Narendra modi biography in Telugu

నరేంద్ర దామోదర్ మోదీ భారత దేశ ప్రస్తుత ప్రధానమంత్రి.

సాధారణంగా నేతలు తమ రాజకీయ జీవితంలో అంచెలు అంచెలుగా ఎదుగుతారు. 

 మొదట కార్యకర్త గా పార్టీ లో మంచిగా పనులు చేస్తే  చిన్నపాటి ఎన్నికలయిన మున్సిపల్  ఎన్నికలలో అవకాశం దొరుకుతుంది.  

ఆ తర్వాత చాలా కష్టపడి పార్టీ పెద్దలను మెప్పిస్తే MLA టిక్కెట్ దొరికితే ఎన్నికలలో నిలబడతారు, అయినా కూడా గెలుస్తారనే నమ్మకం ఉండదు.   

నరేంద్ర మోదీ మాత్రం 51 సంవత్సరాలు RSS మరియు పార్టీ కోసం పనిచేసి MLA గా పోటీ చేసి గెలుస్తారు. MLA అయిన కొన్ని  నెలలకే గుజరాత్ ముఖ్యమంత్రి అవుతారు. 

మూడు సార్లు గుజరాత్  ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడి పార్టీ పెద్దల నిర్ణయం ప్రకారం 2014 లో మొదటి సారి ప్రధానమంత్రి గా పోటీ చేసి గెలుస్తారు. 

నరేంద్ర మోదీ తన జీవితంలో ఎప్పుడూ ఎన్నికలలో ఓడిపోలేదు. MLA గా మరియు ప్రధాన మంత్రి గా గెలిచాడే తప్ప ఓడిపోలేదు.

నరేంద్ర మోదీ దశాబ్దాల పాటు పూర్తి స్థాయి రాజకీయ నిర్వాహకుడిగా, వ్యూహకర్తగా మరియు క్షేత్రస్థాయి కార్యకర్తగా పనిచేశారు. 

51 సంవత్సరాల వయస్సులో మొదటి సారి గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికలలో  పోటీ చేసి గెలిచారు.  

బాల్యం:

తేదీ: సెప్టెంబర్ 17, 1950

స్థలం : వద్‌నగర్, బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత గుజరాత్, భారతదేశం).

తల్లి తండ్రులు: మూల్‌చంద్ మోదీ మరియు హీరాబెన్ మోదీ

నరేంద్ర మోదీకి ఐదుగురు తోబుట్టువులు (నలుగురు సోదరులు మరియు ఒక సోదరి) ఉన్నారు. దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోదీ మరియు హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించిన ఆరుగురు పిల్లలలో ఆయన మూడవవారు. 

చిన్న  వయస్సులో అప్పుడప్పుడు పాఠశాల నుంచి వచ్చిన తరవాత తన తండ్రి యొక్క చాయ్ కొట్టులో సహాయం చేసేవాడు.

అలాగే కేవలం 8 సంవత్సరాల వయస్సులో గుజరాత్‌లోని వద్‌నగర్ లో రోజువారీ శిక్షణా తరగతులకు (శాఖలకు) హాజరు కావడం ప్రారంభించారు.

అక్కడ ఆయన తన తొలి గురువు లక్ష్మణరావు ఇనామ్‌దార్‌ను కలుసుకున్నారు.

చిన్న తనం నుంచే సమాజం లో మార్పు తీసుకురావాలని ఆలోచించేవాడు. స్వామి వివేకానందా ను స్ఫూర్తి గా తీసుకోని ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

RSS:

17 సంవత్సరాల వయస్సులో ఇంటిని వదిలేసి భారతదేశమంతటా పర్యటించడానికి బయలు దేరాడు.

రెండు సంవత్సరాలు దేశ పర్యటన చేసిన తరవాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. 

ఈ రెండు సంవత్సరాలలో ఆయన తన జీవిత గమ్యంను అర్థం చేసుకున్నాడు. 1971 లో అహ్మదాబాద్ కి వెళ్లి అక్కడ RSS లో చేరాడు.

