Table of Contents
కిరణ్ బేడీ ఎవరు ?
పంజాబ్ లోని ఒక సాధారణ కుటుంబలో జన్మించి, తన తాత ఆడపిల్లలలు చదువు ఎందుకు అని చెప్పినా తన నాన్న సహకారంతో చదివి UPSC లాంటి కఠిన తరమైన పరీక్షలో రాణించి భారత దేశంలో మొట్ట మొదటి మహిళా IPS ఆఫీసర్ గా ఎన్నుకోబడ్డారు.
తన సర్వీస్ లో నిజాయితీగా విధి ని నిర్వర్తించి దేశ పరాజయాల ప్రశంసలను అందుకుంది. అధికారులకు తన నిజాయితీ నచ్చనందుకు ఒక చోటు నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ లు చేసినా పట్టు వదలకుండా తన విధిని సక్రమంగా బెదరకుండా నిర్వర్తించారు.
ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కారు ను సైతం సరిగా పార్క్ చేయలేదని తీసి వేయించింది.
తీహార్ లాంటి భయంకరమైన నేరగాళ్లు ఉండే జైలులో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడి నేరగాళ్ళతో మంచిగా మెలిగి వారిలో చాలా మంచి మార్పులు తీసుక వచ్చింది.
భారత దేశం లో పలు రకాల సామజిక సేవలు చేస్తూ ప్రజల ఆదరణ పొందింది. యునైట్ నేషన్ లో కూడా సలహాదారుగా పనిచేసారు.
సామాజిక కార్యక్రమాలు చేస్తూ అన్న హజారే ఉద్యమంలో కూడా కిరణ్ బేడీ మద్దతు నిచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్ కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు.
తాను సామాజిక కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయాలంటే రాజకీయ నాయకురాలిగా అవ్వాలని ఢిల్లీ లో ముఖ్యమంత్రి పదవి కోసం BJP పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు కానీ అరవింద్ కేజ్రీ వాల్ తో ఓడిపోయారు.
బాల్యం :
కిరణ్ బేడీ 1949 సంవత్సరంలో పంజాబ్ లో ని అమ్రిత్ సర్ లో ఒక వ్యాపార కుటుంబలో జన్మిచారు. కిరణ్ బేడీ ప్రకాష్ లాల్ పెషవరియా మరియు ప్రేమ్ లత అనే దంపతులకు జన్మిచిన రెండవ సంతానం. కిరణ్ బేడీ వారి కుటుంబం పంజాబ్ కి చెందిన వారు కావటం వళ్ళ హిందూ మతాన్ని మరియు సిక్కు మతాన్ని అనుసరించేవారు.
కిరణ్ బేడీ తాత ముని లాల్ మాత్రం ఆడపిల్లల కు చదువు అవసరం లేదని నమ్మేవారు. కిరణ్ బేడీ తండ్రి మాత్రం పిల్లలకు మంచిగా చదవాలని దూరం ఉన్న సరే మంచి స్కూల్ లో అడ్మిషన్ చేయించాలని ఆలోచించేవారు.
కిరణ్ బేడీ చిన్న తనం నుంచే చదువులో ముందు ఉండేది తన తోటి పిల్లలు 9 వ తరగతి లో ఉన్నప్పుడు తాను మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి 10 వ తరగతి పాస్ అయిపోయారు.
బేడీ స్కూల్, కాలేజీ అమ్రిత్ సర్ లోనే చదివారు. చదువు తో పాటు National Cadet Corps (NCC) లో కూడా పాల్గొనేవారు. వీరి ప్రతిభకు గాను NCC క్యాడెట్ ఆఫీసర్ అవార్డు ను గెలుచుకున్నారు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ సంపాదించి కాలేజీ లో పిల్లకు పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన పాఠాలు భోదించేవారు.
చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా బేడీ ముందు ఉండే వారు. కిరణ్ బేడీ టెన్నిస్ లో నేషనల్ ఛాంపియన్ గా ఉన్నారు. IPS పరీక్షల తయారీ సమయంలో టెన్నిస్ కు దూరమయ్యారు.
IPS ఆఫీసర్ గా కిరణ్ బేడీ :
UPSC పరీక్షల కోసం చదివిన తరవాత తన కషటం ఫలించింది. 1975 సంవత్సరంలో ఢిల్లీ లోని చాణిక్యపురి లో భారత దేశ మొట్ట మొదటి మహిళా IPS ఆఫీసర్ గా నియమించబడ్డారు.
1978 లో ఇండియా గేట్ వద్ద రెండు సిక్కు సముదాయాల మధ్య జరిగిన గొడవలను నియంత్రించడానికి కిరణ బేడీ ని పంపించారు. దాదాపు 800 ల సిక్కులను లాఠీ ఛార్జ్ చేసి తరిమేసారు.
