Kim Jong un Biography in Telugu – కిమ్ జోంగ్ ఉన్ జీవిత చరిత్ర

కిమ్ జోంగ్ ఉన్ అనే పేరు ఎప్పుడు వార్తలలో ఉంటూనే ఉంది. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా (North Korea) యొక్క సుప్రీమ్ నాయకుడు. కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా ను స్థాపించిన కిమ్ ఇల్ సంగ్ యొక్క మనవడు. కిమ్ ఇల్ సంగ్ యొక్క కుటుంబమే ఎల్లప్పుడూ అధికారం లో ఉంటుంది వేరేవారు పోటీ చేయటానికి లేదు. 

నార్త్ కొరియా లో మీడియా కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇంటర్నెట్ కేవలం కొన్ని వెబ్ సైట్ లకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. కంప్యూటర్ కొనుకున్నా గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకోని కొనుక్కోవాలి.    

ఈ దేశంలో ఏదైనా తప్పు చేసినట్టు గుర్తించినా, అక్కడ ఉన్న చట్టాలకు విరుద్ధంగా వెళ్లినా జైలు లేదా డిటెన్షన్ సెంటర్లకు వెళ్లక తప్పదు.   

కిమ్ జోంగ్ ఉన్ తన డిక్టేటరు పరిపాలన వళ్ళ ఎప్పుడు వార్తలలో ఉంటాడు. 2013 వ సంవత్సరంలో తన మావయ్య ను సైతం ద్రోహం చేసాడనే నింద తో చంపేసాడు. 2017 వ సంవత్సరంలో తన తండ్రి రెండవ భార్య కుమారుడు తన సోదరుడు అయిన కిమ్ జోంగ్ నామ్ ( Kim Jong-nam) ను మలేసియా ఎయిర్ పోర్ట్ లో విషం చిమ్మి చంపేసాడు అనే ఆరోపణలు ఉన్నాయి.  

కిమ్ జోంగ్ ఉన్ బాల్యం:   

నార్త్ కొరియా కానీ అక్కడ పాలించే సుప్రీం నాయకుడి గురించి సంబంధించిన వివరాలు చాలా గుప్తంగా ఉంచటం జరుగుతుంది. కిమ్ జోంగ్ ఉన్ పుట్టిన రోజుకు సంబంధించిన తేదీ కూడా 3 రకాలుగా ఉంది.  

కిమ్ జోంగ్ ఉన్ మీడియా ద్వారా తన పుట్టిన రోజు  8 January 1982 అని తెలపటం జరిగింది. సౌత్ కొరియా మాత్రం ఆ పుట్టిన రోజు తప్పు అని కిమ్ జోంగ్ ఉన్ అసలు పుట్టిన తేది 8 January 1983 అని తెలపటం జరిగింది. ఈ రెండు తేదీలు పక్కన పెడితే అమెరికా మాత్రం కిమ్ జోంగ్ ఉన్ 8 January 1983 పుట్టాడు అని అంటుంది.  

 కో యోంగ్ -హుయ్ మరియు కిమ్ జోంగ్ – ఇల్ అనే దంపతులకు కిమ్ జోంగ్ ఉన్ జన్మించడం జరిగింది. కిమ్ కి  కిమ్ జోంగ్-చుల్ మరియు కిమ్ యో- జోంగ్ అనే అన్నా చెల్లెలు ఉన్నారు.  

కిమ్ జోంగ్ ఉన్ చదువు :

కిమ్ మరియు తన అన్నా చెల్లెలు ముగ్గురూ తమ చదువులను స్విట్జర్లాండ్ లోని ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూల్ లో మొదలు పెట్టారు.  

చొల్-పాక్ (Chol-pak) అనే పేరుతో 5 సంవత్సరాలు అక్కడ చదవటం జరిగింది. కానీ తరవాత అది కిమ్ కాదు అని తన అన్నయ్య కిమ్ జోంగ్-చుల్ ( Kim Jong-chul) అని వార్తలు రావటం జరిగింది. 2012 వ సంవత్సరంలో కిమ్ 1999 లో దిగిన ఫోటో మరియు 2012 లో దిగిన ఫోటో ను పోల్చగా 95% మ్యాచ్ అయ్యిందని తేల్చి చెప్పారు. కిమ్ 1990 లేదా అంతకన్నా ముందు నుంచి స్విట్జర్లాండ్ లో ఉన్నాడని తెలిసింది.      

కిమ్ జోంగ్ ఉన్ బెర్న్(Bern) అనే  స్విట్జర్లాండ్ నగరం లో 6 నుంచి 9 వ తరగతి వరకు చదివాడని గట్టి ఆధారాలు ఉన్నాయి. కిమ్ తనను తానూ Pak-un అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. తానూ చదివేటప్పుడు తన స్నేహితుడితో తానూ నార్త్ కొరియా సుప్రీమ్ నాయకుడి కొడుకును అని చెప్పుకున్నాడు.      