RSS అనేది సాధారణంగా భారతదేశంలోని ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థ అయిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ను సూచిస్తుంది. 

రోజంతా పూర్తి స్థాయి ప్రచారక్‌గా (కార్యకర్త/నిర్వాహకుడు) బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమం లో పాల్గొని కరపత్రాలను ముద్రించాడు మరియు రాజకీయ అసమ్మతివాదుల కోసం లాజిస్టిక్స్‌ను నిర్వహించాడు.

ప్రభుత్వం ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిని అరెస్ట్ చేయటం ప్రారంభించగా మోదీ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు.

ఇలా RSS లో పనిచేస్తూ మంచి పేరుని సంపాదించుకొని 1987 వ సంవత్సరంలో బీజేపీ పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చారు.

పార్టీ లోకి చేరిన తరవాత పార్టీ బాధ్యతలను చేపట్టి త్వరలోనే గుజరాత్ లోని బీజేపీ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు చేపట్టారు. 

1985 లో జరిగిన ఎన్నికలలో ప్రధాన వ్యూహకర్తగా ఉండి బీజేపీ పార్టీ ను గెలిపించారు.

ఆయన పని తనం నచ్చి పార్టీ యొక్క ముఖ్య నేతలు జాతీయ స్థాయి భాద్యతలను అప్పగించారు. 

జాతీయ కార్యదర్శి గా బాధ్యతలను తీసుకొని ఢిల్లీ లో నియామకం పొందారు. 

అక్కడ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మరియు పంజాబ్ వంటి ఉత్తర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను ఆయన  పర్యవేక్షించేవారు.    

ఢిల్లీ లో ఉండటం వల్ల మోదీ దేశమంతటా ఉన్న నేతల దృష్టిలో పడ్డారు. 1988 లో తన పనితనం నచ్చి పార్టీ వారు తనని జాతీయ కార్యదర్శి గా నియమించారు. 

పార్టీ లో ఇదే అత్యంత అత్యున్నత పదవి. 2001 వ సంవత్సరంలో గుజరాత్ లో బీజేపీ పార్టీ చాలా బలహీన పడటంతో ప్రధాన వ్యూహకర్త గా మోదీ తిరిగి గుజరాత్ కి పంపటం జరిగింది.

జనవరి 26, 2001 వ సంవత్సరంలో భుజ్ మరియు కచ్ ప్రాంతంలోని కొన్ని భాగాలను ఒక వినాశకరమైన భూకంపం తాకిడికి దాదాపు 20 వేల మంది చనిపోయారు. 

సహాయం మరియు పునరావాస చర్యలను నెమ్మదిగా, అస్తవ్యస్తంగా నిర్వహించినందుకు కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం తీవ్ర ప్రజా ఆగ్రహాన్ని మరియు విమర్శలను ఎదుర్కొంది.

Chiefminister: 

ప్రజలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి మరియు పేలవమైన పాలనపై వచ్చిన ఆరోపణల కారణంగా, బీజేపీ తన రాజకీయ పట్టును కోల్పోవడం ప్రారంభించింది.      

ఇంతకూ ముందు మోదీ గుజరాత్ లో వ్యూహకర్తగా చాలా బాగా పనిచేసినందుకు తనను అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కి ముఖ్య వ్యూహకర్తగా ఉండమని పార్టీ కోరింది. 

ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు ఎల్.కె. అద్వానీలతో కూడిన బీజేపీ అగ్రశ్రేణి జాతీయ నాయకత్వం, కఠినమైన పరిపాలనా నియంత్రణను అమలు చేయగల మరియు పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించగల ఒక చైతన్యవంతమైన నాయకుడు ఉండాలని మోదీ ను ముఖ్యమంత్రి పదవి కోసం ఎంచుకుంది.

ఇలా అక్టోబర్ 7, 2001 వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఏనూకోబడ్డారు. ఆ తరవాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 2014 లో ప్రధాన మంత్రి పదవి కోసం ఏనూకోబడ్డారు. 

ఇలా మోదీ తన జీవితంలో ఒక్క సారి కూడా ఓడిపోకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగుతున్నారు.       

Leave a Comment