కొంత మంది సిక్కుల వద్ద కత్తులు కూడా ఉన్నాయి కానీ కిరణ్ బేడీ ఏ మాత్రం భయపడకుండా పరిస్థితిని అదుపులోకి తీసుక వచ్చారు. తన ధైర్యాన్ని మెచ్చుకుంటూ President’s Police Medal తో సత్కరించారు.
కిరణ్ బేడీ ఢిల్లీ లో పనిచేస్తున్నప్పుడు నేరాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అక్కడి స్థానిక వాలంటీర్ల సహాయం తీసుకోని ఎక్కడెక్కడ నేరాలు ఎక్కువగా జరుతుతున్నాయో తెలుసుకొని చాలా వరకు నేరాలను తగ్గించారు.
1982 లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో ASIAN GAMES ఢిల్లీ లో జరగనున్నాయి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ట్రాఫిక్ ను కంట్రోల్ చెయ్యటానికి కిరణ్ బేడీ ను DCP గా ట్రాఫిక్ కు సంబంధించిన విధులను నిర్వర్తించ సాగారు.
బేడీ ట్రాఫిక్ నియమాలను ఉల్లగించిన వారిని ఎవరని కూడా చూడకుండా ఆక్షన్ తీసుకునే వారు. ప్రధాన మంత్రి ఐన ఇందిరా గాంధీ కారును కూడా సరిగా పార్క్ చేయలేదని కార్ ని క్రేన్ సహాయం తో తీసి వేయించారు అందుకే బహుశా ఆమెకు “క్రేన్ బేడీ” అని అక్కడి ప్రజలు పిలిచేవారు.
తన విధుల పట్ల తన కర్తవ్యాలను నిర్వర్తించడం బహుశా కొంత మందికి నచ్చక పోవటం వళ్ళ కిరణ్ బేడీ ను గోవా కు ట్రాన్స్ఫర్ చేసారు.
గోవా లో కిరణ్ బేడీ:
గోవా లో Zuari Bridge పూర్తి అయ్యింది కానీ ప్రారంభించడానికి ఇందిరా గాంధీ రావాలని అక్కడి ప్రభుత్వం బ్రిడ్జి ని తెరవలేదు. కిరణ్ బేడీ గారి అక్కడి ట్రాఫిక్ కష్టాలు చూసి రాజకీయ నేతలకు వ్యతిరేకంగా బ్రిడ్జి ను తెరిపించారు.
అదే సమయంలో తన కూతురు ఆరోగ్యం క్షిణించటం వళ్ళ అక్కడి ప్రభుత్వం తో సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ తమ నిజాయితీ వళ్ళ అక్కడి ప్రభుత్వం వారిలో కోపం పెరిగింది. బేడీ కు సెలవులు దొరకలేదు అయినా సరే తన కూతురి కోసం తన సర్వీస్ లో మొదటి సారిగా లాంగ్ లీవ్ తీసుకోని ఢిల్లీ వెళ్లారు.
గోవా ప్రభుత్వం తో విభేదాలు రావటం వల్ల తన పై అధికారులతో మాట్లాడి ఢిల్లీ కి తిరిగి వెళ్లారు.
రాజీనామా :
ఢిల్లీ తిరిగి వచ్చిన తరవాత కూడా కొన్ని వివాదాల కారణంగా మళ్లీ ట్రాన్స్ఫర్ చేయాలని అనుకొన్నారు. ఈ సారి తాను మిజోరాం వెళ్లదలుచుకున్నారు అని చెప్పగా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసారు.
మిజోరం తరవాత కిరణ్ బేడీ ను తీహార్ జైలు కు బదిలీ చేసారు. ఈ తీహార్ జైలు లో భయంకర మైన నేరస్తులు ఉండటం మరియు వసతులు సరిగా లేకపోవటం వళ్ళ ఆ పోస్ట్ అలాగే చాలా రోజులు ఖాళీగా ఉంది. కిరణ్ బేడీ తీహార్ జైలు కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తరవాత అక్కడి ఖైదీలను మార్చే ప్రయత్నం చేసారు.
తీహార్ జైలు కి వెళ్లాలంటే భయపడే రకంగా ఉండే స్థలాన్ని తన ప్రయత్నం తో చాలా మంచి మార్పులు తీసుకువచ్చారు.
2007 వ సంవత్సరంలో తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి సామజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
రాజకీయాలలో కిరణ్ బేడీ :
కిరణ్ బేడీ తన సామజిక సేవలను పెద్ద స్థాయి లో చేయాలంటే పొలిటికల్ పవర్ ఉండాలని గ్రహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని 2015 లో బీజేపీ తరపున పోటీ చేసారు. అప్పోజిషన్ లో కేజ్రీవాల్ ఉండటం మరియు ఢిల్లీ ప్రజలకు BJP పై నమ్మకం లేక పోవటం వళ్ళ కిరణ్ బేడీ ఎన్నికలలో ఓడిపోయారు.
ప్రస్తుతం బేడీ Lieutenant Governor of Puducherry గా భాద్యతలు స్వీకరించారు.