అధికారికంగా చేసినా దర్యాప్తులో కూడా ఒక నార్త్ కొరియన్ అబ్బాయి స్విజర్లాండ్ లో చదివాడని వెల్లడి అయ్యింది. చుదువులో బాగా చదవక పోయినా బాస్కెట్ బాల్ అంటే కిమ్ కి చాలా ఇష్టం అని అక్కడి వారు చెబితే తెలిసింది. అక్కడ చదివేటప్పుడు ఎక్కువగా ఎవరితో మాట్లాడక పోవటం మరియు అమ్మాయిలకు దూరంగా ఉండేవాడు.      

2002 నుంచి 2007 వరకు నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్యాంగ్ లో  Kim Il-sung యూనివర్సిటీ లో ఫిజిక్స్ లో డిగ్రీ సంపాదించాడు.  Kim Il-sung Military యూనివర్సిటీ లో ఆర్మీ ఆఫిసర్ గా డిగ్రీ సంపాదించాడు.  

దాదాపు 10 సంవత్సరాల వరకు కిమ్ జోంగ్ ఉన్ యొక్క ఒకటే ఫోటో మీడియా లో ఉంది. 2010 సంవత్సరంలో తన తండ్రి నార్త్ కొరియా ప్రజలకు తన కొడుకును అధికారికంగా పరిచయం చేసిన తరవాత తన ఫోటో లు వీడియోలు రావటం జరిగింది.   

నార్త్ కొరియా నాయకుడిగా కిమ్ జోంగ్ ఉన్ :  

కిమ్ జోంగ్ ఉన్ తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్య తో Kim Jong-నామ్ పుట్టాడు . రెండవ భార్య తో కిమ్ జోంగ్ ఉన్ పుట్టాడు. మొదట కిమ్ జోంగ్-నామ్ నే నాయకుడిగా ఎంచుకోవాలి అనుకున్న తండ్రి తన కొడుకు ప్రవర్తన అమ్మాయిల మాదిరిగా ఉందని ఎంచుకోలేదు. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి లాగే ఆలోచిస్తాడని నాయకుడిగా సరిగా సరిపోతాడని చివరికి కిమ్ నే నాయకుడిగా ఎంచుకోవటం జరిగింది.  

2009 వ సంవత్సరంలో కిమ్ జోంగ్ ఉన్ ను అధికారికంగా నార్త్ కొరియా సుప్రీమ్ నాయకుడిగా నియమించటం జరిగింది. కిమ్ కి ఏ మాత్రం మిలిటరీ అనుభవం లేకున్నా మిలిటరీ సేనాధిపతి గా నియమించబడ్డాడు.  

కిమ్ జోంగ్ ఉన్ చిన్నతనంలో వంటలు చేసే వ్యక్తి కేంజి ఫుజిమోటో (Kenji Fujimoto) నార్త్ కొరియా నుంచి 2001 వ సంవత్సరంలో పారిపోయాడు. 

కిమ్ అధికారంలో కి వచ్చిన తరవాత కేంజి ఫుజిమోటో ను నార్త్ కొరియా తిరిగి రావాలని కోరారు. 2012 వ సంవత్సరంలో కొరియా కు వచ్చిన కేంజి, నార్త్ కొరియా అప్పట్లో లాగా లేదని చాలా అభివృద్ధి చెందిందని అభిప్రాయం పడ్డాడు. కిమ్ తన వంట వాడిని శిక్షించకుండా  నార్త్ కొరియా రాజధాని లో ఒక హోటల్ కూడా పెట్టించాడు.     

కిమ్ జోన్ ఉన్ మనస్సు చాలాకఠినమైనది అని ప్రజల గురించి పట్టించుకోడని ప్రచారాలు వార్తలలో ఉంటాయి కానీ 2014 లో రాజధాని ప్యోంగ్యాంగ్  లో ఒక భవనం కూలినప్పుడు చాలామంది చనిపోయారు. ఆ సమయంలో ఒక రాత్రి మొత్తం పడుకోకుండా కిమ్ చాలా భాధ పడ్డాడు.    

నార్త్ కొరియాలో శిక్షలు: 

నార్త్ కొరియా లో చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చాలా కఠినంగా శిక్షిస్తారు. నార్త్ కొరియా లో పర్యాటకులు వెళ్లినా వారి కెమెరాలు అన్ని చెక్ చేసి పంపించటం జరుగుతుంది. ఎల్లప్ప్పుడు ఒక వ్యక్తి పర్యాటకుల వెంట ఉండి వారి గమణికలను చూస్తూ ఉంటారు.   

నార్త్ కొరియాలో మిలిటరీ కి సంబంధించిన ఏ చిన్న సమాచారం  కూడా వెళ్ళటానికి వీల్లేదు. మిలిటరీ వాళ్ళ ఫోటోలు, మిలిటరీ కి సంబంచిన ఆయుధాల ఫోటో లు తీయటం నిషేధం. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు కూడా పడే అవకాశాలు ఉంటాయి.     

