombay  అనే తమిళ సినిమాలో ఒక ముస్లిం యువతి ఒక హిందూ యువకుడు ప్రేమను ఆధారంగా చేసుకొని సినిమా తీయగా చాలా మంది దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేసారు. చివరికి ఈ సినిమాను హిందీ లో డబ్ చేసి విడుదల చేయగా పలు రకాల అవార్డు లను కైవసం చేసుకుంది.

1998 లో మణిరత్నం గారు తీసిన దిల్ సే మూవీ చాలా పెద్ద సక్సెస్. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ మరియు మనిషా కొయిరాలా నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా A .R రహ్మాన్ గారు అందించిన దిల్ సే అనే పాట చాలా పెద్ద హిట్. ఈ సినిమా మన దేశంలో కాకుండా  అంతర్జాతియ స్థాయిలో కూడా విజయాన్ని దక్కించుకుంది.      

2002 వ సంవత్సరంలో తీసిన Kannathil Muthamittal అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందించింది. శ్రీలంకాకు  చెందిన ఒక  అమ్మాయి తన నిజమైన తల్లి తండ్రులను వెతకటం కోసం చేసే ఆరాటం గురించి ఈ సినిమా చెబుతుంది.   

2004 వ సంవత్సరంలో Aaytha Ezhuthu  అనే సినిమా ను తీయటం జరిగింది. ఇదే సినిమాను మళ్ళీ బాలీవుడ్ లో yuva అనే పేరుతో తీసారు.

2007 వ సంవత్సరంలో ధీరుభాయి అంబానీ ఆత్మ కథ ను సినిమా రూపంలో తీయటం జరిగింది. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయి బచ్చన్ నటించిన ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. 

2015 వ సంవత్సరం లో  O Kadhal Kanmani అనే చిత్రం లివ్ ఇన్ రేలషన్ షిప్ గురించి చూపించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో హిట్ సినిమా గా నిలిచింది.     

అవార్డులు :

2002 వ సంవత్సరంలో మణిరత్నం గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. నాగార్జున గారు నటించిన గీతాంజలి చిత్రానికి గాను Golden Lotus Award for Best Popular Film అనే అవార్డును గెలిచారు. 

Kannathil Muthamittal అనే సినిమాకు Best Regional Film అవార్డు ను దక్కించుకున్నారు.మణిరత్నం గారు దర్శకత్వం వహించిన రోజా మరియు బాంబే సినిమాలకు  Nargis Dutt Award ను కైవసం చేసుకున్నారు.  

మణిరత్నం గారి కుటుంబం: 

మణిరత్నం గారు ప్రముఖ నటి సుహాసిని గారితో 1988 లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకి నందన్ అనే కుమారుడు ఉన్నాడు. మని రత్నం గారికి మద్రాస్ టాకీస్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది.      

Leave a Comment