Instagram success story in Telugu – ఇంస్టాగ్రామ్ సక్సెస్ స్టోరీ

ఇంస్టాగ్రామ్ ఒక ఇమేజ్ షేరింగ్ వెబ్ సైట్ ఈ రోజు ప్రతి సెలబ్రిటీ లేదా కొంచెం కూడా ఫేమస్ అయిన వారు ఇంస్టాగ్రామ్ తప్పకుండా వినియోగిస్తారు.   

  2010 వ సంవత్సరంలో  కెవిన్ సైస్ట్రోమ్ (Kevin Systrom) మరియు మైక్ క్రేగెర్ (Mike Krieger) అనే ఇద్దరు కలిసి ఇంస్టాగ్రామ్ ను కనుగొన్నారు. 

ఇంస్టాగ్రామ్ అసలు ఎలా కనుగొన బడింది ? 

ఇంస్టాగ్రామ్ ను మొదటి సారి తయారు చేసినప్పుడు బర్బన్ (Burbn) అనే పేరు తో ఒక చెక్-ఇన్ ఆప్ తయారు చేశారు కానీ అప్పటికే బర్బన్ ను పోలిన ఆప్ లు ఉండటం వల్ల వేరే ఫీచర్ల తో ఇంకొక ఆప్ తయారు చేయాలనీ నిర్ణయించుకున్నారు.

తమ కు వచ్చిన కొత్త ఆలోచనతో బర్బన్ ను ఒక ఫోటో షేరింగ్ ఆప్ గా మార్చారు మరియు పేరు కూడా మార్చాలని నిర్ణయించుకున్నారు.  

ఇలా ఫోటో షేరింగ్ ఫీచర్ ను బర్బన్ ఆప్ లో పరిచయం చేసాక చాలా మంది కి ఈ ఫీచర్ బాగా నచ్చింది. ఈ  ఫీచర్ చాలా బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి ఈ ఆప్ ను కొత్త పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. Instant camera మరియు Teligram అనే రెండు పదాలను కలిపి  Instagram అని పేరు పెట్టారు. 

జులై 2010 వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ లో మొదటి పిక్చర్ ను అప్లోడ్ చేశారు. అక్టోబర్ 2010 వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ ఆపిల్ ఆప్ స్టోర్ లో విడుదల చేసారు. 

పేస్ బుక్ ఇంస్టాగ్రామ్ కొనుగోలు :  

ఏప్రిల్ 3 2012 వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ ఆండ్రాయిడ్ ఆప్ స్టోర్ లో కూడా విడదల చేసారు. ఇంస్టాగ్రామ్ పాపులారిటీ చూసిన పేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ను తన సొంతం చేసుకోవాలని అనుకుంది. ఏప్రిల్ 9, 2012 వ సంవత్సరంలో పేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ను 1 బిలియన్ డాలర్ల తో కొని తన సొంతం చేసుకుంది. 2012 వ సంవత్సరంలోనే ఇంస్టాగ్రామ్ వెబ్ సైట్ ను కూడా పేస్ బుక్ లాంచ్ చేయటం జరిగింది.  

ఇంస్టాగ్రామ్ : 

ఇంస్టాగ్రామ్ లో వినియోగదారులు తమ తమ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేయవచ్చు. ఈ పోస్ట్ లు ప్రైవేట్ గా కూడా పెట్టుకోవచ్చు, తమ ఫాలోవర్స్ మాత్రం చూసే విధంగా చేసుకోవచ్చు. 

ఇంస్టాగ్రామ్ లో ముందు 1:1 రేషియో ఉంది వినియోగదారులు కేవలం 640 పిక్సెల్ ఇమేజ్ అప్లోడ్ చేసే అవకాశం ఉండేది కానీ తరవాత దీనిని హై రెసొల్యూషన్ అంటే 1080 పిక్సెల్ లో కూడా అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. 

   2017 వ సంవత్సరంలో పోస్ట్ కింద కామెంట్స్ చేసే సౌకర్యం కూడా లభించింది. ఒక పోస్ట్ లో ఒకే పిక్చర్ అప్లోడ్ చేసే నిబంధన తొలిగించి 10 పిక్చర్ లు అప్లోడ్ చేసే సౌకర్యం కలిగించింది. 2011 వ సంవత్సరంలో హాష్ టాగ్ (#) వినియోగించడానికి సౌకర్యం కలిగించింది. ఈ హాష్ టాగ్ వళ్ళ ఏదైనా ఫోటో ను సులువుగా వెతకవచ్చు.  

EXPLORE

2012 వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ explore అనే ఫీచర్ ను ప్రవేశ పెట్టడం వల్ల ఇంస్టాగ్రామ్ లో ప్రముఖంగా జనాలు చూసే ఇష్టపడే విషయాలు లేదా ట్రేండింగ్ లో ఉన్న విషయాలు చూసే సౌకర్యాన్ని ఇచ్చింది.  2013 వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ వీడియో ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ను ఉపయోగించి యూజర్ 15 సెకండ్ ల వీడియో కూడా అప్లోడ్ చేయవచ్చు.    

IGTV

2018 వ సంవత్సరంలో IGTV అంటే ఇంస్టాగ్రామ్ టీవీ అనే ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ లో 10 నిమిషాల వీడియో 650 MB ఫైల్ సైజు తో అప్లోడ్ చేయాలనీ మరియు 60 నిమిషాల వీడియో 5.4 GB ఫైల్ సైజు తో అప్లోడ్ చేయవచ్చు అని నిర్ణయించింది.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫీచర్ కేవలం verified మరియు పాపులర్ యూజర్స్ కి మాత్రమే వర్తిస్తుంది.

2013 లో ప్రైవేట్ మెసేజ్ ఫీచర్ మరియు 2016 లో ఇంస్టాగ్రామ్ స్టోరీస్ అనే ఫీచర్ ను లాంచ్ చేసింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ కూడా వాట్సాప్ లాగా కేవలం 24 గంటల సమయ వ్యవధి తో ముగిస్తాయి.   

Nudity

ఇంస్టాగ్రామ్ న్యూడిటీ అనగా నగ్నత్వాన్ని ఎప్పుడు కూడా ప్రోత్త్సహించలేదు. కొంత మంది మహిళలు తమ ప్రైవేట్ పార్ట్స్ ను పాక్షికంగా చూపించి నందుకు వారి పోస్ట్ లను డిలీట్ కూడా చేసింది. Free the nipple అనే కాంపెయిన్ లో యూజర్లు తమ రొమ్ము లను బట్టలు లేకుండా పోస్ట్ చేయటం మొదలు పెట్టారు, ఈ రకమైన పోస్ట్ లను ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసేసింది.        

1 thought on “Instagram success story in Telugu – ఇంస్టాగ్రామ్ సక్సెస్ స్టోరీ”

Leave a Comment