నార్త్ కొరియా లో సుప్రీమ్ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడిన, వారి పరిపాలన గురించి చేదుగా చెప్పిన కఠిన శిక్ష పడుతుంది. ఈ నియమాలను సొంత కుటుంబం వారు ఉల్లఘించిన శిక్ష తప్పదు.  కిమ్ మిలిటరీ లో పెద్ద పదవిలో ఉన్న సొంత  మవయ్య ను కూడా ద్రోహం చేసాడనే ఆరోపణలతో చంపి వేయటం జరిగింది.     

తన మావయ్యనే చంపడం కాకుండా తన పిల్లలు, మనవళ్లను సైతం మొత్తం కుటుంబాన్ని చంపివేయటం జరిగింది.   

నార్త్ కొరియా లో మరణ శిక్షలు పది చనిపోయిన వారి వివరాలు బయటికి రావటం చాలా కష్టం, అందుకే ఎంత మంది ఉరి శిక్షలు పడి చనిపోయారు లేదా చట్టాన్ని ఉల్లఘించి చనిపోయారు అని చెప్పటం చాలా కష్టం.  

ఒట్టో వార్మ్ బీర్ (Otto Warmbier) అనే అమెరికాకు చెందిన యువకుడు నార్త్ కొరియా లో ఒక  పోస్టర్ దొంగతనం చేసాడని జైలు పాలు చేసారు. కొద్దీ రోజుల తరవాత తలకు గాయం అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు,తరవాత చనిపోవటం జరిగింది. ఒట్టో ను నార్త్ కొరియా లో బాగా టార్చర్ చేశారని, కిమ్ జోంగ్ఆ ఉన్ కావాలని యువకుడిని చంపేశాడని అమెరికా ప్రజలు ఆరోపించారు.     

మిస్సైల్ మరియు న్యూక్లియర్ ఆయుధాలు:  

కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో నార్త్ కొరియా న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయటం వాటిని టెస్ట్ చేయటం చేస్తూ ఉంటారు. 2013 నుంచి 2017 వరకు 80  మిస్సైల్ టెస్టులు చేసారు.  

కిమ్ జోంగ్ ఉన్ ప్రకారం న్యూక్లియర్ ఆయుధాలు ఉంటేనే వేరే దేశాలు తమ దేశం పై దాడి చేయవని భావిస్తారు. తమ దేశంలో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని అవి అమెరికాలో ఏ చోటైనా దాడి చేసే రకంగా ఉన్నాయని కిమ్ అమెరికాను హెచ్చరించాడు.   

కిమ్ జోంగ్ ఉన్ ఫ్యామిలీ : 

2009 లో తాను Ri Sol-ju అనే అమ్మాయి తో పెళ్లి చేసుకున్నాడు కానీ 2012 వ సంవత్సరం తాను చెప్పేవరకు ఎవరికీ తెలియదు. వీరికి ఒకటే సంతానం అని అంటారు కానీ కిమ్ జోంగ్ ఉన్ కి  ముగ్గురు సంతానం అని చాలా మంది నమ్ముతారు.  

కిమ్ జోంగ్ ఉన్ తన జీవితాన్ని చాలా విలాసవంతంగా జీవిస్తాడు తన వద్ద లగ్జరీ కార్లు, ఇల్లు, ప్రైవేట్ జెట్ మరియు యాక్ట్ ఉన్నాయి.    

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం:  

కిమ్ జోంగ్ ఉన్ సిగరేట్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంది. 2009 సంవత్సరంలో షుగర్ మరియు హై బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలతో భాధ పడుతున్నాడని తెలిసింది.   

130 కిలోల బరువు గల కిమ్ 2014 లో ఆరోగ్యం క్షీణించటం వళ్ళ దాదాపు రెండు నెలల వరకు బయటికి రాలేదు. తరవాత మీడియా ముందుకు ఒక కర్ర సహాయంతో నడుస్తూ కనిపించటం జరిగింది.  

నార్త్ కొరియా లో ఏప్రిల్ 15 న డే అఫ్ ద సన్ (Day of the Sun) అనే రోజును జరుపుకుంటారు. ఈ రోజు కిమ్ యొక్క తాత మరియు నార్త్ కొరియా స్థాపకుడి యొక్క పుట్టిన రోజు. 

కిమ్ జోంగ్ ఉన్ ఇంత ముఖ్యమైన రోజు కనిపించక పోవటం తన ఆరోగ్య పరిస్థితి గురించి చాలా ప్రశ్నలు రావటం మొదలు అయ్యాయి.  కొన్ని వార్తల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ కి గుండె కు సంబంచిన సర్జరీ జరిగిందని వార్తలు రావటం మొదలు అయ్యాయి.  

25 ఏప్రిల్ 2020 కి చైనా నుంచి కూడా డాక్టర్లు కిమ్ కి వైద్యం చేయటానికి వెళ్లారని తెలిసింది.సౌత్ కొరియా తెలిపిన వివరాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం బాగానే ఉంది అని బ్రతికే ఉన్నాడని తెలిపింది. కిమ్ జోంగ్ ఉన్ మీడియా ముందు వచ్చే వరకు తన ఆరోగ్యం గురించి చెప్పటం కష్టమే.     

Leave a Comment