M.F Hussain biography in Telugu – M.F హుస్సేన్ జీవిత చరిత్ర

M.F హుస్సేన్ భారత దేశం యొక్క చిత్రకారుడు.తన పెయింటింగ్స్ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుడు. తాను వేసే కొన్ని చిత్రాలు కొన్ని మతాల వారిని మరియు కొన్ని వర్గాల వారిని రెచ్చ గొట్టాయి. తాను వేసే పెయింటింగ్స్ వళ్ళ ఎప్పుడూ వివాదాలలో ఉండేవారు.      

హుస్సేన్ హిందూ దేవతల, భారత మాత నగ్న పెయింటింగ్స్  చిత్రీకరించటం వళ్ళ దేశం లో నిరసనలు కూడా చేసారు. 2004 వ సంవత్సరంలో  Meenaxi: A Tale of Three Cities అనే సినిమా దర్శకత్వం కూడా చేసారు. ఈ సినిమాలోని ఒక పాటలో ముస్లిం ల మనోభావాలను దెబ్బ తీసారని చాలా ముస్లిం సంఘాలు నిరసనలు వ్యక్తం చేసారు.     

బాల్యం : 

హుస్సేన్ 1915 వ సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు. చిన్న తనం నుంచే కాలిగ్రఫీ ను చూసి కళాకారుడి గా మారాలనుకున్నారు.మొదట్లో సినిమా పోస్టర్ల పెయింటింగ్ వేయటం తో తన కెరీర్ ను ప్రారంభించారు.  

M.F హుస్సేన్ కెరీర్ మరియు వివాదాలు  :  

హుస్సేన్ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినా ఇతర మతాల గురించి తెలుసుకోవటం మరియు వాటి పెయింటింగ్ లు వేయటం మొదలు పెట్టారు. 

1970 సంవత్సరంలో హుస్సేన్ వేసిన హిందూ దేవతల నగ్న పెయింటింగ్ లు 1996 వ సంవత్సరంలో ఒక హిందీ నెలవారీ పత్రికలో M.F. Husain: A Painter or Butcher అనే శీర్షిక తో ఈ పెయింటింగ్ లు ప్రచురించిన తరవాత చాలా మంది నిరసనలు తెలపడం ప్రారంభించారు.  

హుస్సేన్ పై పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. బజరంగ్ దళ్ మరియు శివసేన లాంటి సంస్థలు పెద్ద మొత్తంలో నిరసనలు తెలిపారు మరియు హుస్సేన్ ఇంటి పై దాడి కూడా చేయటం జరిగింది. 

కోర్ట్ మాత్రం హుస్సేన్ ఎలాంటి తప్పు చేయలేదని, తాను కేవలం హిందూ మతంలోని దేవతల గురించి పెయింటింగ్ లు వేసాడని చెప్పి కేసు కొట్టి వేసారు.

2004 సంవత్సరంలో హుస్సేన్ దర్శకత్వం వహించిన సినిమా Meenaxi: A Tale of Three Cities అనే సినిమాలోని  Noor-un-Ala-Noor  అనే పాటలో ఖురాన్ మరియు ఇస్లాం మతాన్ని కించపరచాడని పలు ముస్లిం సంస్థలు నిరసనలు చేసి ఆ సినిమాను మూసి వేయించారు.  

హుస్సేన్ భారత మాత చిత్రాన్ని కూడా నగ్నంగా దించి వాటి పై వివిధ రాష్ట్రాల పేర్లు రాసారు. ఈ పెయింటింగ్ లను వెబ్ సైట్ లో మరియు బహిరంగంగా ప్రదర్శనలు చేయటం పై  హిందూ సంస్థ అయిన VHP  నిరసనలు వ్యక్తం చేసారు. 

హుస్సేన్ మాత్రం జరుగుతున్న నిరసనలు చూసి హిందూ పెద్దలు తన పెయింటింగ్ లకు వ్యతిరేకంగా చెప్పలేదని కేవలం రాజకీయ ప్రయోజనాలకు కొంతమంది వినియోగిస్తున్నారని తెలిపారు.   

మొదట పెయింటింగ్ ను వేలం లో అమ్మను అని క్షమాపణలు చెప్పిన హుస్సేన్ తరవాత 80  లక్షలకు అమ్మారు.  

ఎల్లప్పుడూ ఎదో ఒక కేసు తన పై బుక్ కావటం చూసిన హుస్సేన్ 2006 తరవాత తాను ఇండియా లో ఉంటే తన ప్రాణానికి ముప్పు అని తెలుసుకుని లండన్ లో తనకు తానే మరణించే వరకు స్వీయ బహిష్కరణను ఎంచుకున్నారు. 

ఇండియా నుంచి వెళ్లిపోయిన తరవాత కతర్ (Qatar) దేశంలో అక్కడి ప్రభుత్వానికీ తన సేవలను అందించారు. 

అవార్డులు :

కేరళ ప్రభుత్వం హుస్సేన్ కు  Raja Ravi Varma  అవార్డు ను ఇవ్వగా చాలా మంది వ్యతిరేక నిరసనలు చేసారు. 

2010 వ సంవత్సరంలో జోర్డాన్ కు చెందిన  Royal Islamic Strategic Studies Centre హుస్సేన్ ను అత్యంత ప్రభావవంత మైన 500 ముస్లిం లలో ఒకరు గా తెలిపారు.  

మరణం : 

హుస్సేన్ పలు నెలలు అనారోగ్యంగా ఉన్న తరవాత లండన్ లోని ఒక ఆసుపత్రి లో గుండె పోటు వళ్ళ 95 సంవత్సరాల వయస్సులో మరణించారు.  

Leave a Comment